నాలుగేళ్ల పాలనలో నాశనం.. సర్వమంగళం.. అరాచకం

– జగన్ రెడ్డి నాలుగేళ్లపాలనా వైఫల్యాలు, నేరాలు-ఘోరాలు, అవినీతి, లూఠీ, ప్రజావ్యతిరేక విధానాలపై టీడీపీ జాతీయ కార్యాలయంలో ఛార్జ్ షీట్ విడుదల చేసిన తెలుగుదేశం నేతలు
– జగన్ 4 ఏళ్ల పాలనపై టీడీపీ విడుదల చేసిన ఛార్జ్ షీట్ ను ప్రజలు చదవాలన్న నేతలు
– నేరాలు-ఘోరాలు, విధ్వంసాలు, విద్వేసాలు, అబద్ధాలు, మోసాలు, దుష్ప్రచారం, మాటతప్పడాలు, మడమతిప్పడాలు తప్ప 4ఏళ్లలో జగన్ సాధించింది శూన్యమన్న తెలుగుదేశం

• 4ఏళ్లలో ఊహించనదానికంటే ఎక్కువ సంపాదించుకున్నామన్న ఆనందంతోనే వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ పాలనపై సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీనేతల ఎద్దేవా

జగన్మోహన్ రెడ్డి 4ఏళ్లపాలన చూస్తే ఏమున్నది గర్వకారణం ఎటుచూసినా నేరాలు-ఘోరాలు, లూఠీలు, విధ్వంసాలు, విద్వేషాలు, అబద్ధాలమయం : వర్ల రామయ్య (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు)
“జగన్మోహన్ రెడ్డి 2019 మే30న రాష్ట్రముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 4ఏళ్లపాలన పూర్తిచేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆయన నాలుగేళ్ల పాలనచూస్తే ఏమున్నది గర్వకారణం? ఎటుచూసినా నేరాలు-ఘోరాలు, లూఠీలు, విధ్వంసాలు, విద్వేషాలు, అబద్ధాలు. వీటన్నింటిని కలిపి తననివాసంలో బిక్కుబిక్కుమంటూ గడిపేపరిస్థితి తనకుతానే తీసుకొచ్చుకు న్నారు ముఖ్యమంత్రిగారు. ఎటునుంచి పోలీసులువస్తారో, సీబీఐవస్తుందో, న న్ను, నాశ్రీమతిని ప్రశ్నిస్తారేమోనన్న అభద్రతాభావంతో ఆయనఉన్నారు. ముఖ్యమంత్రిగారు ఎందుకు ఈ ఖర్మతెచ్చుకున్నారనే ప్రశ్నకు ఆయనే సమాధా నం చెప్పాలి.

ఎప్పుడైతే సీబీఐ వివేకాహత్యకేసు అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డిగారి పేరు ప్రస్తావించిందో అప్పుడే ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని తేలిపోయింది
తాను ముఖ్యమంత్రికావడానికి ఒకప్రణాళికవేసుకొని 2019మార్చి15న ఆయన చేసిన ఒకకార్యక్రమమే, 4ఏళ్లపాలనతర్వాత కూడా బిక్కుబిక్కుమంటూ ఇంట్లో కూర్చునే విషాదకరమైన పరిస్థితికి కారణమైంది. “వివేకానందరెడ్డి హత్యకేసు జగన్మోహన్ రెడ్డిగారికి ముందేతెలుసు, ఒకఅజ్ఞాతసాక్షి మాదగ్గరఉన్నాడు” అని సీబీఐ హైకోర్ట్ లో అఫిడవిట్ వేసినప్పుడే, నైతికవిలువలు అనేవి ఉండిఉంటే జగన్మోహన్ రెడ్డిముఖ్యమంత్రిపదవికి రాజీనామాచేసి ఉండేవారు.

ఆయన స్థానంలో ఆయనతండ్రిగారు ఉన్నా రాజీనామాచేసి ఉండేవారు.నీలంసంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిటీబస్సుల్ని జాతీయంచేశారు. ఆ వ్యవహారంపై హైకోర్టుతీర్పుచెబుతూ ఈ విషయంముందేచెప్పి ఉంటేబాగుండేది అని అన్నం దుకు సంజీవరెడ్డి గారు నైతికబాధ్యతవహిస్తూ రాజీనామాచేశారు. హత్యవిషయం జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు అని సీబీఐ అన్నాకకూడా ఆయన ముఖ్యమంత్రిపదవిలో కొనసాగడం అర్థరహితం. సిగ్గు, ఎగ్గులేకుండా ఆ పదవి పట్టుకొని వేలాడతారా?

ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికఅర్హత మీకుందా అని జగన్మోహన్ రెడ్డిగారిని ప్రశ్నిస్తున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డిగారి 4ఏళ్ల పాలనమొత్తం నేరాలు-ఘోరాలు, అవినీతి, విధ్వంసాలు, విద్వేషాల మయ మేనని తేల్చిచెబుతూ టీడీపీ ఛార్జ్ షీట్ విడుదలచేసింది. ఈసందర్భంగా నా డిమాండ్ ఏమిటంటే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికీ అనర్హుడు. ఎప్పుడైతే సీబీఐ తనఅఫిడవిట్లో మీపేరు ప్రస్తావించిందో, అప్పుడే మీరు ముఖ్యమంత్రి పదవికి అనర్హులని తేలిపోయింది.”

ఏడాదిలో రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైపోతుంది : నక్కా ఆనంద్ బాబు (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి)
“2019 మే 30.. రాష్ట్రానికి చీకటిఅధ్యాయం మొదలైన రోజు. సిగ్గులేకుండా జగన్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు కేకులుకట్ చేసి సంబరాలు చేసుకుంటు న్నారు. విద్వేషాలు, విధ్వంసాలు, లూఠీలు, కుట్రలు, కుయుక్తులుతప్ప ఈ 4 ఏళ్లలో రాష్ట్రానికి ఏం ఒరిగిందని ప్రశ్నిస్తున్నాం. 72శాతం పూర్తైన పోలవరం ప్రాజె క్ట్ ఆగిపోయింది. ప్రతిపక్షాలపై తప్పుడుకేసులు, ప్రశ్నించేవారిపై దాడులు. ప్రజా రాజధాని అమరావతి నాశనం. ప్రజావేదికకూల్చివేతతో మొదలైన ప్రభుత్వం, ప్రాంతాలు, కులాలు, మతాలమధ్య విద్వేషాలు రాజేయడానికే పరిమితమైంది. సంక్షేమపాలన అంటూ బూటకపుసంక్షేమంతో ప్రజలనోళ్లు కొడుతున్నారు. గతం లో ఉన్నపథకాలకే మసిపూసి మారేడుకాయచేస్తూ ప్రజల్ని వంచిస్తున్నారు. ఇ చ్చినమాట ఏవిధంగా తప్పారో చూస్తున్నాం.

దశలవారీ మద్యపాననిషేధం అనిచెప్పి, మద్యంవ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి గా జగన్ చరిత్రలో నిలిచిపోయాడు
కోడికత్తి డ్రామాతో దళితబిడ్డ శ్రీనివాస్ ను జైల్లో మగ్గేలాచేశారు. ఎన్నికలషెడ్యూల్ విడుదలయ్యాక బాబాయ్ హత్య అనే అంత:పురకుట్రతో అధికారంలోకి వచ్చారు. దానిపై తెలుగుదేశంపై, చంద్రబాబుగారిపై అభాండాలువేశారు. అధికారంలోకి వస్తే దశలవారీ మద్యపాననిషేధం అన్నారు. 29రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో జగన్ తప్ప ఏముఖ్యమంత్రి మద్యం వ్యాపారంచేయడంలేదు. నాసిరకం మద్యం అధికధరకు అమ్ముతూ, ప్రజలప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు.

ఎటుచూసినా భూకబ్జా లు, విశాఖపట్నంకేంద్రంగా ఉత్తరాంధ్రలోనే రూ.40వేలకోట్లభూకుంభకోణానికి పాల్పడ్డారు. టీడీపీప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుకపాలసీనిరద్దుచేసి, నూతన పాలసీపేరుతో నిర్మాణరంగాన్ని నాశనంచేశారు. రోజుకూలీపై బతికే 30లక్షలమం ది భవననిర్మాణకార్మికులు అర్థాకలితో అలమటించేలా చేసింది జగన్ అత్యాశే. ఆ ఖరికి కరోనాని కూడా తనస్వార్థానికి వాడుకొనిసొమ్ముచేసుకున్న ఏకైకముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, పరికరాలు అన్నీఅమ్ముకున్నారు.

