Suryaa.co.in

Features

అర్థరాత్రి రోజు మొదలుకావడం అంటేనే అనాగరికం, అశాస్త్రీయం

అర్థరాత్రి అంటే హాయిగా మొద్దునిద్రలో ఉండాల్సిన సమయం.
అప్పుడు లేచి ఆనందించడం అంటే మీరే అర్థం చేసుకోండి.
అసలు పడుకుంటే కదా !! నిద్రనుండి లేవడానికి అంటారా?!
అసలు ప్రమాదం అదేకదా !! తెల్లవార్లూ నిద్రకాయడం.

అదే హిందూ పండుగలకు బ్రహ్మ ముహూర్తంలో అంటే అంతర్గత జీవగడియారాన్ని అనుసరించి లేస్తాము. సూర్యోదయకాలంలో చేయాల్సిన పనులు మాత్రమే చేస్తాం. సూర్యుడితో పాటులేస్తాం, పడుకుంటాం..
ఋతువుకి అనుసంధానం లేని పండుగ పండుగేనా?
పండుగంటేనే ఆనందం అంటారా?
దానికి ప్రకృతికి ఏంటి సంబంధం అంటారా!?
జీవ వైవిధ్యం అంటేనే సమస్త జీవరాశిని కలుపుకుపోవడం కాదా?

మనకొక్కరికేనా ఆనందం?!
పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, పంచభూతాలు, సకలజీవరాశులకు అక్కరలేదా?! వాటినిnew-year కలుపుకుపోనప్పుడు వాటి మనుగడ ఎట్లా? మొన్న కరోనాక్రిమి పుణ్యాన సమస్త ప్రకృతి మళ్లీ ప్రాణం పోసుకున్న సంగతి మరచిపోలేం కదా!

ఏది, హిందూ ధర్మం తప్ప ఇంకో మతమేమన్న ఇలా చెప్పిందా?
ప్రకృతిలో అలా అలా నాలుగు చెట్ల చుట్టూ, నాలుగు గుట్టల చుట్టూ, నాలుగు వాగులు, వంకల చుట్టూ తిరిగి నాలుగు ఆకులు, నాలుగు పువ్వులు, నాలుగు మూలికలు తెచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇంట్లోకి, వంట్లోకి ఆహ్వానించిన ఆధారాలు ఉన్నాయా?
మన శరీరంలో, అట్లే భూమ్మీద 70 శాతం ఉండే జలానికి, ఏదో పేరుతో, ఏనాడైనా పూజ చేసిన దాఖలాలు ఉన్నాయా!?
మనలో భాగమైన పంచభూతాలకు, బయటఉన్న పంచభూతాలకుఉన్న సంబంధం, సమన్వయం హిందూధర్మం తప్ప ఇంకొకరు ఏపాటి గుర్తించారు?
ఏ మేరకు పంచభూతాలను దైవాలుగా భావించి పూజలు చేశారు?

ఎన్నో జంతువులను (ఏనుగు -వినాయకుడు, పులి- దుర్గ, సింహం- నరసింహ స్వామి, ఆవు- కామధేనువు/సకల దేవుళ్లకు ప్రతి రూపం, యెద్దు- శివుడు, దున్నపోతు- యముడు, కుక్క- కాలభైరవుడు, ఎలుక- వినాయకుడు పంది – వెంకన్న/విష్ణు అవతారాలు, తాబేలు- , పాము- శివుడు, జింక- సీత) పక్షులను (పాలపిట్ట- దసరా, నెమలి- సుబ్రహ్మణ్య స్వామి, గరుడ- వెంకటేశ్వర్లు, చిలుక- రాముడు, కాకి- చనిపోయిన వారి పేరుతో ..)
క్రిమికీటకాలు (నవధాన్యాలు గొబ్బెమ్మలలో, ముగ్గులో పిండి, చక్కర, బెల్లం, ప్రసాదం పెట్టడం)
పండ్లు
(అరటిపండు దగ్గర నుండి వెలగపండు వరకు)
పూలు (తంగేడు నుండి నిత్యంవాడే పూలేగాక కలువపువ్వు వరకు)
ఆకులు (తులసి నుండి బిల్వపత్రం వరకు)
ఆహారం (జొన్నకంకుల నుండి చెఱకుగడల వరకు, అరిసెల నుండి పానకాల వరకు)
నూనెలు (ప్రమిదల్లో వాడే నువ్వులనూనె నుండి అవునెయ్యి వరకు)
ఒకటా రెండా.. తరతరాల నుండి వేలఏళ్లుగా దేన్నీ? ఎలా ? ఎప్పుడు? ఎందుకు? పూజించాలో, దేన్నీ? ఎలా? ఎందుకు? ఎప్పుడు? ఆహారంగా, నైవేద్యంగా, తీర్థంగా స్వీకరించాలో, ఆర్పించాలో హిందువులకు తెలిసినంతగా మరొకరికి తెలుసా!?

కారణం ఏదైతేనేం
పనిచేస్తున్న, పనికొస్తున్న పరికరాలను, కడుపు నింపుతున్న పాడి పంటలను పూజించారా?
ఆ మైసమ్మ ఈ మైసమ్మ పేరుతో చెరువులను, పొలాలను, చెట్లను, పంటలను కాపాడుకోవడం ఇంకొకరికి సాధ్యమా?

కనీసం రుతువుకి సంబంధం ఉన్న, ఆరోగ్యానికి హానిచేయని ప్రసాదాలను, నైవేద్యాలను, తీర్థాలను తీసుకున్న మతాలను చూయించగలరా!?
హిందూ ధర్మం పేరిట చేసే ప్రతిపూజ, పునస్కారం, దానం, ధర్మం ఒకటేమిటి ప్రతిదీ ప్రకృతిబద్దమే… అందుకే మన హిందూపండుగలను భేషుగ్గా, బ్రహ్మాండంగా చేసుకుందాం. వాటివెనుక ఉన్న అంతరార్థం ఏంటో తర్వాతితరాలకు నేర్పుదాం.

అదీ పాశ్చాత్య సంస్కృతి, వేషధారణ, పరికరాలు, ప్లాస్టిక్ లాంటి కాలుష్యపు కారకాలను వదిలేస్తూ… అచ్చం ఆనాటి పాతపండుగల మాదిరి.
ఏరోజుకారోజు మరచిపోవద్దని ఫాదర్స్, మదర్స్, ఉమెన్స్ డే ల చేసుకున్నట్టు కాదు కదా!

మనపండుగలను ప్రకృతే గుర్తు చేస్తుంది.
మిగతావన్నీ (అమ్మలు, అమ్మమ్మల, మహిళల, బాలలదినోత్సవం లాంటివి) రోజూ నిత్యజీవితంలో, మన సంస్కృతిలో భాగంగా మార్చుకున్న గొప్ప ధర్మం మనది.

హిందువుగా గర్వించు… హిందువుగా జీవించు నీతో, నాతో సమస్త జీవరాశిని బ్రతికించు “లోకాః సమస్తా శుఖినోభవంతు”..

– జి.రామారావు

LEAVE A RESPONSE