(సూరజ్ భరద్వాజ్)
బేబీ స్టార్ చుట్టూ ఉండే వేడి వాయువుల్ని, అందులో ఘనీభవిస్తున్న రాతిగ్రహాల ఆనవాళ్లను తాము ప్రత్యక్షంగా చూసామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఖగోళంలో గ్రహ ఆవిర్భావానికి సంబంధించి తొలి అడుగులు పడుతున్నాయని కచ్చితంగా చెప్పవచ్చని వాళ్లు అంటున్నారు. ఒక గ్రహ వ్యవస్థ ఆవిర్భావంలో, అంతర్గతంగా సంభవిస్తున్న పరిణామాల దృశ్యాన్ని తొలిసారిగా చూశామని షికాగో యూనివర్సిటీ ఖగోళ పరిశోధనా విభాగం ప్రకటించింది.
ఖగోళ శాస్త్రవేత్తలందరూ ఇలాంటి క్షణం కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. గ్రహ వ్యవస్థలు ఎలా ఏర్పడతాయన్నది శాస్త్రవేత్తలు ఊహిస్తూ వచ్చారు తప్ప, ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు ఆ అవకాశం దొరికింది. అమెరికాకు చెందిన నాసా, చిలీ దేశానికి చెందిన ఈఎస్ఓ ఈ పరిశోధనలో పాలు పంచుకున్నాయి.