జగన్ వచ్చాక రాష్ట్రానికి ఒక్కపరిశ్రమ వచ్చిందా?
తనకు కమీషన్లు ఇవ్వడంలేదని రాష్ట్రంలోని పరిశ్రమల్ని తరిమికొట్టే పనిలో జగన్ నిమగ్నమయ్యాడు. చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొచ్చిన అనేక జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల్ని, పారిశ్రామికవేత్తల్ని భయభ్రాంతులకు గురిచేసి తరిమే శాడు. చంద్రబాబుగారు తీసుకొచ్చిన పరిశ్రమలవల్ల, యువతకు 5.60 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఈప్రభుత్వంలోని మంత్రే (దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి) చెప్పారు. జగన్ వచ్చాక ఒక్కపరిశ్రమ అయినా వచ్చిందా? చదువుకుంటున్న విద్యార్థులతోపాటు, విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న వారికి జగన్ భవిష్యత్ లేకుండా చేశాడు.

జగన్ మాటలునమ్మి, ఆయన్ని గెలిపించినందుకు దళితులు దగాపడ్డారు
ఈ ప్రభుత్వంలో దళితులకు జరిగిన అన్యాయం మాటల్లోచెప్పలేనిది. జగన్ మాయమాటలునమ్మి ఆయనకు ఓట్లేసినదళితుల్నే దగాచేశాడు. 75ఏళ్ల దేశ స్వాతంత్ర్యచరిత్రలో ఏముఖ్యమంత్రి చేయనివిధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని జగన్ నిత్యంఅపహాస్యం చేస్తున్నాడు. దళితుల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లిం చాడు. చంద్రబాబు దళితులకోసం అమలుచేసిన 27పథకాల్ని రద్దుచేశాడు. జగ న్ ఏంచేసినా మంత్రులు సిగ్గులేకుండా తానాతందానా అంటున్నారు.

చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రులు మాట్లాడేది వింటుంటే అవి నోళ్లా, డ్రైనేజ్ లా అనిపిస్తోంది
చంద్రబాబు మహానాడులో ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో ప్రకటిస్తే, మంత్రులంతా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారిమాటలు వింటే అవినోళ్లా.. డ్రైనేజ్ లా అనిపిస్తోంది. రాష్ట్రానికి 14ఏళ్లు ముఖ్యమంత్రిగాపనిచేసిన వ్యక్తికి ప్రజ ల్ని, రాష్ట్రాన్ని ఎలాబాగుచేయాలో తెలియదా? 4ఏళ్లు పూర్తయిన సంబరాలు చేసుకుంటున్నవారి బతుకంతా మరోఏడాదిలో రోడ్డునపడనుంది. ఏ వర్గాలైతే జగన్ ను, అతని ప్రభుత్వాన్ని నెత్తికి ఎక్కించుకున్నారో, వారే ఈ దుర్మార్గపు పాలనకి చరమగీతంపాడటానికి సిద్ధంగా ఉన్నారు. మరోసంవత్సరంలో రాష్ట్రానికి పట్టిన పీడ విరగడకానుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. టీడీపీ విడుదలచే సిన ఛార్జ్ షీట్ ను ప్రజలందరూ చూసి, వాస్తవాలు తెలుసుకోవాలి.”

4 ఏళ్లలో జగన్ దేశంలోనే అపరకుబేరుడు అయ్యాడు, పేదవాడు తిండికిలేని దుస్థితికి దిగజారిపోయాడు: బొండా ఉమామహేశ్వరరావు (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు)
“ జగన్మోహన్ రెడ్డి తన 4ఏళ్లపాలనలో దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్య మంత్రిగా ఖ్యాతిగడించాడు. 4ఏళ్లలో జగన్ నిర్వాకాలదెబ్బకు రాష్ట్రంలోని పేదలు తిండికోసం పాకులాడే దుస్థితికి దిగజారిపోయారు. జగన్ 4ఏళ్లలో రాష్ట్రంలోని ఒక్కోవ్యక్తిపై రూ.2.40లక్షల అప్పుల భారంమోపాడు. 4ఏళ్లలో ఒక్కోకుటుంబం నుంచి పన్నులరూపంలో రూ.1,51, 450లు లాక్కున్నాడు. ఒక్కోకుటుంబంపై రూ.3.94లక్షల అప్పులభారం మోపాడు.

