– ఆసుపత్రి భవన నమూనాను పరిశీలించిన మంత్రి నారా లోకేష్
– త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
ఉండవల్లిః విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం చినకాకాని వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రదర్శించిన ఆసుపత్రి భవన నమూనాను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి. కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది.దేశంలోనే అత్యుత్తంగా ఉండేలా ఆసుపత్రిని తీర్చిదిద్దాలి. ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ది భార్గవ్ గ్రూప్ ఎండీ ఏ.భార్గవ్, డీజీఎమ్ కిషోర్, సీనియర్ ఇంజనీర్ అనిల్, ఏపీఎస్ఎస్ డీసీ (ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) ఛైర్మన్ చల్లపల్లి శ్రీనివాసరావు, వీసీ అండ్ ఎండీ పీఎస్ గిరీష, వాస్తు కన్సల్టెంట్ జయరామిరెడ్డి, ఏపీఎమ్ఎస్ఐడీసీ సీఈ కె.శ్రీనివాసరావు, ఎస్ఈ వి.చిట్టిబాబు, ఈఈ సీవీ రమణ, డీఈఈ ఎమ్.హనుమంతరావు నాయక్, ఏఈ జి.గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.