శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో మంత్రి కొడాలి నాని ప్రత్యేక పూజలు

– శేష వస్త్రాలతో సత్కరించిన ఆలయ చైర్మన్ రామిరెడ్డి
– జేసీ డాక్టర్ మాధవీలతకు అమ్మవారి చిత్రపటం బహుకరణ
గుడివాడ, సెప్టెంబర్ 1: కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మంత్రి కొడాలి నానికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొండలమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రి కొడాలి నానికి, జేసీ డాక్టర్ మాధవీలతకు ఆశీర్వచనాన్ని అందజేశారు. మంత్రి కొడాలి నానిని కొండాలమ్మ దేవస్థానం చైర్మన్ కనుమూరి రామిరెడ్డి అమ్మవారి శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు. జేసీ డాక్టర్ మాధవీలతకు కొండాలమ్మ చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ కొండాలమ్మ దేవస్థానం చరిత్ర , ఆలయంంలో జరుగుతున్న పూజలు, ఆలయ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను జేసీ డాక్టర్ మాధవీలతకు మంత్రి కొడాలి నాని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు శాయన రవికుమార్, నాయకులు పాలేటి చంటి, తెన్నేరు ప్రభాకర్, శేషం గోపి, దుగ్గిరాల శేషుబాబు, మన్నెం చంటి, పడమట సుజాత, బాడిగ నాని, అల్లూరి ఆంజనేయులు, సతీష్ రెడ్డి, హరనాథ్ రెడ్డి, షేక్ బాజి,

Leave a Reply