-మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వైసీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో నవ్వులాటగా మార్చింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 98 శాతం కట్టగా 2 శాతం మాత్రమే రైతు కట్టే ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇన్సూరెన్స్ (పంటల బీమా) రైట్ యాక్టు లేకుండా చేసింది. రైతుల హక్కులను కాలరాస్తున్నారు. 2020నుంచి కూడా ఏ సమాచారాన్ని కూడా వెబ్ సైట్ లో పెట్టటంలేదు. తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో బిందు తుంపర సేద్య అభివృద్ధికి విశేష కృషి చేశాం. వైసీపీ ప్రభుత్వం.. ఉన్న పథకాలను తీసేయడం కాదు, రోల్ మోడల్ గా తయారవ్వాలి. టీడీపీ హయాంలో యాంత్రీకరణ ద్వారా 600 కోట్లు ఖర్చు పట్టాం. వైసీపీ ప్రభుత్వం యాంత్రీకరణ కింద ఎంత ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలి. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలను ఆపేసిన మీరు సిగ్గుతో తల దించుకోవాలి. ఉచితంగా రైతు తరపున మేమే కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. 2,977 కోట్లు ఇన్సూరెన్స్ పారద్శకంగా చేశామని వ్యవసాయ శాఖ చెబుతున్నారు. ఏ విధంగా దాన్ని క్లయిమ్ చెల్లించారో తెలపాలి. ఏ ఏ రైతులకు చెల్లించారో వివరాలు ప్రజలకు తెలపాలి.
ప్రభుత్వం వద్ద పారదర్శకత లేకుండా పోయింది. అన్ని వెబ్ సైట్లలో పెట్టామని అబద్ధాలు చెబుతున్నారు. 2020నుంచి కూడా ఏ సమాచారాన్ని కూడా వెబ్ సైట్ లో పెట్టటంలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను వెబ్ సైట్ లలో, నెట్ లలో పెట్టకుండా ఎత్తేస్తున్నారు. దాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. 2021 ఖరీఫ్ లో నాలుగున్నర లక్షల ఎకరాల్లో మిర్చి పంట వేసినట్లుగా సీజన్ అండ్ క్రాప్ రిపోర్టులో ఉంది. వాతావరణ కారణాల వలన ఉద్భవించిన తెగులు ద్వారా 70 శాతం నుంచి 80 శాతం దెబ్బతిందని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో జీవీఎల్ నరసింహరావు అడిగారు. అందుకు కేంద్ర మంత్రి సమాధానం కూడా ఇచ్చారు. వ్యవసాయ శాఖ కమిషనర్ డైరెక్టర్ హరికిరణ్ మిర్చి పంట ఆధారిత ఇన్సూరెన్స్ కింద ఉండిన ఈ క్లైమ్ లు చెల్లించలేకపోతున్నామని చెబుతున్నారు. ఈ తెగులు వల్ల 45 నుంచి 80 శాతం మిర్చి పంటలో దిగుబడి తగ్గిపోయింది. ఈ క్లయిమ్ లు చెల్లించలేకపోయాం అంటున్నాడు. ఇన్సూరెన్స్ ఎందుకు చెల్లించలేదో చెప్పాలి. పంటల బీమాను లెక్కగట్టడంలో ఎందుకు వాతావరణ కొలమానాన్ని తీసుకోలేదు? మీరు 34 పంటలకు ఇన్సూరెన్స్ కవర్ చేశామంటున్నారు. దాని ప్రకారం నష్టం ఎంతెంత వేశారు? పరిహారమెంత చెల్లించారు? ఈ సమాచారం ఎక్కడ లభిస్తుంది? వ్యవసాయ శాఖలో ఏ రైతుకి ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చారు? ఏ బేస్ మీద ఇచ్చారు? ఏ పంటలకిచ్చారు? ఊరికే బటన్ నొక్కేసి రూ.2,900కోట్లు ఇచ్చాము అంటే మేం నోరు వెళ్లబెట్టుకొని చూడాలా? సమాచారాన్ని వెబ్ సైట్ లో పెట్టే దమ్ము మీకుందా? నష్టం అంచనా ప్లానింగ్ శాఖ వేసిందనడం ఎంతవరకు సమంజసం?
