వరద….వో వరదా!!!

అక్షరాల వరద… ఆగిపోయింది

ప్రముఖ పాత్రికెయులు శ్రీ గొవర్ధన సుందర వరదాచారి ఈ మధ్యాహ్నము కన్ను మూశారు. 92 సంవత్సరాల వరదాచారి గారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్థెలు వున్నారు.

జి.యస్.వరదాచారి జీవిత విశేషాలు
పత్రికా రచనలో అనుభవం 1955 వైష్ణవ పత్రిక నిర్వహణ ఆంధ్రజనతలో 24 జూన్ 1956 నుంచి 3 మార్చి 1961 వరకు తొలుత సబ్ ఎడిటర్ తర్వాత అసిస్టెంట్ ఎడిటర్గా ఆంధ్రభూమిలో 4 మార్చి 1961 నుంచి నవంబర్ 1982 వరకు న్యూస్ఎడిటర్ ఈనాడులో 22 డిసెంబర్ 1988 వరకు అసిస్టెంట్ ఎడిటర్గా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 23 డిసెంబర్ 1988 నుంచి విజిటింగ్ ప్రొఫెసర్గా, 2011 హెచ్ ఎం టి విలో తీర్పరిగా పురస్కారాలు పత్రకార్ శిరోమణి – కోల్కతాలో 1976 నవంబర్ 26వ తేదీన ఉదంత మార్తాండ్ అనే తొలి హిందీ పత్రిక 150వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సర్వభాషా పత్రకార్ సమ్మేళనంలో ప్రదానం. ప్రతిభా పురస్కారం – తెలుగు విశ్వవిద్యాలయం పత్రికా రంగంలో విశిష్ట కృషికి 1999లో అందించింది. దాసరి స్వర్ణపతకం ప్రదానం. – ఉత్తమ సినీ జర్నలిస్టుగా 1986లో వంశీ సంస్థ ద్వారా పత్రికా రచనాచార్య – షష్టిపూర్తి సన్మాన సభలో ప్రదానం. జీవన సాఫల్య పురస్కారం – రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ పాత్రికేయుడిగా జీవన సాఫల్య పురస్కారం ప్రచురణలు నా మాట – వివిధ పత్రికలలో ప్రచురితమైన సంపాదకీయాలు, వ్యాసాలు, లఘు వ్యాఖ్యలు, సమీక్షల సంకలనం. దిద్దుబాటు – పత్రికా రచనలో సాధారణంగా జరిగే పొరపాట్లపై సోదాహరణంగా రాసిన విమర్శనాత్మక వ్యాసాల సంపుటం. ఇలాగేనా రాయడం? – పత్రికలలో వచ్చే సంపాదకీయాలు, తదితర వ్యాఖ్యలలో కొరవడిన పాత్రికేయ నిష్పాక్షికతను విశ్లేషించే వ్యాసాల సంకలనం. మేషన్ అండ్ జర్నలిస్టిక్ ఎథిక్స్ – ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ పి.జి.డిప్లొమా విద్యార్థుల కోసం రాసిన పాఠ్యాంశం. భారత రాజ్యాంగం – డా. బి. ఆరబి. ఆర్. అంబేద్కర్, పత్రికా చట్టాలు – సార్వత్రిక విశ్వవిద్యాలయం వారికోసం రాసిన పాఠ్యాంశం. పత్రికా భాష – ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ప్రచురణ.

తెలుగు పత్రికల పుట్టుక, అభివృద్ధి, నూరేళ్ళ పత్రికా రచన సమీక్ష – ఆంధ్రజనత రాష్ట్రావతరణ సంచికలో 1956 నవంబర్ ఒకటిన ప్రచురితమైన వ్యాసం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ – ఆంధ్రప్రదేశ్ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర సమాచారశాఖ ప్రచురణ ప్రెస్ లాస్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జర్నలిస్టు యూనియన్ మీడియా హ్యాండ్ బుక్ ప్రచురణ. – నార్లవెంకటేశ్వరరావు – సాహిత్య అకాడమీ కోసం మోనోగ్రాఫ్ జ్ఞాపకాల వరద – స్వీయ చరిత్ర ఎమెస్కో ప్రచురణ తెలుగు పత్రికలు తీరు తెన్నులు వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రచురించిన అవర్ లెజెండ్స్ ఆఫ్ ఫోర్త్ ఎస్టేట్ పుస్తకం సంపాదకులలో ఒకరు రేడియో టీవీలలో అనేక ప్రసంగాలు, చర్చాగోష్ఠులు, తదితర కార్యక్రమాలతో బాటు పొలికేక, ప్రజాతంత్ర, తరుణ, కిరీటి వంటి తెలుగు పత్రికలలో, స్కైలైన్ ఇంగ్లీషు దిన పత్రికలో సినిమా శీర్షిక నిర్వహణ. ఇతర కార్యకలాపాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం, తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, జర్నలిజం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యత్వం. రచన జర్నలిజం కళాశాల నిర్వహణ మండలి సభ్యత్వం. రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర సబ్సిడీ కమిటీ ఉన్నంతకాలం (1976-78) సభ్యత్వం. జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ వారి స్క్రిప్టు కమిటీ సభ్యత్వం. తెలుగు అకాడమీ వారి పరిపాలనా న్యాయపదకోశం – సలహా సంఘ సభ్యత్వం – 1981 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాంస్కృతిక వ్యవహారాల రాష్ట్ర సలహా మండలి సభ్యత్వం 1981. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ సభ్యత్వం – 1999-2001 నందీ చలనచిత్రాల అవార్డుల కమిటీ సభ్యత్వం- 1983 మళ్ళీ 2003. నందీ టీవీ అవార్డుల కమిటీ సభ్యత్వం 2002 ఇతర పదవులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి కార్యదర్శి: 1962-64 ప్రధాన కార్యదర్శి 1964-66, అధ్యక్షుడు: 1980-81 ప్రెస్ క్లబ్ స్థాపక కార్యదర్శి: 1963-64. జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడు, 1975-78 ఎ.పి. సినీగోయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, 1977 నుంచి. జర్నలిస్ట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, 1986-90 మళ్ళీ ఆగస్టు 2001 నుంచి 2006 వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా 2022 వరకు కొనసాగారు విద్యాత్మక అర్హతలు 1954 ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ. 1956 జర్నలిజంలో పి.జి.డిప్లొమా 1959 యల్.బి. డిగ్రీ. తండ్రి గోవర్ధన కృష్ణమాచార్యులు తల్లి: కమ్మ పుట్టిన తేదీ 15 అక్టోబర్ 1932. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జననం.

Leave a Reply