Suryaa.co.in

National

శ్రీధర్ బాబు కు ఆస్కార్ అవార్డు ఇవ్వా లి

– మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు

మంథని: నియోజకవర్గం లో అనేక విచిత్రాలు జరుగుతున్నాయి.

మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంత్రిగా కొనసాగుతున్నారు. శ్రీధర్ బాబు సినిమా నటులకు మించి నటిస్తున్నారు. శ్రీధర్ బాబు కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఆస్కార్ కమిటీ కి లేఖ రాస్తున్నాం.

మంథని లో తెర వెనుక ఏన్నో పనులు చేస్తూ మంచి వాడిగా చలామణి అవుతున్న శ్రీధర్ బాబు కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాల్సిందే. మంథని మధుకర్ అనే ఆయన 2015 లో చనిపోయారు. మధుకర్ అన్నయ్య సమ్మయ్య , తన తమ్ముడి హత్యకు కారణమైన వారి పేర్లతో పోలీసులకు పిర్యాదు చేశాడు.

సమ్మయ్య ఫిర్యాదు చేసిన వ్యక్తిని వెనక పెట్టుకుని, శ్రీధర్ బాబు ఆయన పై పిర్యాదు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతారు .అలాంటి నటుడు శ్రీధర్ బాబు. ఎంపీ గడ్డం వంశీ కి ప్రోటో కాల్ పరంగా అన్యాయం చేసింది శ్రీధర్ బాబు అనే సంగతి అందరికీ తెలుసు.అయినా శ్రీధర్ బాబు తాను దేవుడు అని దళిత సంఘాలతో మాట్లాడిస్తాడు.

కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రీధర్ బాబు పదవులు ఇవ్వడం లేదని నేను మాట్లాడితే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. మేధావి గా కీర్తించబడుతున్న శ్రీధర్ బాబు మంథని ని పట్టించుకోవడం లేదు. మంథని కి మంత్రి శ్రీధర్ బాబు ఓ ఐటీ పరిశ్రమ తేలేకపోయారు. పరిశ్రమ కూడా తేలేక పోయారు. మంథని లో ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మత్తుల కంపెనీ పెట్టిస్తామని శ్రీధర్ బాబు ఓ ఎంపీపీ లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా పని చేసిన శ్రీధర్ బాబు ను 6 గ్యారంటీలు ,420 హామీల అమలు పై అందరూ ప్రశ్నించాలి

LEAVE A RESPONSE