ప్లానింగ్ శాఖ ద్వారా అమరావతి మీద వచ్చిన జీఎన్ రావు రిపోర్ట్, బోస్టన్ రిపోర్ట్, జిల్లాల విభజన రిపోర్టు వాటి మీద నమ్మకం పోయే స్థితి వచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ద్వారా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ తోపాటు మరికొన్ని కంపెనీలు మొత్తం నాలుగు కంపెనీలు కలిసి తెగుళ్లమీద అంచనా వేయాలి. పోర్టల్ లో ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంటులతో రైతుని పోర్టల్ లో బుక్ చేసుకోమంటున్నారు. ఎంత మంది బుక్ చేసుకున్నారు? ఎంత మంది బుక్ చేసుకోలేకపోయారు? వ్యవసాయ శాఖ ఏం చేస్తోంది? ఎందుకు వ్యవసాయశాఖ చొరవ చూపడంలేదు? ఆ రిపోర్టును బయట పెట్టాలి. మొత్తం పంట ఎంత? ఎంతమంది రైతులు? ఈకేవైసీ ద్వారా ఎంత మంది ఈ క్రాప్ ను బుక్ చేసుకున్నారు? మొత్తం మీద రైతులకు ఎంత చెల్లించారు? వాతావరణ పరిస్థితులను బట్టి వచ్చిన తెగుళ్ల వల్ల చెల్లించలేకపోయారు? బయట పెట్టాలి.
పార్లమెంటులో 40 శాతం నుంచి 80 శాతం వరకు రైతులు నష్టపోయారని మేం వెదర్ బేస్డ్ బుక్ చేయలేదని కమిషనర్ ఆఫ్ అగ్రికలర్చర్ సమాధానం ఇస్త్తే ఏమనాలి? ఈ మూడు సంవత్సరాల్లో రైతుల గొంతు కోశారు. 596 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం ఎగ్గొట్టిందని, చంద్రబాబు వ్యవసాయ రైతులకు చేసిన మేలు ఒక్కటైనా ప్పగలరా? అని వ్యవసాయ మంత్రి చెప్పడం హాస్యాస్పదం. జగన్ 9 లక్షల కోట్లు అప్పు చేశారు. మేం అధికారంలోకి వచ్చాక మేమే కట్టుకోవాల్సి ఉంటుంది. ఎల్ వీ సుబ్రమణ్యంను పెట్టి పేమెంట్ లు అన్ని ఆపేశారు. 2017-18లో ఒక్క సంవత్సరంలోనే రూ.12 వందల కోట్లు ఖర్చు పెట్టాం. మైక్రో ఇరిగేషన్, బిందు తుంపర సేద్యానికి 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు చేశారు? ఒక్క సంవత్సరంలో మైక్రో ఇరిగేషన్ లో ఇప్పటివరకు మీరు 12 కోట్లు ఖర్చు పట్టివుంటే అదే గొప్ప.
మేం 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు చేశాం? మీరు నాలుగు సంవత్సరాల్లో ఎంత ఖర్చు చేశారో చెప్పాలి. కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ స్మామ్ యాంత్రీకరణ కు ఎంత ఖర్చు చేశారో తెలపాలి. ప్రభుత్వంలో ఉన్నారు కనుక అధికారికంగా బయట పెట్టాలి. జగన్, వ్యవసాయ మంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. వ్యవసాయ శాఖను ప్రక్షాళన చేశాం. రికార్డు సృష్టించాం. 2017-18లో మైక్రో ఇరిగేషన్ లో దేశంలోనే నెంబర్ వన్. భూసార పరీక్షలు ఆపేశారు. కొత్త వరి వంగడాలు తేవాల్సిందిపోయి రైతులకు … 2002లో ఇజ్రాయిల్ టెక్నాలజీని తీసుకొచ్చి కుప్పం నియోజకవర్గంలో ప్రవేశపెట్టి రైతులను అన్ని విధాల అభివృద్ధి చేశాం. అలా రోల్ మాడల్ కావాలిగానీ పథకాలను తీసేయకూడదు.