– కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకుని తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడడం లేదు
– చంద్రబాబు నోరెత్తి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం నోరు తెరవడం లేదు.
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి: రూ.34 వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను నిర్మించాం. గతంలో కాంగ్రెస్ తలపెట్టిన భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను తలదన్నే ప్రాజెక్టులను చేపట్టాం. ఆరు దశాబాద్దాలలో కాంగ్రెస్ చేపట్టిన ఏ ప్రాజెక్టూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కిందకు పనికిరావు.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకుని తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడడం లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని, 5,10 వేల కోట్లు కేటాయిస్తే పనులు పూర్తువుతాయని ఏడాదిగా మొత్తుకుంటున్నా కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చారు తప్పితే పెండింగ్ పనులను పూర్తి చేయడం లేదు. పెండింగ్ పనులు పూర్తి చేస్తే నీళ్లు వస్తాయని చెబుతున్నా .. వాటిని పూర్తి చేయకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి నీళ్లు రాలేదని దుష్ప్రచారం చేస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా ఈ నాలుగు నెలలలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చేపట్టి పూర్తి చేయాలి. కాంగ్రెస్ వెంట మేము ఢిల్లీకి వస్తాం .. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతాం.
కేవలం 86 వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది .. లక్ష కోట్లు అవినీతి జరిగిందని అబద్దపు ప్రచారం చేసింది .. ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లతో హైదరాబాద్ గొంతు తడుపుతున్నది వాస్తవం కాదా ? ఎన్ని రోజులు అబద్దాలతో కాలం గడుపుతారు ? కాంగ్రెస్ పార్టీ అవివేకం, అవినీతి మూలంగా ఆరు దశాబ్దాలు తెలంగాణ ఆగమైపోయింది.
కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ అబాండాలు వేస్తూ కాలం గడుపుతున్నారు. ఈ వానాకాలంలో ఒక్క క్రిష్ణా నది నుండి ఏపీ ప్రభుత్వం 660 టీఎంలు హక్కులకు విరుద్దంగా వాడుకున్నది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుండి ప్రతి రోజూ పది వేల క్యూసెక్కులు కొల్లగొడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి నోరేత్తడం లేదు. అక్రమంగా తరలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నోరెత్తి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం నోరు తెరవడం లేదు.
పదేళ్లే కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరంటు, ఐటీ, పంటల కొనుగోళ్లు, పారిశ్రామిక విధానంతో తెలంగాణ తలసరి ఆదాయాన్ని 3.26 లక్షలకు తీసుకెళ్లాం. తెలంగాణను దేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రాంగా తీర్చిదిద్దాం .. ఏడాదిలో రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, విద్యార్థుల మరణాలతో తెలంగాణను తిరోగమనంలోకి తీసుకెళ్లారు.
ఫించన్లు రూ.4 వేలు, మహిళలకు నెలకు రూ.2500, రైతుభరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.12 వేలు ఇస్తామని, మూడు ఎకరాల వరకు కూడా ఇవ్వకుండా అందులో 10 లక్షల ఎకరాలు రైతుల భూములు గయాబ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో అడుగు అడుగునా మోసం .. వంచన .. ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు .. ఈ విషయాల మీద ఏ మంత్రి మాట్లాడతాడో చెప్పండి .. బహిరంగ చర్చ చేద్దాం .
నదీజలాల వాడకం విషయంలో కేసీఆర్ మీద, హరీష్ రావు మీద ఆరోపణలు చేయడం సిగ్గు చేటు .. అసలు తెలంగాణ ప్రాజెక్టుల మీద కేసులు వేసింది కాంగ్రెస్ పార్ట ీనేతలు కాదా మిగులు జలాల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతున్నాడు . తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు.
కాంగ్రెస్ తెలంగాణకు ఇచ్చిన కానుక … కరువు ఫ్లోరైడ్, వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు, అంబలికేంద్రాలు, గంజికేంద్రాలు, బలవంతపు మరణాలు. గ్రామాలలో ప్రజలు అందరూ పొట్టకూటి కోసం వలసలు వెళ్లిన దుస్థితి .. గత పదేళ్లలో తెలంగాణ గ్రామాలు ఎంత బాగుపడ్డాయో అందరికీ తెలిసిందే. తెలంగాణలో సాధారణ రైతులు కూడా క్యూసెక్కులు, టీఎంసీల గురించి మాట్లాడుతున్నారు అంటే కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమమే.