Suryaa.co.in

Telangana

కుంటను తలపిస్తున్న సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాల మైదానం

-మైదానంలో కోట్లాది రూపాయలతో రన్నింగ్ కోర్టు ఏర్పాటు వృధా
-సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వం బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన రన్నింగ్ కోర్టు మైదానం కుంటను తలపించే లాగా ఉందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ కోట్లాది రూపాయలు పెట్టి నిర్మించిన రన్నింగ్ కోర్టు వినియోగంలోకి రాకముందే కుంటలు తలపిస్తుందని అన్నారు.

చిన్నపాటి వర్షం వచ్చినందుకే ఇలా కావడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇలాంటి నిర్మాణాల వల్ల కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులు లాభపడతారు తప్ప ప్రజలకు ఏం లాభం జరగదని అన్నారు. నాసిరకం పనులు నిర్మించడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం నాశనం అయిందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా నాసిరకంగా నిర్మిస్తున్నారని అన్నారు.

వెంటనే విద్యార్థులకు క్రీడాకారులకు ఉపయోగపడేలా రన్నింగ్ కోర్టును అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్ అనిల్ బైరి సాయి తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE