– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
– రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన మంత్రి
సోమేందపల్లి: రెవెన్యూ సదస్సుల ద్వారా 45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, మరియు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖా మంత్రి సవిత పేర్కొన్నారు.
శుక్రవారం పెనుగొండ నియోజకవర్గంలోని సోమేందపల్లి మండలంలోని నాగి నాయిని చెరువు గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల భవనం ఆవరణలో గ్రామంలో రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామసభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను అంతకుముందు పరిశీలించారు. సదస్సులో ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని తాసిల్దార్ చదివి వినిపించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇది మంచి ప్రభుత్వము
నేటి నుంచి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు, వివాదాల పరిష్కారమే అజెండాగా, రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చేనెల 8వరకూ 33 రోజులపాటు, సుమారు 17 వేల 564 గ్రామాల్లో సదస్సులు జరగనున్నాయి. 2019కి ముందు భూముల రికార్డులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు.
సదస్సుల్లో వచ్చే విజ్ఞాపనల్ని 45 రోజుల్లో పరిష్కరించాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.ప్రజలనుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే ప్రక్రియలో పలు లోపాలు చోటుచేసుకున్నాయని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
సరైన విధానం, మార్గదర్శకాలు లేకుండా, తగిన సమయం ఇవ్వకుండా హడావిడిగా సర్వే చేయించారని అన్నారు. రీసర్వేలో జరగిన లోపాలపై సుమారు కొన్ని వేలకు పైగా దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ తమ భూముల రికార్డులను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ6 సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇది గొప్ప సదవకాశామని, దీనిని వినియోగించుకోవాలని కోరారు.
మన రాష్ట్రంలో ఒకటో తేదీని ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేయుచున్నామని, ఏ రాష్ట్రంలో కూడా ఇది సక్రమంగా అమలు చేయలేదని తెలిపారు, దీపం 2 పథకం కింద మహిళలకు సిలిండర్లు పంపిణీ చేయుచున్నామని, పార్టీలు అతీతంగా అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని తెలిపారు,