మొత్తంగా జగన్ 4ఏళ్లలో చేసిన దోపిడీదెబ్బకు ఒక్కోకుటుంబం7,86,400రూపాయల అప్పుల్లో మునిగిపో యిం ది. ఒక్కఛాన్స్ అని ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్ అపర కుబేరుడు అయ్యాడు. రాష్ట్రంలో 2వేలనోటు కనిపించకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డే. జగన్ దయతో ఊహించినదాని కంటే ఎక్కువే సంపాదించా మన్న ఆనందంతోనే వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్, భూకబ్జాలతో జగన్ 4ఏళ్లలో రూ.2.27లక్షలకోట్లు కొట్టేశాడు. పైకి కనిపించకుండా కొట్టేసింది ఇంకా ఉంది.

దశలవారీ మద్యనిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ 4ఏళ్లలో రూ.1,20,000కోట్ల మద్యంఅమ్మాడు. టీడీపీ అమలుచేసిన ఉచితఇసుక విధా నం రద్దుచేసి, ఇసుకఅమ్మకాలతో రూ.30వేలకోట్లు కొట్టేశాడు. మైనింగ్, శాండ్, ల్యాండ్, భూకబ్జాలతో 4ఏళ్లలో దాదాపు రూ.2.27లక్షలకోట్లు కాజేశాడు. దీనికి సంబంధించి జగన్ ఇంకాఎక్కువే కొట్టేశాడని ప్రజలు అనుకుంటన్నారు. 4ఏళ్లలో జగన్ దోపిడీ, అక్రమాలను ప్రజలకు తెలియచేసేలా ఛార్జ్ షీట్ విడుదలచేస్తున్నాం .

ఈ ఛార్జ్ షీట్ పై ముఖ్యమంత్రి నోరువిప్పాల్సిందే. టీడీపీ విడుదలచేసిన తొలిదశ మేనిఫెస్టో ప్రజలజీవితాలకు ఊపిరిపోసింది. సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామా తెలుగుదేశంపార్టీ అని ప్రజలు విశ్వసిస్తున్నారు.మాచంద్రన్న ఎప్పుడువస్తాడు… ఈదరిద్రం ఎప్పుడుపోతుందా అని ప్రజలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.”

అబద్ధాలు, దుష్ప్రచారం, మాటతప్పడంలో జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని మించినవారు ప్రపంచంలో ఎక్కడా ఉండరు : పరుచూరి అశోక్ బాబు (టీడీపీ ఎమ్మెల్సీ)
“ అబద్ధాలు, దుష్ప్రచారం, మాటతప్పడంపై ప్రపంచంలో ఎక్కడైనా పోటీలుజరిగి తే, జగన్మోహన్ రెడ్డి, అతనిప్రభుత్వమే తొలిస్థానంలో నిలుస్తుంది. దుర్మార్గపు ప్రచారానికి జగన్, వైసీపీ పెట్టిందిపేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జైకొట్టి, ముఖ్యమంత్రి అయ్యాక మూడురాజధానులు అనడం జగన్ కే చెల్లింది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అని దుష్ర్ర్పచారంచేసి, అధికారంలోకి వచ్చాక ఏమీతేల్చలేక చతికిలబడ్డారు. ఉద్యోగులకు సంబంధించిన సీ.పీ.ఎస్ వారంలో రద్దుచేస్తానన్న వ్యక్తి ఇప్పుడు జీ.పీ.ఎస్ అంటున్నాడు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను.. 2.30లక్షల ప్రభుత్వఉద్యోగాలు భర్తీచేస్తానన్న జగన్, 4ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇచ్చిందిలేదు. యువతజీవితాల్ని నిరాశానిస్పృహల్లో ముంచేశాడు.

తన అధికారాన్ని, ప్రజల్ని, రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిమరీ ఒకవ్యక్తిని కాపాడటానికి ఇంతగా దిగజారిపోయిన ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం. వివేకాహత్యలో చంద్రబాబుప్రమేయం ఉందని, కేసు విచారణను సీబీఐకి అప్పగిం చాలని గగ్గోలుపెట్టి, కోర్టులో పిటిషన్ వేసిన జగన్, ముఖ్యమంత్రి అయిన వెంటనే పిటిషన్ వెనక్కు తీసుకున్నాడు. ఇది మాటతప్పడంకాదా? ఇప్పటికీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ కాకుండాచూడటానికి జగన్ పడుతున్నపాట్లు ప్రపంచక్రిమినల్ చరి త్రలో మరెక్కడా చూడలేము. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినా, వారు జగన్మోహన్ రెడ్డిలాగా దిగజారిపోలేదు. తన అధికారా న్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని తాకట్టుపెట్టిమరీ ఒకవ్యక్తిని కాపాడటానికి జగన్ లా వారు పాకులాడలేదు.

ఆఖరికి తనస్వార్థంకోసం తల్లిని, చెల్లిని దూరంపెట్టాడు. అటు కుటుంబంలో, ఇటుపరిపాలనలో అబద్ధాలు, మాటతప్పడం, దుష్ప్రచారం చేయ డమే తననైజమని జగన్ నిరూపించుకున్నాడు. మద్యనిషేధం చేస్తాననిచెప్పి, మద్యం అమ్మకాలపైవచ్చే ఆదాయం 15ఏళ్లకు తాకట్టుపెట్టి, రూ.25వేలకోట్ల అప్పులు తెచ్చాడు. అమరావతిఅంశం, మద్యపాననిషేధం, సీ.పీ.ఎస్ రద్దు, ఉద్యోగాలభర్తీసహా అనేక అంశాల్లో జగన్ మాటతప్పాడు. చంద్రబాబుగారిపై పింక్ డైమండ్ పేరుతో దుష్ప్రాచారం చేశాడు.

చివరకు అదిలేదని తేలడంతో తేలుకుట్టిన దొంగలా సైలెంట్ అయ్యాడు. డిఎస్పీల ప్రమోషన్లజాబితాలో చంద్రబాబు కమ్మవా రికే ప్రాధాన్యతఇచ్చాడని చెప్పి నానాయాగీచేసి చివరకు నోరెత్తకుండా ఉండిపో యాడు. తాను రాజకీయంగా నిలదొక్కుకోవడానికే జగన్ ఇలాంటి దుష్ప్రచారాని కి తెగబడ్డాడు. జగన్ దుర్మార్గాలతోపాటు, అతని దుష్ప్రచారాల్ని కూడా ఛార్జ్ షీట్లో ప్రస్తావించాము. ఎంత దుష్ప్రచారంచేసినా, అబద్ధాలు, మోసాలతో ఎంతగా ప్రజల్నిమోసగించినా జగన్ ను ప్రజలు నమ్మడంలేదని టీడీపీమహానాడుతో తేలిపోయింది.”

4 ఏళ్లలో మహిళల మానప్రాణాలకు రక్షణలేకుండా చేశారు. లేనిదిశచట్టంతో ముఖ్యమంత్రి, మహిళామంత్రులు సాటి ఆడబిడ్డల జీవితాలతో ఆటలాడటం ఎంతవరకు సమంజసం? : పంచుమర్తి అనురాధ
“ 4ఏళ్ల జగన్ పాలనపై సంబరాలుచేసుకుంటున్న వారంతా కొన్నిప్రశ్నలకు సమాధానంచెప్పాలి. ఏపీ మహిళలు ఎన్నికష్టాలు పడుతున్నారో చూసి సంబరా లు చేసుకుంటున్నారా? కల్తీమద్యంతో మహిళలమానప్రాణాలతో చెలగాటమాడు తున్నందుకు చేసుకుంటున్నారా? లేనిదిశచట్టంతో మహిళల జీవితాల్ని గాలికి వదిలేసినందుకు చేసుకుంటున్నారా? ముఖ్యమంత్రి, మహిళామంత్రులు, మహి ళా ఎమ్మెల్యేలు సాటి ఆడబిడ్డల జీవితాలతో ఆటలాడటం ఎంతవరకు సమంజసం?

దళితమహిళ రాజమహేంద్రవరంలో దిశాపోలీస్ స్టేషన్ ఎదుటే అత్యాచారానికి గురైతే నేటికీ ఎందుకు చర్యలుతీసుకోలేదు? మతిస్థిమితంలేని యువతిపై ప్రభు త్వ ఆసుపత్రిలో అత్యాచారంచేసిన వారిని ఎందుకు శిక్షించలేకపోయారు?దాచే పల్లిలో మైనారిటీబాలికపై ఎమ్మెల్యే అనుచరుడు అత్యాచారంచేస్తే, ఆ బాలికకు ఈ ప్రభుత్వం ఏంన్యాయంచేసింది? జగన్మోహన్ రెడ్డి తల్లిని, చెల్లిని కూడా తరిమేశా డు. ఒకచెల్లి న్యాయంకోసం ఢిల్లీవీధుల్లో, కోర్టులచుట్టూ ఎందుకు తిరుగుతోందో సమాధానం చెప్పండి.

