సహనమే సీత..!

అంతటి రామయ్యకు ఒక్కసారే వనవాసం..
కానీ తల్లి సీతమ్మ…
విడిచి వైకుంఠవాసం
పుట్టి బుద్దెరుగక ముందే భూమిలో మందసవాసం..
అత్తింటివాసం మధురిమలు పూర్తిగా ఆస్వాదించక
మునుపే అరణ్యవాసం..
అక్కడా భర్తతో హాయిగా ఉండకుండా అశోక వనవాసం..
అది ముగిసే నాటికి అకస్మాత్తుగా అగ్నిప్రవేశం..
ఆ కష్టాలు దాటి
కొన్నాళ్ళు రాణివాసం..
అంతలోనే చాకలి నిందతో మళ్లీ అరణ్యవాసం..
అటు నుంచి వాల్మీకి
ఆశ్రమ నివాసం..
అలా జీవితం మొత్తం
కష్టాలతోనే సహవాసం..
చివరకు ప్రాణసమానుడైన
పతి రామయ్య
బిడ్డలు లవకుశులను విడిచి
తల్లి భూగర్భమే ఆవాసం..!

ఆ చల్లని తల్లి భూజాతకు
అక్షరమాల తప్ప ఏమివ్వగలం..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286