Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ పాలన లో మళ్ళీ పాత రోజులు

– .కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం ఢిల్లీ కి అఖిలపక్షం
– కేసీఆర్ హయం లో ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వకపోతే ఇంత పంట ఎలా పండింది ?
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ ,ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

హైదరాబాద్: తెలంగాణ లో కాంగ్రెస్ పాలన లో మళ్ళీ పాత రోజులు వచ్చాయి. సాగు ,తాగు నీరు కు మళ్ళీ కటకట లాడే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లు లేవు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కథ మళ్ళీ మొదటి కొచ్చింది. కేంద్రం అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల అవినీతి జరిగింది అన్నారు. ప్రభుత్వ నివేదికలే కాళేశ్వరం ద్వారా 20 లక్షల ఎకరాల కు నీళ్లిచ్చిన విషయం చెబుతున్నాయి.

పాలమూరు లో పద్నాలుగు నెలల్లో ఒక్క ఎకరాకు అయినా నీళ్లిచ్చారా? పచ్చి అబద్దాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. అబద్దాల పునాదుల తోనే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. రానున్న రోజుల్లో రైతన్న లు కాంగ్రెస్ మీద కన్నెర్ర చేయడం ఖాయం. కేసీఆర్ హయం లో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదంటున్న కాంగ్రెస్ నేతలది నోరా మోరా ?

మొబిలైజేషన్ అడ్వాన్స్ లతో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్. కేసీఆర్ హయం లో పనులు జరిగితేనే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చారు. కేసీఆర్ హయం లో తెలంగాణ వ్యాప్తంగా కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా కేసీఆర్ హయం లో భూముల ధరలు ఏమీ చేయకుండానే పెరిగాయా ?

కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరూ ధర్నా చేసే పరిస్థితి ఉంది. వట్టం పంప్ హౌజ్ మునిగినా ఈ ప్రభుత్వం పట్టిన్చుకోవడం లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు సాధించి జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురండి. కేసీఆర్ ను తిట్టాలనే ఆలోచన తప్ప కాంగ్రెస్ నేతలకు వేరే పని లేదు. పాలమూరు జిల్లా నుంచి సీఎం అయితే ఎదో ఒరుగుతుంది అనుకున్నాం ..జిల్లాకు ఏ పనులు జరగడం

భేషజాలకు పోకుండా కేసీఆర్ హయం లో మొదలైన ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం ఢిల్లీ కి అఖిల పక్షం తీసుకెళ్లండి. ఈ పద్నాలుగు నెలల్లో కేసీఆర్ చేసిన పనులకన్నా ఏమైనా మెరుగ్గా చేశారో చెప్పండి ..మేము చర్చకు సిద్ధం. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతోనైనా పని తీరు మార్చుకోండి. వ్యక్తిగత దోస్తానాలతో తెలంగాణ కు సీఎం రేవంత్ అన్యాయం చేయొద్దు. గాలి మాటలు కాంగ్రెస్ నేతలు మానుకుని కృష్ణా జలాల్లో తెలంగాణ నష్టపోకుండా చూడాలి

బాధ్యత గల మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు. కేసీఆర్ హయం లో ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వకపోతే ఇంత పంట ఎలా పండింది ? ఎలాంటి పాలన తెచ్చుకున్నామో నని రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కాంగ్రెస్ కు ఓటేసిన రైతులు కేసీఆర్ ని కలిసి తాము తప్పు చేశామని చెబుతాం అని అంటున్నారు. మాకు ఫోన్లు చేస్తూ రైతులు తమ భాధలు చెప్పుకుంటున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి .మిగతా పనులు చేయడానికి కాంగ్రెస్ కు చేతకావడం లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టు కు చిన్న మరమ్మతులు కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయింది. ఏపీ తెలంగాణ కలిసి ఇతర రాష్ట్రాల పై కృష్ణా హక్కుల గురించి పోరాడాల్సింది పోయి ..రెండూ కొట్లాడుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. జలవివాదాలు పెరిగేందుకే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తోంది.

LEAVE A RESPONSE