శాండ్, ల్యాండ్, మైనింగ్, గంజాయిమాఫియాతో రాష్ట్రాన్ని నాశనంచేసింది నిజంకాదా? యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారిజీవితాల్ని గంజాయిమత్తులో ముంచడమేనా వారిని ఉద్ధరించడం? మాటతప్పను, మడమతిప్పను అనిచెప్పిన పెద్దమనిషి మద్యపాననిషేధంలో మాటతప్పాడు. సీపీఎస్ రద్దుపై మడమతిప్పాడు. ఒకఇంట్లో ఎంతమంది చదు వుకునే పిల్లలుంటే, అందరికీ అమ్మఒడి ఇస్తాననిచెప్పి, అధికారంలోకి వచ్చాక ఒక్కరికే ఇస్తాననడం తల్లుల్ని మోసగించడంకాదా? 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాననిచెప్పి మాటతప్పింది ఈ ముఖ్యమంత్రికాదా? డీఎస్సీ అమలువిషయం లో మాటతప్పింది మీరుకాదా?

అమరావతిలో ఇల్లుకట్టుకుంటున్నాము.. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామనిచెప్పినవారు ఎందుకు మాటతప్పారు ? డ్వాక్రామహిళలకు సున్నావడ్డీ కింద రూ.10లక్షల రుణమిస్తామనిచెప్పి ఎందు కు మాటతప్పారు? రైతుభరోసాకింద ప్రతిరైతుకి ఏటారూ.12,500లు ఇస్తామ నిచెప్పి, రూ.7,500లే ఇస్తూ మాటతప్పారు. కేంద్రం మెడలువంచి తెస్తామన్న ప్రత్యేకహోదా ఏమైందో సమాధానంచెప్పాలి. కడపఉక్కఫ్యాక్టరీ ఎప్పుడుపూర్తవు తుందో ప్రజలకు చెప్పాలి.”

ఒక్కఅవకాశమిస్తే ప్రజల తలరాతలు మారుస్తానన్న జగన్, 4ఏళ్లలో వారికి కోతలు, వాతలే మిగిల్చాడు: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మొహమ్మద్ నసీర్ అహ్మద్
“ ప్రతిపక్షనేతహోదాలో తనమేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అనిచెప్పిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిహామీని తుంగలోతొక్కుతున్నాడు. ఒక్కఅవకాశమిస్తే ప్రజలతలరాతలు మారుస్తానన్న జగన్, 4ఏళ్లపాలనలో ప్రజల కు కోతలువాతలే మిగిల్చాడు. సామాన్యప్రజల జీవనప్రమాణాలు పెంచేచర్యలు తీసుకోకుండా, 4ఏళ్లుగా వారిపై బాదుడుచర్యలకే పరిమితమయ్యాడు. రాష్ట్రంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ఆర్టీసీఛార్జీలు పెంచాడు. నిత్యావసరాల ధరలు పెంచాడు. దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాడు.

చెత్తపరిపాలనతో చెత్తపైపన్నువేశాడు. జనాల్నిమభ్యపెడుతూ, వారిని దోచు కోవడానికే పరిమితమయ్యాడు. రాష్ట్రాన్ని స్మగ్లర్లు, రేపిస్టులు, హంతకులకు అడ్డాగామార్చి, వారికి ముఖ్యమంత్రి పెద్దదిక్కుగా ఉంటున్నాడు. సొంత బాబా య్ ని చంపేస్తే, సిగ్గులేకుండా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాడు. దళితులు, మైనారిటీలు, బీసీలపై దాడులుచేయిస్తూ, పోలీసులసాయంతో దాడిచేసినవారిని కాపాడుతున్న దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

మైనారిటీలకు 4ఏళ్లుగా రూపాయి సాయం చేయకుండా వారికోసం గత ప్రభుత్వం అమలుచేసిన అనేక పథకాల్ని రద్దు చేశాడు. 4ఏళ్లుగా దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాష్ట్రానికి ఏమీచేయని ముఖ్యమంత్రి పాలనపై ప్రజలు విసిగిపోయారు. తన అనుచరులు, అనుమాయులతో గంజాయి, ఇసుక, మద్యం అమ్మకాలు సాగిస్తూ, ప్రజలసొమ్ముని యథేచ్ఛగా దోచుకుంటున్నాడు. యువత పెడదారి పట్టడానికి జగన్మోహన్ రెడ్డే కారణం. టీడీపీ విడుదలచేస్తున్న ఛార్జ్ షీట్ ప్రజల్ని అప్రమత్తం చేయడానికే అని స్పష్టంచేస్తున్నాం.”

Leave a Reply