Suryaa.co.in

Telangana

జగన్ సీఎం గా రాష్ట్రానికి వస్తే గౌరవించుకోవద్దా ?

– మీరు చంద్రబాబు దగ్గరికి క్యూ కట్టలేదా ?
– బీజేపీ నేతలు రండల్లా మాట్లాడుతున్నారు
– ఉత్తమ్ వి ఉత్తరకుమార మాటలు
– బాబు ,రేవంత్ రెడ్డి ,కాంగ్రెస్ ,బీజేపీ లే తెలంగాణ కు సరైన నీటి వాటా దక్కక పోవడానికి కారణం
– కేసీఆర్ ను విమర్శించడానికి కిషన్ రెడ్డి బండి సంజయ్ లకు సిగ్గుండాలి
– మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ దాచిపెట్టుకున్న కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకెళ్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఏపీ నీటి దోపిడీతో తెలంగాణ లో సాగు ,తాగు నీళ్లకు కటకట ఏర్పడే పరిస్థితి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు హరీష్ రావు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి ఉత్తమ్ చెత్త మాటలు మాట్లాడారు. ఉత్తమ్ వి ఉత్తరకుమార మాటలు.

రాష్ట్రానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మాట్లాడితే కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ లోనూ అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీ లే. చంద్రబాబు ,రేవంత్ రెడ్డి ,కాంగ్రెస్ ,బీజేపీ లే తెలంగాణ కు సరైన నీటి వాటా దక్కక పోవడానికి కారణం. ఉత్తమ్ కుమార్ ఎవరో రాసిచ్చింది చదివారు. రేవంత్ రెడ్డి తిట్లతో సీఎం అయ్యారు .తాను కూడా అదే భాష తో మాట్లాడితే సీఎం అవుతా అని ఉత్తమ్ అనుకుంటున్నారేమో.

పదేళ్ల కేసీఆర్ పాలన లోసాగు తాగు నీళ్లకు ఎలాంటి కష్టం వాటిల్ల లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడిన చెత్తనే ఉత్తమ్ కేసీఆర్ మీద మాట్లాడుతున్నారు. ఉత్తమ్ మాట్లాడాల్సింది కేంద్రం మీద పక్క రాష్ట్రం చంద్రబాబు మీద. ఏపీ లో ప్రాజెక్టుల మీద జగన్ ,చంద్రబాబు ఒకే వైఖరి మీద ఉన్నారు. తెలంగాణ లో మాత్రం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు
పోతిరెడ్డిపాడు ను వ్యతిరేకించి ఆనాడు మా పార్టీ వై ఎస్ కేబినెట్ నుంచి బయటకు వచ్చింది మాట్లాడుకుంటే కాంగ్రెస్ తెలంగాణ కు చేసిన ద్రోహ చరిత్ర చాలా ఉంది. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోసం ప్రయత్నిస్తున్నాం అని ఉత్తమ్ అంటున్నారు ..ముందు ఉన్న పంటలను కాపాడటం పై ద్రుష్టి పెట్టాలి. మోడి కి చంద్రబాబు కు ఉత్తమ్ భయపడుతున్నారు. జగన్ సీఎం గా రాష్ట్రానికి వస్తే గౌరవించుకోవద్దా ? మీరు చంద్రబాబు దగ్గరికి క్యూ కట్టలేదా? మాట్లాడటానికి సిగ్గు ఉండాలి.

కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుకుంటే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. ప్రతి దాంట్లో కమిషన్ అడుగుతున్న కాంగ్రెస్ నేతలా కేసీఆర్ గురించి మాట్లాడేది ? మంత్రుల అవినీతి సంపాదన చిట్టా మా దగ్గర ఉంది ..ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారు. . కేసీఆర్ తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని ఎవ్వరూ ఇంతవరకు అనలేదు.
పంటలను కాపాడుకోవడానికి సాగునీరు ,ప్రజల తాగునీరు అందించేందుకు మనకు దక్కాల్సిన కృష్ణా జలాలు దక్కాలి. ఇందుకోసం బీ ఆర్ ఎస్ ఎంతకైనా తెగిస్తోంది. చంద్రబాబు పోలవరం సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు లను మరో పోలవరం ప్రాజెక్టు లు గా మారుస్తున్నాడు. మంత్రులు కృష్ణా జలాలపై సోయి లేకుండా సొల్లు పురాణం చెబుతున్నారు. కాళేశ్వరాన్ని ఎండబెట్టారు కనుకే గతం లో మాదిరిగా సూర్యాపేట ,మహబూబా బాద్ జిల్లాలకు నీళ్లు రావడం లేదు.

ఎస్ ఆర్ ఎస్ పి నీళ్లే అయితే ఇపుడు మాకు నీళ్లు ఎందుకు రావడం లేదు ? చర్చకు వస్తావా ఉత్తమ్ రా ,శ్రీరామ్ సాగర్ నీళ్లు ఎందుకు రావడం లేదో చర్చిద్దాం. కేసీఆర్ ను తిట్టడం బంద్ చేసి కృష్ణా జలాల వాటాను సాధించు కోవడం మీద మంత్రులు దృష్టి పెట్టాలి. కేసీఆర్ హాయం లో పదిహేడు పంట సీజన్ల కు నీళ్లిచ్చాము. కేసీఆర్ హయం లో ఏపీ కి నీళ్లు అక్రమంగా తరలిస్తే ఇన్ని పంటలు పండటం సాధ్యమా ? పెరిగిన పంట విస్తీర్ణం ,పంట ఉత్పత్తే కేసీఆర్ హయం లో సాగునీళ్ల సక్రమ వాడకమే కారణం.

ఊరు సర్పంచ్ కు కూడా సమాధానం చెప్పలేని స్థాయి కాంగ్రెస్ నేతలది ..వీళ్లా కేసీఆర్ గురించి మాట్లాడేది ? ఇప్పటికైనా సోయి తెచ్చుకుని సాగర్ ,శ్రీశైలం ప్రాజెక్టు ల్లో తెలంగాణ కు న్యాయమైన వాటా దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. అసలు నీళ్లను ఎట్లా కొలుస్తారో కాంగ్రెస్ నేతలకు తెలుసా? కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఉద్యమం నుంచే టీఎంసీ ల గురించి అవగాహన కల్పించారు. కేసీఆర్ ను విమర్శించడానికి కిషన్ రెడ్డి బండి సంజయ్ లకు సిగ్గుండాలి

కేంద్రమంత్రులుగా ఉన్న వారు కే ఆర్ ఎం బి అధికారులతో మాట్లాడి తెలంగాణ కు రావల్సిన నీళ్లు సాధించడం చేతకాదా ? కేసీఆర్ హయం లో పాలమూరు నుంచి వలసలు ఆగాయా లేదా ,నల్లగొండ నుంచి ఫ్లోరోసిస్ భూతం పోయిందా లేదా బీజేపీ నేతలు తెలుసుకోవాలి. బీజేపీ నేతలు రండల్లా మాట్లాడుతున్నారు. కోమటి రెడ్డి మీడియా తో మాట్లాడే ముందు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకునేందుకు ఆయన నోట్లో పైపు పెట్టాలి. కోమటి రెడ్డి ఓ మనిషిలా మాట్లాడటం లేదు

LEAVE A RESPONSE