-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్ష
-రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన
-తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రోడ్లు పరిశీలన చేసిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని డిల్లీలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటనలో భాగంగా డిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ అధ్యక్షతన జరుగుతున్న 42వ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ మంత్రి పాల్గొన్న అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధి విధానాలపైన రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. రోడ్డు రవాణా భద్రత పట్ల తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కేంద్రం అనుసరిస్తున్న సాంకేతికతను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖ మంత్రులకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.