November 16, 2026

సోనియాగాంధీ ఆత్మకథలో మరికొన్ని చెప్పని నిజాలు

సోనియా గాంధీ తన ఆత్మ కథలో నిజంగా దేశంలో జరిగిన విషయాలు,తన స్వీయ అనుభవాలు, ప్రజలకు అవసరమైనవి తెలుసుకోవలసినవి వెల్లడించడం లేదు.

ఆమె1968 లో ప్రేమ వివాహం చేసుకున్నారు భారతదేశానికి వచ్చారు కానీ 1983 వ సంవత్సరంలో భారత పౌరసత్వం తీసుకున్నారు. కానీ ఆమె భారత పౌరసత్వం లేకుండానే 1980 లో ఓటు ఎలా వేశారో చెప్పలేదు.

బాట్ల ఎన్కౌంటర్ కు కనీసం కన్నీరు కార్చారు . అంటే తీవ్రవాదులకు మీ మద్దత్తా? పీవీ నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధానమంత్రిగా ఉండినారు. చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు బతిమిలాడిన కాంగ్రెస్ ఆఫీసులోనికి రానివ్వలేదు. దహన సంస్కారాలు ఢిల్లీలో చేసుకోనివ్వలేదు.16 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి అఖిలభారత అధ్యక్షులకు ఎన్నికలు లేకుండా మీరే అధ్యక్షులుగా ఉన్నారు.

చైనా దేశానికి మీ కుటుంబానికి స్పష్టమైన అంతర్గత వ్యవహారాలు ఉన్నప్పటికీ, ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ, ఏనాడు కూడా ఈ విషయాన్ని భారత ప్రజలకు చెప్పలేదు. వాజ్పాయ్ గారు ఇస్లామాబాద్ లో ఉండే కార్గిల్ యుద్ధం జరిగిందని అబద్ధాలు మాట్లాడారు. ఇస్లామాబాద్ నుండి వాజ్పేయి గారు వచ్చిన తర్వాత రెండు నెలలకి కార్గిల్ యుద్ధం జరిగింది.

ఎమర్జెన్సీ కాలాన్ని కేవలం సంజయ్ గాంధీ, మేనకా గాంధీ ల మీదకు నెట్టారు తప్ప ,అందులో అసలు నిజాలను వెల్లడించలేదు. వాస్తవం గా ఆ రోజున క్యాబినెట్ మీటింగ్ జరగకుండానే ఇందిరా గాంధీ గారే స్వయంగా నిర్ణయం ప్రకటించారు.

గోద్రా అల్లర్లలో శిక్షలు పడి కొంతమందిని ఉరి తీసినప్పటికీ ఇంకా కేసు క్లియర్ కాలేదని మీ ఆత్మ కథలో వ్రాసుకున్నారు.
అప్పటివరకు అరుణాచల్ ప్రదేశ్ కి బయట వ్యక్తులకు ప్రవేశం లేకుండా ఉండింది. అలాంటిది అరుణాచల్ ప్రదేశ్ లో క్రిస్టియన్ మతవ్యాప్తి పూర్తిగా మీ సహకారంతోనే జరిగిందనేది వాస్తవం.

ఆనాడు మీరు ప్రధాని కావాలని రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్లినప్పుడు, బహిరంగంగా వ్యతిరేకించిన వారిలో శరద్‌పవార్ ఉన్నారు ఆ రోజునుండే వారు నేషనల్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనే ప్రత్యేక పార్టీ పెట్టుకుని కొనసాగుతున్నారు.

మీరు పూర్తిగా హిందూ ధర్మ వ్యతిరేకనే దానికి స్పష్టంగా చాలా నిజాలు ఉన్నాయి. వాటిని అవసరమైనప్పుడు తెలియచేస్తాను. ఇలాంటి వాస్తవాలను మీ ఆత్మ కథలో మీరు తెలియచేయకుండా భారత ప్రజలను మోసగిస్తున్నారు. నిజాలను ఎప్పటికీ దాచలేరు.

  • కరణం భాస్కర్
    రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు
    7386128877.
Total Visitors: 3,451,102