Suryaa.co.in

Andhra Pradesh

సమాజంలో వివక్షకు గురౌతున్న సెక్స్ వర్కర్స్

విజయవాడ, డిశంబర్ 9: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా మరియు వాణిజ్య లైంగిక దోపిడీకి గురైన మహిళల్లో షుమారు 88 శాతం మంది నేటికి మన సమాజంలో చీత్కారాలు, అవమానాలు తో పాటు వివక్షత కు గురై తాము మనుషులము తమకు మనవ హక్కులు వరిస్తాయి అనే విషయం కూడా తెలియక తామే ఏదో చేయకూడని కఠిన నేరాలు చేసిన నేరస్తులుగా భావించుకొంటూ నేటికి ఈ సమాజంలో తమ వెతలు, భాధలు, కన్నీళ్లు తుడిచే వాళ్ళు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అక్రమ రవాణా భాదితుల రాష్ట స్థాయి భాదిత మహిళా సంఘం “విముక్తి” రాష్ట్ర నాయకులు శ్రీమతి అపూర్వ , శ్రీమతి పుష్ప, మౌనిక, భాజీవలి, లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు.

“అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం” పురష్కరించుకొని శుక్రవారం స్థానిక ఎస్.ఎన్. ఆర్ హోటల్ సమావేశ మందిరం లో “విముక్తి” సంస్థ మీడియా సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో విముక్తి రాష్ట్ర అధ్యక్షరాలు శ్రీమతి అపూర్వ మాట్లాడుతూ మానవ హక్కుల్లో పేర్కొన్న విధంగా దేశం, రాష్ట్రంలో కులం, మతం, చేసే పనితో సంభందం లేకుండా మానవలు అందరికి సమానంగా మనవ హక్కులు వరిస్తాయని కాగితాల్లో, ఉపన్యాసాలలో చెప్తున్నారే కాని ..తనకు తెలియకుండా ఎవరి చేతనో మోసగించబడి బలవంతంగా వ్యభిచారం లోకి నెట్టబడి .. వివిధ సమస్యలు, హింస, వివక్షత ఎదుర్కొంటున్న భాదిత మహిళలకు కుడా ఈ మనవ హక్కులు వర్తిస్తాయి అనే విషయం ప్రభుత్వ అధికారులు, పాలకులు, సమాజంలో ఉన్న పెద్ద మనుష్యులుకు ఎందుకు గుర్తుకు రావడం లేదో తమకు అర్ధం కావడంలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అలాగే జాతీయ మనవ హక్కుల కమీషన్ తమ వివిధ తీర్పు లలో వ్యభిచారం లో మగ్గుతున్న లేదా బయటకు వచ్చిన మహిళలకు అన్ని మానవ హక్కులు వర్తిస్తాయని.. వారి మానవ హక్కులకు ఉల్లంఘన జరగకుండా భద్రత కలిపించవలిసిన భాద్యత కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, అలాగే వారికీ సమాజంలోని అన్ని వర్గాల మహిళలకు కల్పిస్తున్న అన్ని పధకాలు, సౌకర్యాలు వెంటనే అందించ వలిసిన భాద్యత కూడా ప్రభుత్వ అధికారుల దే అని చెప్పినా నేటికి ఎక్కడ అవి అమలుకు నోచుకోవడం లేదు అని విముక్తి కార్యదర్శి శ్రీమతి .పుష్ప ఆవేదన వ్యక్తం చేసారు.

విముక్తి రాష్ట్ర అద్యక్షరాలు శ్రీమతి అపూర్వ మాట్లాడుతూ సమాజంలో వ్యభిచారం నుంచి బయటకు వచ్చిన మహిళలు నేటికి సమాజం, పాలకులు, ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు తో పాటు తమ స్వంత కుటుంబ సభ్యులు కూడా భాదిత మహిళలు పై చిన్న చూపు చూస్తూ , అవహేళన చేస్తూ వారి పట్ల వివక్షత చుప్తున్నారని ఫలితంగా వారు చావలేక బతకలేక అల్లాడుతూ ఉన్నారని ఆమె అంటు …ఇటీవల హెల్ప్ సంస్థ, సంజోగ్ సంస్థ సహకారం తో రాష్ట్రంలో ఈ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షత పై ఒక సర్వే చేసామని అంటూ ఆ సర్వ్ వివరాలు వెల్లడించారు………
• 88% భాదితులు మరియు సెక్స్ వర్కర్లు వివక్ష ను ఎదుర్కొంటున్నారు.
• వివక్ష యొక్క ప్రధాన కారకులు తక్షణ కుటుంబ సభ్యులు (తల్లిదండ్రులు మరియు భాగస్వాములు (37%) మరియు బంధువులు (16%) మరియు పొరుగువారు (27%)
• 63% మానవ అక్రమ రవాణా భాదితులు మరియు సెక్స్ వర్కర్లు వివక్ష ఎదుర్కొన్నప్పుడు కుటుంబం నుండి ఎటువంటి మద్దతు పొందలేదు.
• కుటుంబ సభ్యుల్లో అసలు ఏమాత్రం మద్దతు ఇవ్వని వారు తల్లిదండ్రులు మరియు సోదరులు.

రేస్క్యు కాబడిన అక్రమ రవాణా భాదితుల కోసం షెల్టర్ హోమ్‌ల ద్వారా పునరావాసాన్ని కల్పించే విధానానికి బదులుగా కమ్యూనిటీ-బేస్డ్ రీహాబిలిటేషన్ (CBR) మోడల్‌ ను అమలు పరచాల్సిన అవసరం ఉందని మేము విశ్వసిస్తున్నాము.

విముక్తి డిమాండ్లు:
• నివారణ – మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి భారతదేశం కేవలం స్పందిచడం మాత్రమే కాకుండా ఒక విధానాన్ని అభివృద్ధి చేయాలి.
• AHTUలు: AHTUలు ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలి మరియు క్రియాశీలమైన దర్యాప్తు చేపట్టడం ద్వారా మానవ అక్రమ రవాణా జరిగే మూల స్థానాల్లో ట్రాఫికర్లను కనుగొని శిక్షలు పడేలా చేయడం పై దృష్టి పెట్టాలి.
• బాధితులకు నష్ట పరిహారం: భాదితులకు నష్టపరిహారం పొందడంలో గణనీయమైన పెరుగుదల అవసరం.. దీనిని ఎక్కడ అమలు చేయడంలేదని గుర్తించేందుకు పర్యవేక్షణ సంస్థలను ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వాలు పరిగణన లోకి తీసుకోవాలి.
• CBR: కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ (CBR) విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయడం ద్వారా దీనిని ప్రభుత్వ పునరావాస విధానం లో భాగంగా చేర్చాలి.
• ఆర్థిక చేయూత మరియు రక్షణ: రుణ వలయాన్ని తగ్గించడం మరియు క్విడ్ ప్రోకోగా ఒప్పంద కార్మికులను పెంచడం.

ఈ సమావేశంలో విముక్తి నాయకులు తో పాటు, హెల్ప్ సంస్థ్ ప్రతినిధులు శ్రీమతి రోజా, షర్మిళ, బాజీబి మరియు ఈశ్వరి పాల్గొన్నారు…

LEAVE A RESPONSE