– భేటీ బచావో పై బీజేపీ నేతల కు విశ్వాసం ఉంటే బేటా ను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి
– కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్
హైదరాబాద్: మై నర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన బండి భగీరథ ను కాపాడడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినట్లు కనపడుతున్నది, బండి సంజయ్ తన మిత్రుడని బహిరంగంగా ముఖ్యమంత్రి ప్రకటించాక డి సి పి స్థాయి అధికారి మిత్రుణ్ణి నిందితునిగా నమోదు చేసే అవకాశం ఉందా అని అనుమానం కలుగుతున్నది. పోక్సో కేసు నమోదు కాగానే వెంటనే విచారణ జరిపి నిండుతున్ని అరెస్ట్ చేయాలిసిన పోలీసులు మూడు రోజులు దాటినా అరెస్ట్ చేయకపోవడం దారుణం.
కేంద్ర మంత్రి స్వయంగా ఈ కేసు లో నిందితునికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ దృష్ట్యా నిండుతున్ని అదుపులోకి తీసుకోలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. కొడుకు ను కాపాడడానికి బాధితురాలిని బండి సంజయ్ 22/4/26 రోజు బెదిరించారని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా, పోలీసులు బండి సంజయ్ పై కేసు నమోదు చేయకపోవడం బేటా బచావోలో భాగమే.
పెట్ బషీరాబాద్ పోలీసులు బాధితురాలు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించకపోవడం వలన కేసు నమోదు ఆలస్యం కావడం తో దీనివెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, వెంటనే బషీరాబాద్ ఎస్ ఎచ్ వో ను సస్పెండ్ చేయాలి, బండి భగిరత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేస్తున్నాం. కుటుంబ సభ్యుల ను బెదిరించిన బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
హాని ట్రాప్ పేర కేసు ను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. బీజేపీ అధ్యక్షులు మైనర్ బాలికపై జరిగిన సంఘటన ను ఖండించకుండా కుటుంబ సమస్యగా చిత్రీకరించడం బండి సంజయ్ కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించడం దుర్మార్గం, భేటీ బచావో పై బీజేపీ నేతల కు విశ్వాసం ఉంటే, బేటా ను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.