October 9, 2026

రాహుల్ గాంధీ పై లైంగిక వేధింపుల కేసు పెట్టాలి

  • రాహుల్ గాంధీ ఢిల్లీ లో పోలీసుల పై జులుం చేశారు
  • రాహుల్ గాంధీ మా ఎమ్మెల్యేల పై రేవంత్ పెట్టిన అక్రమ కేసులకు సారీ చెప్పాలి
  • రాహుల్‌గాంధీకి ఒక న్యాయం..తెలంగాణలో ఒక న్యాయమా?
  • నిరసనల విషయం లో కాంగ్రెస్ ద్వంద్వ నీతి
  • రాహుల్ ఢిల్లీ లో నిరసనలు చేస్తుంటే తెలంగాణ లో నిరసనలు చేస్తున్న ప్రతిపక్షం పై రేవంత్ కేసులు పెడుతున్నాడు
  • ఎల్ ఓ పి హుందాతనం రాహుల్ ప్రదర్శించడం లేదు
  • ప్రియాంక గాంధీ కూడా పోలీసుల పై దురుసుగా ప్రవర్తించారు
  • సీఎం హోదా లో రేవంత్ ఢిల్లీ లో ధర్నా లో కూర్చుని నీతులు చెబుతున్నారు
  • రోహింగ్యాల ఓట్లు తీసివేయండి..మేం వద్దంటలేం
  • మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒంటెద్దు నరసింహ రెడ్డి

నిరసనల విషయం లో కాంగ్రెస్ ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోంది. రాహుల్ ఢిల్లీ లో నిరసనలు చేస్తుంటే తెలంగాణ లో నిరసనలు చేస్తున్న ప్రతిపక్షం పై రేవంత్ కేసులు పెడుతున్నాడు. రాహుల్ ఢిల్లీలో మహిళా పోలీసుల పై అనుచితంగా ప్రవర్తించారు. అసెంబ్లీ ముందు మా ఎమ్మెల్యేల నిరసనలపై కావాలనే లైంగిక వేధింపుల కేసులు పెట్టారు. రాహుల్‌గాంధీకి ఒక న్యాయం..తెలంగాణలో ఒక న్యాయమా?

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం సర్కార్‌ నడుపుతుందా..సర్కస్ నడుపుతుందా? రాహుల్‌గాంధీ రాజ్యాంగం పట్టుకుని నీతులు చెబుతారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇక్కడ అక్రమ కేసులు పెడుతున్నారు. కరెంట్ లేక రైతులు ధర్నాలు చేస్తుంటే పట్టించుకోవడం లేదు. ట్రాన్స్‌ఫార్మర్‌ డీడీలు గతం లో ఐదు వేలు ఉంటె రూ. 10 వేలు చేశారు. కేటీఆర్‌ కాలిగోటికి కూడా రేవంత్‌ సరిపోరు.

ఫార్మ్ హౌజులు ఆస్తులు అంటూ రేవంత్ డై వర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ లో ప్రతిపక్షం పట్ల రేవంత్ అనుసరిస్తున్న వైఖరి ని నిలదీయాలి. తాను ఢిల్లీలో స్వేచ్ఛగా నిరసనలు చెస్తున్నట్టే, బీ ఆర్ ఎస్ ఆందోళనలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని రేవంత్ కు ఆదేశించాలి, ఎల్ ఓ పి హుందాతనం రాహుల్ ప్రదర్శించడం లేదు. ప్రియాంక గాంధీ కూడా పోలీసుల పై దురుసుగా ప్రవర్తించారు

సీఎం హోదా లో రేవంత్ ఢిల్లీ లో ధర్నా లో కూర్చుని నీతులు చెబుతున్నారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం ఖూనీ అని అంటున్న రేవంత్ తెలంగాణ లో ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీ లాగే బీ ఆర్ ఎస్ తెలంగాణ లో ఆందోళనలు చేపడితే రేవంత్ పోలిసులను ప్రయోగించడం మానుకోవాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్ నాకు పరువు నష్టం నోటీసులు పంపారు. స్పీకర్ గౌరవానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు.

