Suryaa.co.in

Andhra Pradesh

స్టీల్ ప్లాంట్ భూములు వెనక్కి లాక్కుంటాం

– జగన్ కు రేచీకటి ఉందా, చిప్ దొబ్బిందా?
– మీ నవమోసాలపై చర్చకు సిద్ధమా?
– సొంత తల్లి, చెల్లి నమ్మడం లేదు. మనం ఎలా నమ్మాలి?
– అవినీతిపై చర్చకు మేం సిద్ధం, మీరు సిద్దమా?
– చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాల ముందు జగన్ నిలబడలేడు
– సైకిల్, గ్లాస్ విలువ పెత్తందారుకు అర్థంకాదు
– ఫ్యాన్ రెక్కలు విరిచి చెత్తబుట్టలో పడేయాలి
. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ. జగన్ రెడ్డి పాలనలో విశాఖను విషాద పట్టణంగా మార్చారు
. గత ఐదేళ్లలో మీరు గాజువాకకు పీకిందేమిటి?
– గాజువాక నియోజకవర్గం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్

జగన్ బకాసురుడు, ఐరెన్ లెగ్. ఎప్పుడైతే విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించారో అప్పటి నుంచి బాయిలర్లు పేలుతున్నాయి. ఇక్కడ ఉన్న ఎల్టీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజి జగన్ ఐరెన్ లెగ్ మహిమే. జగన్ పాలనలో రోజుకో మర్డర్, కిడ్నాప్, భూకబ్జా జరుగుతోంది. వైకాపా నాయకులకు మన ఇల్లు నచ్చితే దానిని కూడా లాక్కునే పరిస్థితి. పార్టీ సొంత ఎంపీ భార్య, కొడుకుని కిడ్నాప్ చేశారంటే మన పరిస్థితి ఏమిటి? వైకాపా భూకబ్జాలకు సహకరించడం లేదని ఎమ్మార్వో రమణయ్యను హత్య చేశారు.

జగన్ పదేపదే సిద్ధం అంటున్నారు. నిన్న కూడా రాప్తాడుకు వెళితే వైకాపా నాయకులు, కార్యకర్తలు తాము సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఏకంగా సభ తుస్సుముంది. ఖాళీగా ఉన్న కుర్చీలు ఫోటోలు తీస్తుంటే అక్కడున్న మీడియా మిత్రుడు ఫోటోలు తీస్తుంటే వైకాపా రౌడీలు దాడిచేశారు.

ఎక్కడైనా ముఖ్యమంత్రి సభకు వెళితే చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. ఈ ముఖ్యమంత్రి మాత్రం గంటసేపు చంద్రబాబు పేరు జపం చేస్తున్నారు. 100 సార్లు చంద్రబాబు పేరు పలికారు. దానిని బట్టి ఈయన పీకిందేమీ లేదని అర్థమవుతోంది. కలలో కూడా చంద్రబాబే కనిపిస్తున్నారు.

పెత్తందారుకు సైకిల్, గ్లాస్, ఫ్యాన్ గురించి మాట్లాడారు. సైకిల్, గ్లాస్ విలువ పెత్తందారుకు అర్థంకాదు. సైకిల్ పేదవాడి చైతన్య రథం. గ్లాస్ లో సామాన్యుడు టీ తాగుతారు. జగన్ బంగారు, వెండి గ్లాస్ లో టీ తాగుతారేమో. ఇవాళ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. దీనిని చెత్తబుట్టలో పడేయటమే మంచిది.

రైతు ఆత్మహత్యలకు ఫ్యాన్ ఉపయోగపడింది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానం, రైతు ఆత్మహత్యల్లో 3 వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. యువకులు ఆత్మహత్య చేసుకునేందుకు ఈ ఫ్యాన్ ఉపయోగపడుతోంది.

2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, గ్రూప్-1,2 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారు. 6500కానిస్టేబుల్ భర్తీ చేస్తామని చెప్పారు. లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ లు తీసుకుంటున్నారు. కానిస్టేబుల్ పరీక్ష కోచింగ్ కోసం 2 లక్షలు ఖర్చుపెట్టినట్లు ఓ తల్లి నాకు చెప్పింది.

ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. మెరుగైన పాలసీ తీసుకువస్తానన్నాడు. నాడు వెయ్యి రూపాయలు ఉన్న ట్రాక్టర్ ఇసుక.. నేడు 5వేలకు చేరింది. ఎవరికీ పనులు దొరకడంలేదు. అప్పులు తీర్చే మార్గం లేక వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు అదే ఫ్యాన్ కు ఉరేసుకుంటున్నారు.

చేనేత కార్మికులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఈ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోతున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో 35 వేల మంది ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. అందుకే ఫ్యాన్ రెక్కలు విరిచి చెత్తబుట్టలో పడేయాలి. వచ్చే రెండు నెలల్లో మనకు ఆ అవకాశం రాబోతోంది.

