Suryaa.co.in

Andhra Pradesh

స్పీకర్ తమ్మినేని హెచ్చరిక బాబుపై కుట్ర సంకేతమే

-స్పీకర్ వ్యాఖ్యలతో బాబుకు ప్రాణహాని ఉందని అర్ధమవుతోంది
-విపక్ష నేతపై దాడులు జరుగుతున్నా పోలీసుల ప్రేక్షక పాత్ర
-బాబు టూర్ షెడ్యూలు తెలుసుకుని మరీ దాడులు
-కుట్రదారులపై చర్యతీసుకోవాలంటూ డీజీపీకి టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ
-ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై జరుగుతున్న రాజకీయ కుట్రల్లో భాగమైన దాడులపై సమగ్ర విచారణ చేయించాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసిన తెదేపానేత వర్ల రామయ్య

వైకాపా గూండాల చేత చంద్రబాబు నాయుడిపై దాడిచేసేలా రెచ్చగొడుతున్నారు.ప్రతిపక్షనేతపై దాడులు జరుగుతున్నా పోలీసులు విగ్రహాల్లా చూస్తూ కూర్చుంటున్నారు.చంద్రబాబు నాయుడిపై మొదట దాడి చేస్తామని బెదిరిస్తారు.

రెండవ దశలో ఆయన టూర్ రూట్ మ్యాప్ ను ఆధారం చేసుకుని చివరి నిముషంలో కౌంటర్ ప్రోగాంలకు ప్లాన్ చేస్తారు. మూడవ దశలో వైకాపా రౌడీలను, గూండాలను, అసాంఘిక శక్తులను కూడగట్టి చంద్రబాబు నాయుడి కాన్వాయ్ ను వెంబడించి గందరగోళం సృష్టిస్తారు. నాలుగవ దశలో వైకాపా గూండాలతో చంద్రబాబు నాయుడు కాన్వాయ్, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై రాళ్ల దాడి చేయిస్తారు.

చివరి దశలో పోలీసులు టిడిపి నాయకులు, కార్యకర్తలపై బలమైన సెక్షన్లు ప్రయోగించి కేసులు పెడతారు. తాజాగా మే 29 న గౌరవ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం, ఆముదాల వలస మీటింగ్ లో చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉందని బెదిరించారు.

స్పీకర్ తమ్మినేని హెచ్చరికల వెనుక చంద్రబాబు నాయుడిపై పెద్ద కుట్రకు ప్లాన్ చేశారని అర్ధమౌతోంది.ఈ నేపధ్యంలో ప్రతిపక్షనేత భద్రతపై సునిశిత నిఘా ఏర్పాటు చేయండి. చంద్రబాబు నాయుడిపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమైన దాడులుపై సమగ్ర విచారణ చేయించండి. కుట్రదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

LEAVE A RESPONSE