– మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు
– పలు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
రాజమహేంద్రవరం : కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయమే తమ ధ్యేయమని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పరిశీలకులు బత్తుల తాతబాబు, జనసేన పార్టీ నగర ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, టిఎన్టియూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్ తదితరులతో కలిసి పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని గ్రాడ్యుయేట్లను కలుసుకుని వారికి కరపత్రాలు, నమూనా బ్యాలెట్ పేపర్లు అందచేసి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన విజయానికి సహకారం అందించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం నీతి నిజాయితీ గల వ్యక్తి అని, ఆయనకు పట్టభద్రులు ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన ఉందన్నారు.
రాజశేఖర్ ను గెలిపిస్తే శాసన మండలిలో తన వాణిని వినిపించి ప్రయోజనాలు చేకూర్చుతారని అన్నారు. పేరాబత్తుల రాజశేఖరం పేరు ఎదుట 1 నెంబర్ వేసి ఆయనకు అఖండ విజయం చేకూర్చాలని గ్రాడ్యుయేట్లను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోరారు. ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.