Suryaa.co.in

Andhra Pradesh

సులభతర వాణిజ్యంలో ఎపి మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయండి

– సి ఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

అమరావతి: సులభతర వాణిజ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత పదేళ్ళలో ఎక్కువ పర్యాయాలు దేశంలో మొదటి స్థానంలో నిలవడం జరిగిందని ఆస్థానాన్ని నిలబెట్టుకు నేందుకు సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు.రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది ప్రపంచ బ్యాంక్ గ్రూప్ స్థాపించిన ర్యాంకింగ్ వ్యవస్థని వ్యాపారాలకు మెరుగైన,సాధారణంగా సరళమైన,నిబంధనలు అందుబాటులో ఉంటే సులభతర వాణిజ్యానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

2024 లో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నేతృత్వంలోని వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2024 ద్వారా వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని పెంచడంపై భారతదేశం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.సులభతర వాణిజ్య విధానంతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆదిశగా ఆయా శాఖలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంలో ప్రత్యేక దృష్టి సారించి ఎపిని మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

LEAVE A RESPONSE