నేను పాదయాత్రలో చంద్రబాబు చేసిన అభివృద్ధిపై సెల్ఫీలు దిగాను. ఆనాడే జగన్ కు ఛాలెంజ్ చేశా. సంక్షేమం, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరా. అటునుంచి సౌండ్ లేదు. చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాల ముందు జగన్ నిలబడలేడు.

జగన్ సభ మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. మండుటెండలో జగన్ వాళ్ల కార్యకర్తలను సెల్ లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు. వాళ్ల కార్యకర్తలు ఒకళ్ల మొహం ఒకరు చూసుకున్నారు. జగన్ కు రేచీకటి ఉందా, చిప్ దొబ్బిందా అని నవ్వుకున్నారు. స్క్రిప్ట్ ఎవరో రాస్తే మధ్యాహ్నం అని కూడా అవగాహన లేని వ్యక్తి జగన్.

ఎన్నికలకు ముందు నవరత్నాలు అని నవ మోసాలు చేశారు. జలయజ్ఞం పేరుతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి తట్టమట్టి కూడా వేయలేదు. పురుగుమందుల కన్నా కల్తీ మద్యం తాగి లక్షలాది మంది చనిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు టార్గెట్లు పెట్టి మరీ విక్రయిస్తున్నారు.

దుర్గా అనే మహిళ మందు షాపులు బంద్ చేయాలని కోరింది. తన కొడుకును జగన్ మద్యం వల్ల కోల్పోయానని చెప్పారు. వెయ్యి పైన అనారోగ్యానికి ఆరోగ్యశ్రీ అమలు చేస్తామన్నారు. ఇప్పుడు పెండింగ్ బకాయిలు పెట్టి నాశనం చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పి మోసం చేశారు. మేం పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని తీసుకువస్తాం. మీరు ఒక్క రూపాయి కట్టాల్సిన పనిలేదు.

రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి 4 గంటలు కూడా ఇవ్వడం లేదు. మీ నవమోసాలపై చర్చకు సిద్ధమా? వై నాట్ 175 అంటున్నారు. నేను నై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వైనాట్ పోలవరం, వైనాట్ జాబ్ కేలండర్, గ్రూప్-1,2 పోస్టులు, వైనాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం.. వీటిపై సమాధానం చెప్పాలి.

మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు. సొంత తల్లి, చెల్లి నమ్మడం లేదు. మనం ఎలా నమ్మాలి? సిద్ధం అంటున్నారు.. సొంత చెల్లి ఈయనను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు షర్ట్ మడత పెడతా అంటున్నారు.. ప్రజలు కుర్చీ మడత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు. సొంత తల్లి, చెల్లి నమ్మడం లేదు. మనం ఎలా నమ్మాలి? సిద్ధం అంటున్నారు.. సొంత చెల్లి ఈయనను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు షర్ట్ మడత పెడతా అంటున్నారు.. నీ కుర్చీ మడత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నాం.

పసుపు కుంకుమ, పండుగ కానుకలు, చంద్రన్న బీమా, పెళ్లికానుకలు, అన్న క్యాంటీన్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య లాంటి 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారు చంద్రబాబు. రూ.200 పెన్షన్ ను రూ.2వేలు చేశారు. మీరు పడుతున్న కష్టాలు చూసి బాబు-పవన్ కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారు.

మొదట హామీ ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తాం. పద్దతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగం రాని వారికి అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.

స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం, ఒక్కరుంటే రూ.15వేలు, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం.

ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తాం, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఆరో హామీ ఆర్టీసీ బస్సుల్లో తెలుగు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

వేదికపై నేను మొదటిసారి సెల్ తీశా. స్టీల్ ప్లాంట్ భూములు అమ్మడానికి ఇక్కడ యాడ్ ఇవ్వలేదు, హైదరాబాద్ పేపర్ లో యాడ్ ఇచ్చారు. ఆ భూములు కొనేవారికి నేను చెబుతున్నా.. మేం అధికారంలోకి వచ్చాక భూములు వెనక్కి లాక్కుంటాం. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటాం.

జగన్ విశాఖ పాదయాత్రలో జిల్లాకు 50 హామీలు ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ పూర్తిచేస్తామన్నారు, చేయలేదు. విశాఖ మెట్రో పూర్తిచేస్తామన్నారు, పూర్తిచేయలేదు. మూత పడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని మోసం చేశారు. 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామన్నారు.. తాగునీరు కూడా తీసుకురాలేదు.

ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మన కోడిగుడ్డు మంత్రి దెబ్బకు ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి.

విశాఖకు పరిపాలన రాజధాని తీసుకువస్తామని చెప్పి భూములు కబ్జా చేస్తున్నారు. రుషికొండకు గుండుకొట్టి ఏకంగా రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. ఒక వ్యక్తి కోసం ఇంత ఖర్చు పెట్టారు. టిడ్కో ఇళ్లకు ఆ డబ్బు ఖర్చు పెట్టి ఉంటే మీ అందరికీ ఇళ్లు వచ్చేవి.

