Suryaa.co.in

Andhra Pradesh

రాజ్య పరిపాలనకు ఐకాన్ గా శ్రీరాముడే

– జస్టిస్ కృష్ణమోహన్

ప్రముఖ సీనియర్ న్యాయవాది, కోటంరాజు శేష చంద్రమౌళీశ్వరరావు స్వయంగా రచించిన “శ్రీమదాంధ్రరామ శతకావిష్కరణ” కార్యక్రమం స్వామి వివేకానంద హాల్, హిందూఫార్మశీ కళాశాల, అమరావతిరోడ్ లో ఘనంగా జరిగినది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ B. కృష్ణమోహన్ ప్రసంగిస్తూ మానవ సమాజంలో రాజ్య పరిపాలనకు స్ఫూర్తి ప్రదాతగా శ్రీరామచంద్రుడును ప్రస్తావిస్తున్నారని త్రేతాయుగం కాలంనాటి నుండి నేటి ఈ కలియుగం నాటి వరకు శ్రీరామ పరిపాలన గురించి ప్రపంచ దేశాల్లో ఇప్పటికి ప్రస్తావించడం భారతదేశ గొప్పతనమని, అందువల్ల పాలకులు ఆనాటి రామ పరిపాలనను నేటి పాలకులు అవలంభించి ప్రజలు మన్ననలు పొందాలని అభిలాషించారు.

ఈ శ్రీమద్రామాయన శతకములో రామాయణ కావ్యం పూర్తిగా సామాన్యులకు అర్థమయ్యేలా, న్యాయవాద వృత్తిలో ఉండి కూడా రచయిత చంద్రమౌళి ఈ శతకాన్ని రచించడం ఎంతో విశేషమని ఆయన రాసిన రచనను కొనియాడారు.ఈ సభకు సభాధ్యక్షులుగా H.C. & H.S. Council ప్రెసిడెంట్ గబ్బిట శివరామకృష్ణప్రసాద్ వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం విశ్రాంత యాక్టింగ్ ఛైర్మన్ K. పెద పేరిరెడ్డి, గుంటూరు జిల్లా 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.రాం గోపాల్,హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంటా రామారావు , ‘ఆంధ్రవాల్మీకి’ శ్రీ వాసుదాస స్వామివారి పీఠం, అంగలకుదురు అధ్యక్షులు వులిచి సీతారామశర్మ పట్టాభి, ప్రయోక్తగా హిందూ కళాశాల రిటైర్డ్ హిందీ అధ్యాపకులు, పరమాత్ముని దత్త ప్రసాద్,శతక సమీక్ష ను హిందూ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా|| D.N. దీక్షిత్,సమీక్షించి ప్రసంగించారు. కార్యక్రమానంతరం “”శతక కర్త కోటంరాజు శేష చంద్రమౌళిశ్వర రావు దంపతులకు ఘన సన్మానం ను అతిధులతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కోటంరాజు హరి శంకర్, కోటంరాజు శివ, అబ్బరాజు గీతా మాధవి, భట్రాజు కిషోర్,కేసానుపల్లి శ్రీరామ్, కొండూరి నందకిశోర్, మన్నవ రాధాకృష్ణ,, జూపూడి రంగరాజు, కె.కుటుంబరావు, యస్వీఎస్. లక్ష్మినారాయణ, రామకృష్ణ పరమహంస, శిరిపురపు శ్రీధర్, వడ్లమూడి రాజా మరియు పలువురు న్యాయవాదులు,న్యాయవాద సిబ్బంది,నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE