Home » ఉక్రెయిన్ దుస్థితి మనకు రాకూడదనుకుంటే..

ఉక్రెయిన్ దుస్థితి మనకు రాకూడదనుకుంటే..

ఉక్రెయిన్ రష్యాకు లొంగిపోవడానికి పట్టిన సమయం 48 గంటలు..
లగ్జరీ జీవితానికి అలవాటుపడిన ఉక్రెయిన్ .. రష్యాకు లొంగిపోవడానికి పట్టిన సమయం 48 గంటలు.
ఇదే ఇజ్రాయెల్ అయితే రష్యాను తరిమికొట్టేది..
తేడా ‘ ప్రజల్లో దేశభక్తి..తన జాతిమీద అపారమైన ప్రేమ..తన సంస్కృతి పట్ల గర్వం..తన వీరత్వం మీద నమ్మకం ‘..
ఇవన్నీ లోపిస్తే ఉక్రెయిన్ సంపాదించిన సంపద, 48 గంటల్లో రష్యా కాజేసినట్టు..రేపు మన పరిస్తితి కూడా అంతే..
సిక్కులు ఆఫ్ఘన్ లో కోట్ల ఆస్తులు వదిలేసి భారత్ పారిపోయి వచ్చినట్టు..
పార్శీలు ఇరాన్ నుంచీ కట్టుబట్టలతో భారత్ లో ఆశ్రయం పొందినట్టు..రేపు మన పరిస్తితి అంతే..ప్రత్యేకంగా భారతీయుల పరిస్తితి.
దేశం మీద భక్తి..తన సంస్కృతి పట్ల గర్వం లేని జాతులు, ఎన్నటికైనా కాల గర్భంలో కలుస్తాయి.
చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు..భారత్ కు ఆ దుస్థితి పట్టకుండా ఉండాలంటే..మీ ఊళ్ళో హనుమాన్ వ్యాయామశాలలు ప్రారంభించండి.
మీ పిల్లలు చదువుకున్న తర్వాత, భారత్ లోనే వ్యాపారమో..పరిశ్రమో..
ఉద్యోగమో చేయించే ప్రయత్నం చేయండి.
అమెరికా ఏనాటికైనా కుప్పకూలుతుంది.ఇప్పటికే బలహీన పడింది.
ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ మాటను, కనీసం సిరియా వాడు కూడా లెక్కచేయడం లేదు.
భవిష్యత్తు మొత్తం భారత్ దే. మనమే కాబోయే ప్రపంచ శక్తి.
ప్రపంచంలో ఎవడు ఎట్లా పోయినా, భారత్ విదేశాంగ విధానం కేవలం భారత్ ప్రయోజనాలను రక్షించడానికే పనిచేస్తుంది. ఇదివరకులాగా అలీన విధానం ఆవకాయబద్దలూ ఉండవు.
చైనా తైవాన్ అక్రమణ ను మనం ఖండిస్తాం. తైవాన్ తో మనకు వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మనం పి‌ఓ‌కే ఆక్రమిస్తే సమర్దిస్తాం..దీంట్లో మనకు ప్రయోజనాలు ఉన్నాయి. నీతులు ఏమన్నా ఉంటే వాటిని, మీరు టాయిలేట్ లో హుక్ కు తగిలించి బయటకి రండి.
మనకు ప్రయోజనాలుంటే పాముతో కూడా స్నేహం నటిస్తాం.
దట్స్ ఇట్..
భారత్ మారుతున్నది..మారాల్సింది మనమే..మనమే అంటే ప్రత్యేకంగా ‘ మనమే

-నల్లా విజయ్‌కుమార్, మథిర

Leave a Reply