రెండు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది.. ఆ భవనాలను ప్రజల కోసం వినియోగిస్తాం. ఆంధ్రా యూనివర్సిటీలో 1400 పీహెచ్ డీ సీట్లు అమ్ముకున్నారు. జగన్ కు వాటా ఇచ్చినట్లున్నారు. అందుకే ఏయూ వీసీగా ప్రసాదరెడ్డికి రెండోసారి అవకాశం ఇచ్చారు. ఆయన పేరు కూడా రెడ్ బుక్ లో ఉంది.

గాజువాక మినీ ఇండియా లాంటిది. విశాఖ ఉక్కు, గంగవరం పోర్ట్, బీహెచ్ పీ టౌన్ షిప్ ఇక్కడ ఉన్నాయి. దేశంలో ఎక్కడెక్కడ నుంచో వచ్చి గాజువాకలో ఉంటారు. ఆటోనగర్ ద్వారా కూడా పెద్దఎత్తున ఉపాధి లభిస్తోంది. అనేక ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నాయి.

ఆనాడు పల్లా శ్రీనివాస్ నాయకత్వంలో వెయ్యి కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఈఎస్ఐ ఆసుపత్రిని అభివృద్ధి చేశాం. హుద్ హుద్ సమయంలో 24 గంటల్లోనే కరెంట్ అందజేశాం. 19వేల మందికి పట్టాలు అందించిన వ్యక్తి పల్లా శ్రీనివాసరావు.

రోడ్లు, డ్రైయిన్లు, సీసీ రోడ్లు, తాగునీటి పథకాలు టీడీపీ హయాంలోనే అందించాం.

2019 ఎన్నికల్లో మీరు గెలిపించిన వ్యక్తి దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు. ఈ రోజు ఇంకో వ్యక్తిని తీసుకువచ్చారు. ఇతను కూడా మన డబ్బు దొబ్బడానికే వచ్చాడు తప్ప ప్రయోజనం ఉండదు. గత ఐదేళ్లలో మీరు గాజువాకకు పీకిందేమిటి?

విశాఖ ఉక్కుపై ఏనాడైనా ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎంపీ, జగన్ రెడ్డి స్పందించారా? మోడీ గారిని కలిసి అడిగారా? మీ తరపున పల్లా శ్రీనివాసరావు పోరాడితే.. పక్కనే ఉన్న, అన్ని అనుమతులు ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ ను కూడా కూలగొట్టారు. రెండు నెలలు ఓపిక పడితే జ్యుడీషియరీ ఎంక్వైరీ వేసి అధికారులపై చర్యలు తీసుకుంటాం.

టీడీపీ-జనసేన బలపరచిన వ్యక్తిని గెలిపించండి.. అన్ని హామీలు అమలు చేస్తాం. ఇక్కడే ఉన్న టోల్ గేట్ ఎత్తేస్తాం. గంగవరం పోర్ట్ బాధితులను ఆదుకుంటాం. ఏపీఐఐసీ బాధితులు కూడా ఉన్నారు.. రెండేళ్లలో పరిష్కరిస్తాం. పోర్ట్ వల్ల పొల్యూషన్ వస్తోంది. దానిని తగ్గిస్తాం.

వాహనాలు పట్టణంలోకి రాకుండా ఫ్రైట్ కారిడార్ ఏర్పాటుచేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకా కొంతమందికి పట్టాలు రావాల్సి ఉంది. వారికి కూడా పట్టాలు అందిస్తాం. జెట్లీకి ఫ్లాష్ బ్రేక్ వాటర్ ఏర్పాటుచేస్తాం. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ పెండింగ్ పనులు పూర్తిచేస్తాం. హెవీ వెహికల్స్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఐదేళ్లలో ఫ్లైఓవర్ ఏర్పాటుచేస్తాం.

వైకాపా కార్యకర్తలకు బూమ్ బూమ్ కావాలి కానీ.. చంద్రబాబు ఒక్క పిలుపునిస్తే చాలు. మీ రుణం తీర్చుకునేందుకు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుచేసి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు వందకోట్లు ఖర్చు చేశాం. బాధిత కుటుంబాల పిల్లలను చదివించలేకపోతే వారిని దత్తత తీసుకుని చదివిస్తున్నారు మా తల్లి భువనమ్మ.

టిడిపి కార్యకర్తలపై ఇప్పటివరకు అనేక అక్రమ కేసులు పెట్టారు. 2019కి ముందు నాపై ఒక్క కేసు కూడా లేదు. అలాంటిది నాపై 22 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, అటెమ్ట్ మర్డర్ కేసులు పెట్టారు. ఇప్పటికి 7 సార్లు నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారు. పోలీస్ స్టేషన్ నాకు అత్తగారి ఇల్లులా మారిపోయింది. పల్లా శ్రీనివాసరావు గారిపై అక్రమ కేసులు పెట్టారు. నేను ఎవరినీ వదిలిపెట్టను. మేం వచ్చిన తర్వాత జ్యుడీషియల్ విచారణ చేయించి జైలుకు పంపిస్తాం. కార్యకర్తలందరూ ప్రతి గడపకు వెళ్లి సూపర్-6 కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి.

LEAVE A RESPONSE