Suryaa.co.in

Features

పిడుగులు పడే సమయంలో అర్జున ఫల్గుణ అని అని ఎందుకంటారు?

వర్షం వచ్చి ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే సమయంలో మనకు కలిగే భయం తీరడానికి అర్జునుడికి ఉన్న పది పేర్లు పెద్దలు చదువుకోమంటారు. వీటి వెనుక భారత కథ ఇది. విరాటనగరంలో పాండవుల అజ్ఞాతవాసం పూర్తి కాబోతున్న సమయం.

ఉత్తర గోగ్రహణ సందర్భం .ఆయుధాల కోసం ఉత్తర కుమారుడితో కలిసి బృహన్నల (అర్జునుడు) శమీ వృక్షం దగ్గరికి వస్తాడు. కౌరవులను ఎదుర్కోవడానికి ఉత్తర కుమారుడు భయపడుతుంటే తన పది పేర్లు చెప్పి అతని భయం పోగొట్టి విశ్వాసం కలిగిస్తాడు. ఆ పది పేర్లు ఇవి: అర్జునః, ఫల్గునః, పార్థః కిరీటి, శ్వేత వాహనః ,భీభత్సో, విజయో, కృష్ణః, సవ్యసాచి,ధనంజయః, ఈ నామాలకు అర్థాలు ఇవి: అర్జునుడు అంటే తెల్లని వాడు.

ఫల్గుణుడు అంటే ఫల్గుణ నక్షత్రంలో, మాసంలో పుట్టిన వాడు. పృథ( కుంతీదేవి) కుమారుడు కనుక పార్థుడు. యుద్ధంలో అతనికి కిరీటం( కీర్తి) బాగా ప్రకాశిస్తుంది కనుక కిరీటి. తెల్లని గుర్రాలు పూన్చిన రథం కలవాడు కనుక శ్వేత వాహనుడు .అతను యుద్ధం చేసే రీతిని బట్టి బీభత్సుడు. ఎప్పుడూ విజయం అతడినే వరిస్తుంది కనుక విజయుడు.

మిక్కిలి ఆకర్షణీయమైన వాడని తండ్రి పెట్టిన పేరు కృష్ణుడు. కుడిచేత్తోనే కాదు ఎడమచేత్తో కూడా ధనస్సును వేయగలడు కనుక సవ్యసాచి .ధనం మీద మోజు లేదు కనుక ధనంజయుడు. ఈ పది పేర్లు వాటి అర్థాలు చెప్పుకుంటే ఏ భయమైనా తీరిపోతుంది.

LEAVE A RESPONSE