Suryaa.co.in

Telangana

ఆర్టీసీ ఆస్పత్రిలో గురక వ్యాధి పరీక్షలపై, అత్యాధునికమైన స్లీప్ స్టడీ పరికరాలు ఏర్పాటు

-అందుబాటులో పాలిసోమునోగ్రఫీ – స్లీప్ స్టడీ పరీక్ష పరికరాలు
-తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల నిద్ర – ఆరోగ్యంపై ప్రత్యేక ఫోకస్
– ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌
-నైట్‌డ్యూటీలతో ప్రమాదం
-నిద్రలేమీతో యాక్సిడెంట్లు
– ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం

రోడ్డు ప్రమాదాల్లో యాభై శాతం మందికి నిద్రలేమీతో సతమతమై యాక్సిడెంట్ గురవుతున్న సంఘటన మనం చూస్తున్నాం అని, ప్రముఖ పల్మనాలజిస్ట్ అలర్ట్ సూపర్ స్పెషలిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ వెల్లడించారు. హైదరాబాద్ ఆర్టీసీ బస్ భవన్ లో జరిగిన తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశంలో, శుక్రవారం ఉదయం ఆర్టీసీ ఎండ , సజ్జనార్ ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, 2023 theme రిలీజ్ చేశారు.

మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర అనే థీమ్తో ని, స్ఫూర్తిగా తీసుకొని త్వరలో, హైదరాబాదులోని ఆర్టీసీ ఆస్పత్రిలో గురక వ్యాధి పరీక్షలపై, అత్యాధునికమైన స్లీప్ స్టడీ పరికరాన్ని ఏర్పాటు చేయనున్నామని సజ్జనార్ ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులు అందరూ ఒక కుటుంబసభ్యులు అని, వారు నిద్రలేమితో ని బాధపడినట్లు అయితే, అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదాలు ఉన్నాయి కనుక, వారి ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, పాలిసోమునోగ్రఫీ – స్లీప్ స్టడీ పరీక్ష పరికరాలు అందుబాటులో తెచ్చి వైద్య సేవలు చేయనున్నామని తెలిపారు.

ఉద్యోగులకు దీర్ఘకాలంగా 90 రోజులు మించి నైట్ షిఫ్ట్ డ్యూటీ ఉంచాలని, దాని వలన వారి నిద్ర లోపించి, శరీరంలోని సిరికాడియన్ రీదం దెబ్బతిని, మెలటోనిన్ హార్మోన్ డెఫిషియన్సీ రావడంతో, అనేక రకములైన గుండె జబ్బులు, మెదడు జబ్బులు, ఉబాకాయము, నరాల జబ్బులు, తలెత్తే అవకాశాలు ఉంటాయని డాక్టర్ వ్యాకరణం వెల్లడించారు. గురక వ్యాధి తోబాధపడుతున్న వారిలో 69 శాతం మంది గుండె సంబంధించి హటాత్ మరణానికి లోనే తున్నారని, 50 శాతం మంది పక్షవాతం బారిన పడుతున్నారని, బీపీ షుగర్ ఉన్నవారికి మందులు వాడినా కంట్రోల్ అవ్వట్లేదు అని, వీటన్నిటికీ ఒకటే పరిష్కారమని, స్లీప్ స్టడీ పరీక్ష వెంటనే చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు.

69 శాతం మందికి గుండె జబ్బులు, హఠాత్ మరణం 50 శాతం మందికి పక్షవాతం, డయాబెటిస్ షుగర్ వ్యాధి ఉన్నవారికి షుగర్ లెవల్స్ కంట్రోల్ కాకపోవడం, బ్లడ్ ప్రెజర్ రోగం ఉన్నవారికి బీపి కంట్రోల్ రాకపోవడం, ఇక వ్యక్తిగత జీవితాల్లో మెదడు అలజడికి లోనవడం, అనేక మానసిక రుగ్మతలు, వంటి అనేక కారణాలతో గురక వ్యాధి కీలకమైనదని, పల్మనాలజిస్ట్, అలర్జీ సూపర్ స్పెషలిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, మీ మొబైల్ నెంబర్ చెప్పండి డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు.

నైట్ డ్యూటీ చేసే ఉద్యోగాలు
కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో, వాహనము నడిపే చాలామంది, నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు. వారిలో తరచుగా విపరీతమైన మానసిక ఒత్తిడి, క్షీణించిన వ్యాధి నిరోధక శక్తి, తరచుగా చిరాకు పడడం, తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడటం, ఆడవారిలో reproductive system సంబంధించిన వ్యాధులు పెరగడం, సంతాన లేమి మార్పులు జరగడం, జీర్ణ ప్రక్రియ దెబ్బతినడం, ప్రవర్తన వైఖరిలో మార్పు, ఉదయాన విపరీతమైన నిద్ర రావడం, ఊబకాయం రావడం, సిర్రకాడియన్ రిధం డిస్టబెన్స్ వీరిలో ముఖ్యమైన కారణం.దీర్ఘకాలంగా నైట్ డ్యూటీ చేసే ఉద్యోగస్తులో తరచుగా తలెత్తే రోగము పేరు – షిఫ్ట్ వర్క్ స్లీప్ డిజార్డర్ (SWSD) అంటారని డాక్టర్ వ్యాకరణం తెలిపారు.

LEAVE A RESPONSE