Suryaa.co.in

Telangana

బీ ఆర్ ఎస్ నేతలపై ఎందుకింత కక్ష ?

– కేసీఆర్ హయం లో ఇలా ఎపుడు జరగలేదు
– హరీష్ రావు కు పోలీస్ రక్షణ పెంచాలి
– బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్

హైదరాబాద్: తెలంగాణ లో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి.ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ నేతలు ప్రజలపై మత్తు మందు చల్లారు. ఏడో గ్యారంటీగా ప్రజా పాలన అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రతీకార పాలన అమలు చేస్తున్నారు. బీ ఆర్ ఎస్ కీలక నేత మాజీ మంత్రి టి .హరీష్ రావు పై రేవంత్ రెడ్డి కక్ష గట్టి ఓ నేరస్తుడు చక్రధర్ తో కేసు పెట్టించారు. అధికారులను పావులుగా వాడుకుని హరీష్ రావు ను ఎంతగా వేధించినా ప్రజల పక్షానే ఉంటారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చక్రధర్ తో తప్పుడు కేసులు పెట్టించారు. హరీష్ రావు ఏడు సార్లు సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు. కోవిడ్ సమయం లో వైద్య ఆరోగ్య మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. రేవంత్ రెడ్డి లాగా హరీష్ రావు ఓటు కు నోటు కేసులో పాలుపంచుకోలేదు. ఏదైనా చేసి దేంట్లోనైనా హరీష్ రావు ను ఇరికించాలని రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ని హామీల పై ప్రశ్నిస్తున్నందుకే హరీష్ రావు పై కక్ష గట్టారు.

ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు మానకొండూరు పీ ఎస్ లో కేసు పెట్టారు. యాదాద్రి లో రేవంత్ రుణ మాఫీ ఒట్టు పెట్టి మాట నిలుపుకోనందుకు హరీష్ రావు ప్రశ్నిస్తే అక్కడ కూడా కేసు పెట్టారు. ఇలా చిన్న చిన్న అంశాల్లో హరీష్ రావు పై కేసులు పెడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు రేవంత్ అడుగులకు మడుగులొత్తుతున్నారు. పంజాగుట్ట కేసులో హరీష్ రావు దగ్గర కేవలం మూడు నెలలు పనిచేసిన వంశీ ని డీసీపీ చేసిన టార్చర్ అంతా ఇంతా కాదు. హరీష్ రావు పేరు చెప్పాలని లేదంటే చంపేస్తామని డీసీపీ విజయ్ కుమార్ బెదిరించారు.

నేను కూడా ఐపీఎస్ అధికారిగా పని చేశాను. సీఎం లు ఒత్తిడి చేసినంత మాత్రాన ఐపీఎస్ అధికారి పక్షపాతం తో వ్యవహరిస్తారా ? ఒత్తిడికి తలొగ్గలేమని చెప్పి విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఉద్యోగాలను వదిలివేయడం మంచిది. చక్రధర్ పై రకరకాల కేసులు ఉన్నాయి. లైంగిక దాడి వంటి తీవ్ర నేరారోపణలు చక్రధర్ పై ఉన్నాయి. 1900 మందిని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసు చక్రధర్ పై ఉంది. కిడ్నాప్ కేసు కూడా చక్రధర్ పై ఉంది. చక్రధర్ రేవంత్ ప్రోద్భలం తోనే హరీష్ రావు పై పంజాగుట్ట లో కేసు పెట్టారు.

మొదట హై కోర్టు లో రిట్ వేసి చక్రధర్ విత్ డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత పంజాగుట్టలో ఫిర్యాదు చేయగానే కొన్ని గంటల్లోనే హరీష్ రావు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినప్పటి నుంచి హరీష్ రావు ,ఆయన అనుచరగణం పై పోలీసులు కక్ష గట్టి వ్యవహరిస్తున్నారు. వంశీ ఇచ్చిన అఫిడవిట్ లో పోలీసుల తీరుపై అనేక ఆరోపణలు చేశారు వాటిని తీవ్రంగా పరిగణించాలి.

డీసీపీ విజయ్ కుమార్ ,ఏసీపీ మోహన్ కుమార్ ల వైఖరి ఖండించదగ్గది. మేము కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడం లేదు ..కాంగ్రెస్ నేతలు బీ ఆర్ ఎస్ నేతల పై పిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. కౌశిక్ రెడ్డి ,ఏరోళ్ల శ్రీనివాస్ లపై ఉత్త పుణ్యానికే కేసులు పెట్టారు. న్యాయ వ్యవస్థ ఇంకా బతికుంది కనుక బీ ఆర్ ఎస్ నేతలకు కొంతైనా న్యాయం జరుగుతోంది.

పోలీసు అధికారులు రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు పాటించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ దాడి చేస్తే పోలీసులు పట్టించు కోలేదు. సోషల్ మీడియా లో కాంగ్రెస్ నేతల భాష ఫై పిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. మా నేతల ఫోన్లను పోలీసులు అక్రమంగా లాక్కుంటున్నారు. చీటికి మాటికీ మా నేతల పై కేసులు పెడుతూ పోలీసులు రేవంత్ ఆటలో పావులు కదుపుతున్నారు.

కే టీ ఆ ర్ కార్యకర్తలతో రోడ్డు పై నడుచుకుంటూ వస్తే కేసులు పెట్టారు. బీ ఆర్ ఎస్ నేతలపై ఎందుకింత కక్ష ? కేసీఆర్ హయం లో ఇలా ఎపుడు జరగలేదు. మైనంపల్లి హన్మంత్ రావు గజ్వెల్ మీటింగ్ లో హరీష్ రావు పై పెట్రోల్ పోసి చంపుతామని చెప్పినా కేసు నమోదు చేయలేదు. చక్రధర్ లాంటి నేరస్థుల మాటలకు పోలీసులు విలువ నివ్వడం హాస్యాస్పదం. కాంగ్రెస్ నేతల నుంచి హరీష్ రావు కు కేసు లో నిందితులుగా ఉన్న వారికి ప్రాణ హాని ఉంది తక్షణమే హరీష్ రావు కు పోలీస్ రక్షణ పెంచాలి. డీజీపీ ని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయబోతున్నాం.

రేవంత్ రెడ్డి మాటలు విని కేసులు పెడుతున్న పోలీసులు ఆయన శాశ్వతంగా అధికారం లో ఉండమన్న విషయాన్ని గ్రహించాలి. ప్రభుత్వాలు మారుతుంటాయి అనే వాస్తవాన్ని గ్రహించాలి. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ఎదుర్కునే సత్తా బీ ఆర్ ఎస్ పార్టీ కి ఉంది.

LEAVE A RESPONSE