Suryaa.co.in

Telangana

ఎక్కడున్నారు ప్రియాంక గాంధీ గారు?

– ఏమైంది నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ?
– ఇది దగా క్యాలెండర్.. మెగా డీఎస్సీ దగా డీఎస్సీ!
– దొంగవు నువ్వు,. అబద్దాల ఆడింది నువ్వు ..పిల్లల మీద నెపం వేస్తున్నావు
– తెలంగాణ భవన్ లో విద్యార్థులు, నిరుద్యోగులతో భేటీ అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు …

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్, వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత తెలంగాణ వచ్చి, ఛలో సెక్రెటేరియట్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. సీపీఎం కూడా ప్రకటించింది, మీరు కూడా ప్రకటించాలని అడిగారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే దాకా అసెంబ్లీ లోపల, బయట బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించి 95శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చేసింది బిఆర్ఎస్, కేసీఆర్ . లక్షా 62వేల ఉద్యోగాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. నేను వివరాలు విడుదల చేస్తున్నాను.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తున్నది, మేం ఉద్యోగాలు ఇవ్వడం లేదని. మేం గట్టిగా ప్రశ్నిస్తే, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. వెంటనే చర్చ పెట్టకుండా సభ వాయిదా వేసుకొని పారిపోయారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్ లెస్ క్యాలెండర్ అని ఆరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసినం. తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టినం.

జాబ్ క్యాలెండర్ లో చెప్పిన నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఎస్పీడీసీఎల్, ఫారెస్ట్, గ్రూప్స్, డీఎస్సీ, పోలీసు ఇలా అన్ని శాఖల్లో పోస్టుల భర్తీ అని జాబ్ క్యాలెండర్ లో చెప్పారు. ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు, ఇది దగా క్యాలెండర్. మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయ్యింది, అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వని చరిత్ర కాంగ్రెస్ ది. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. 20 నెలలు కావొస్తున్నా నోటిఫికేషన్లు లేని పరిస్థితి,.

నోటిఫికేషన్లు వద్దు అని విద్యార్థులు ధర్నా చేస్తున్నరని అబద్దాలు మాట్లాడుతున్నడు రేవంత్ రెడ్డి మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు.

ఓడ దాటినంక ఓడ మల్లన్న ఓడ దాటినంక బోడి మల్లన్న అన్న తీరుగా ఉంది 20 నెలల్లో నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 12వేలు దాటలేదు రేవంత్ రెడ్డి. యువతను దారుణంగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఏడాదికి 16వేల ఉద్యోగాలు సగటున మేం ఇస్తే, రెండేళ్లుగా నువ్వు సగం కూడా ఇవ్వలేదు. దొంగవు నువ్వు, అబద్దాల ఆడింది నువ్వు పిల్లల మీద నెపం వేస్తున్నావు.

నోటిఫికేషన్లు ఇవ్వ చేతగాక అబద్దాలు మాట్లాడుతున్నవు

ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేసారు ఇందిరాగాంధీ మనవరాలుగా మాటిస్తున్నాను అని రిలీజ్ చేశారు. ఎక్కడున్నారు ప్రియాంక గాంధీ గారు. ఏమైంది నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదు ప్రియాంక గారు? మీ కుటుంబం గౌరవం తీస్తున్నడు రేవంత్ రెడ్డి.

5 అంశాల్లోని యూత్ డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు కాలేదు

అమరుల కుటుంబాలకు నెలకు 25వేల పించన్ అన్నారు, రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తం అన్నరు ఏమైంది?
యూత్ డిక్లరేషన్ దిక్కు లేకుండా పోయింది. 75 శాతం ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ బీసీలకు మేలు చేసేలా రిజ్వరేషన్ తెస్తం అన్నరు. ఈ మాట దేవుడెరుగు గాని, జీవో 29 రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ బీసీలకు నియామకాల్లో దగా చేశారు.

విద్యార్థి భరోసా కార్డు రాలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రియాంక గాంధీ ఒక్క హామీ అమలు కాలేదు, రాహుల్ గాంధీ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని నిరుద్యోగులకు మాట ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నరు మాట తప్పారు. సోనియా, రాహుల్, ప్రియాంకా అందరూ.. నిరుద్యోగులను మోసం చేసారు.

తక్షణం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

రేవంత్ రెడ్డి గోబెల్స్ ను మించి పోయి మాట్లాడుతున్నడు. 60వేల ఉద్యోగాలకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయి రేవంత్ రెడ్డి.
ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు? ఎప్పుడు పరీక్ష పెట్టారు? ఎప్పుడు ఫలితాలు ఇచ్చారు వివరాలు వెల్లడించండి.
కోదండరాం, బల్మూరి వెంకట్, ఆకునూరి మురళి, రియాజ్ లు వచ్చి మభ్యపెట్టారు. మాయ మాటలు చెప్పి విద్యార్థులను రెచ్చ గొట్టారు.
విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదు కానీ, రెచ్చగొట్టిన వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్తే బెదిరిస్తున్నరు, కొడుతున్నరు. అక్రమ కేసులు పెడుతున్నరు.

ప్రశ్నించిన పిల్లల మీద దాడులు చేస్తున్నారు. నిరుద్యోగులు భయపడకండి. మీరు పోరాడండి మీ వెనుక బిఆర్ఎస్ పార్టీ ఉంటుది.
పోరాటం తెలంగాణ రక్తంలోనే ఉంది. మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తం, మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం. మానుకోట నుంచి వచ్చిన శ్రీధర్ ఫీజు రీయెంబర్స్ మెంట్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

3000 కోట్ల ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేస్తం అన్నరు, ఏ ఏడాదికి ఆ ఏడాది ఇస్తం అన్నరు. ఫీజు రీయెంబర్స్ మెంట్ ఒక్క రూపాయి ఇవ్వక కాలేజీలు మూత పడుతున్నాయి. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు మూత పడుతున్నాయి. బడా కాంట్రాక్టర్లకు 12వేల కోట్లు విడుదల చేసావు. పిల్లలు కమిషన్ ఇవ్వడం లేదని ఇవ్వడం లేదా?

ఆర్ఎస్ హయాంలో 20వేల కోట్ల ఫీజు రీయెంబర్స్ మెంట్ ఇచ్చారు.

కరోనా వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా కేసీఆర్ ఆపలేదు

ఎస్సీలు, బీసీలు, మైనార్టీల పిల్లలు అంటే ఎందుకు అంత చిన్న చూపు

విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్నావు రేవంత్ రెడ్డి

తక్షణం ఫీజు రీయెంబర్స్ మెంట్ ఇవ్వాలని, రెండు లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని, నాలుగు వేల భృతి ఇవ్వాలని, అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా హలో నిరుద్యోగి, చలో సెక్రటేరియట్ పోస్టర్ ను మాజీ మంత్రి ఆవిష్కరించారు.

LEAVE A RESPONSE