.స్పీకర్ దానం నాగేందర్ విషయం లో తీసుకున్న నిర్ణయాన్ని హై కోర్టు ,సుప్రీం కోర్టులు తప్పు పట్టాయి. వాటికి కూడా స్పీకర్ నోటీసులు జారీ చేస్తారా ? రేవంత్ పాలన మీద దృష్టి పెట్టి డైవర్షన్ రాజకీయాలు మానుకుంటే మంచిది. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. పెట్టాల్సి వస్తే రాహుల్ గాంధీ పైనే లైంగిక వేధింపుల కేసు పెట్టాలి. బీజేపీ నేతలు ఓట్ చోరీ చేస్తుంటే రేవంత్ రెడ్డి కరెంటు చోరీ చేస్తున్నాడు.

రైతు బంధు చోరీ చేశారు ..రైతు బీమా చోరీ చేశారు. కేసీఆర్ కిట్ చోరీ చేశాడు. రేవంత్ పాలన మొత్తం చోరీ పాలన అయ్యింది. అసెంబ్లీ వద్ద బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల పై పోలీసులు జులుం చేస్తే రాహుల్ గాంధీ ఢిల్లీ లో పోలీసుల పై జులుం చేశారు. రాహుల్ గాంధీ మా ఎమ్మెల్యేల పై రేవంత్ పెట్టిన అక్రమ కేసులకు సారీ చెప్పాలి. రాష్ట్రం లో ప్రజాస్వామ్యం లేదు.
రాహుల్ గాంధీ నీతులు రాష్ట్రంలో అమలు కావడం లేదు. రేవంత్ రెడ్డి కి ప్రజా సమస్యలు పరిష్కరించడం చేత కాక డై వెర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కరెంటు సరిగా లేక పంటలు ఎండిపోతున్నా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. సాగునీటి రంగం లో ప్రభుత్వ అలసత్వం రైతులకు శాపం లా మారుతోంది. ఇకనైనా పాలన పై రేవంత్ ద్రుష్టి పెట్టి చిల్లర రాజకీయాలు మానాలి.

సీఈసీ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తోంది. SIR పేరుతో చాలా చోట్ల ఓట్లు తొలగిస్తున్నారు.
ఎలక్షన్ కమిషన్ జారీ చేసే ఫామ్‌ రాజ్యాంగబద్ధంగా నిర్ణయించబడింది. మార్పు చేయడానికి ఎలక్షన్ కమిషన్‌కు కూడా అధికారం లేదు. కొత్త ఓటర్ల నమోదుకు ఫామ్‌ -6, SIRలో ఓటు కోల్పోతే వాళ్లు కూడా ఫామ్‌ -6తో దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో ఉన్న ఈఆర్‌ఓలకు ఎవరికి కూడా ఈసీ నెట్‌తో అనుమతి లేదు. డైరెక్ట్‌గా కేంద్ర ఎన్నికల సంఘంతోనే ఉంది. రోహింగ్యాల ఓట్లు తీసివేయండి..మేం వద్దంటలేం. నిజమైన భారతీయ పౌరుల ఓట్లు తీసివేయడానికి హక్కు లేదు.

దేశ ఎన్నికల సంఘాన్ని వెనుకేసుకోవడానికి బీజేపీ నేతలకు ఏం సంబంధం? ఇతర పార్టీలపై రాజకీయంగా దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసిన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు. ఏ ఆర్టికల్ అడ్డం పెట్టుకుని దేశంలో ఎలాంటి కారణాలు లేకుండా. ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరప్‌ చేసింది కాంగ్రెస్ పార్టీ? సీఈసీ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.

ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేతలు కంచర్ల కృష్ణా రెడ్డి , రామచంద్రు నాయక్, ధర్మేందర్ రెడ్డి, పడాల సతీష్ , మహిపాల్ ముదిరాజ్ పాల్గొన్నారు.

Total Visitors: 2,909,279