Home » దారి ప్రక్కన సేదదీరిన యుద్ధోపహతులు

దారి ప్రక్కన సేదదీరిన యుద్ధోపహతులు

కంటికి కనిపించే దృశ్యాలు కొన్ని మనసులో ఆలోచనల తుట్టెను కదిలిచి రకరకాల ఉద్వేగాలను రేపుతుంది. దారి ప్రక్కన చెట్టు నీడన తుండు గుడ్డ పరుచుకొన్న నిద్రా భంగిమ “దారి ప్రక్కన
ఆరిన కుంపటి విధాన”.. ఒక ఉద్వేగకర దృశ్యం.

ఆదమరిచి నిద్రిస్తున్న విధానం మనసులో
రకరకాల కారణాలకు అన్వేషణ మొదలు.
వారు ఎవరన్నది ప్రధానం కాదు గానీ,
ఏపరిస్థితుల్లో అలా నిద్రాదేవి ఒడిలో
సాంత్వన పొందుతున్నారో.. ఆ తీరు
ఊరికే ఉండనివ్వదు చూపరులను.
మేలుకున్న మనిషి తనంలో అనుకంప ఒకటి అశాంతి అస్థిమితకు గురిచేస్తుంది.

అమాయక పసివాడు తండ్రి ఎదపై
పరున్న తీరు, భౌతికంగా ఏ యుద్ధం చేయకున్నా
పరిస్థితులతో యుద్ధంలో పరాజితులేమో?!
యుద్ధకారణంగా విచ్ఛిన్నమైన చిన్న కుటుంబంలో ఇద్దరు మాత్రమే బతికి బట్ట కట్టినట్టు,
శరణార్థులుగా చెట్టు నీడన ఆశ్రయం పొందిన
ఆ యుద్ధోపహతులకు ఆ మాత్రం రక్షణ, ఆశ్వాసన దొరికినందుకు దుఃఖిత మనసుకు ఊరట.

ఈ ప్రపంచం వంచనతో కుట్ర చేసి సర్వస్వం దోచుకున్న అభాగ్యుల పట్ల వట్టి సానుభూతి మాత్రమే కాదు, చేయూతనిచ్చి చేయి చేయి కలిపి ప్రతిఘటనకు, పరిస్థితిపై పోరాటానికి, వెన్నుదన్నుగా నిలబడమని చూపరులను ఆదేశిస్తుంది.

మల్లేశ్వర రావు ఆకుల

Leave a Reply