ఒంగోలు, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ప్రాదేశిక ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలోని ఏపీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీలించారు. ప్రాదేశిక ఎన్నికలకు అవసరమైన ఎన్నికల సామగ్రి సిద్ధం చేశామని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ఏడాది కోవిడ్ కారణంతో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడ నుంచి మొదలయ్యాయన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీన ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలు ముగియగానే బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ సెంటర్లకు డిపాజిట్ చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు తొలిదశ శిక్షణ ముగిసిందన్నారు. ఈ నెల 7వ తేదీన రెండవ విడత శిక్షణ ఇస్తామన్నారు. ఎం.పి.డి.ఓ. కార్యాలయాలను ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంగా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు తదితర సామగ్రి సిద్ధం చేసి ఆయా మండలాలకు తరలించాలన్నారు. ప్రజలు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి దుర్ఘటనలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా చేపట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇందుకోసం 10 మంది ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దర్శి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాలకు ఏ.పి. మోడల్ స్కూల్ లో 2 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఒక ఎం.పి.టి.సి. పరిధిలో ఒక పోలింగ్ కేంద్రం ఉంటే ఒక కౌంటింగ్ టేబుల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. 2 పోలింగ్ కేంద్రాలు లేదా ఆ పైగా వుంటే ఆ ప్రాంతంలో 2 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. మొత్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో 1285 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలాంటి నూతన విధానం ద్వారా ఓట్ల లెక్కింపు సజావుగా జరుగుతుందని, వేగంగా ఫలితాలు వెల్లడించవచ్చని ఆయన తెలిపారు. ఈ విషయంపై ఎం.పి.డి.ఓ.లకు, పోటీలో వున్న అభ్యర్థులకు సమాచార ఇచ్చామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి బరిలో వుండే అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు హాజరుకావచ్చన్నారు. ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి జిల్లాలోని ప్రజలంతా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కె.కృష్ణ వేణి, తహశీల్దారు వరకుమార్ , ఎం.పి.డి.ఓ., జి.శోభన్ బాబు, సి.ఐ. బీమా నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Devotional
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేస్తారు?
గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి? ప్రదక్షిణ అని దేనిని అంటారు?? అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు. ఋగ్వేదం…
Sports
చరిత్ర సృష్టించిన భారత చెస్ ప్లేయర్
భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్-2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగిన 14వ రౌండ్లో గుకేశ్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా (18 ఏళ్లు) రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం…
అండర్ 19 రాష్ట్ర జట్టుకు ఎంపికైన సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే
జగ్గయ్యపేట పట్టణానికి చెందిన టి. వరుణ్ సాత్విక్, ఎన్. రాజేష్ లు ఆంధ్ర రాష్ట్ర అండర్ 19 మల్టీ డేస్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈరోజు జగ్గయ్యపేట జీ.వీ.జే బాయ్స్ హైస్కూల్లో గల బివి సాగర్ మెమోరియల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నెట్స్ వద్దకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వెళ్లి వారిని అభినందించారు….