చంద్రబాబును కలిసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు

Spread the love

అమరావతి:-వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు చేతిలో హత్యకు గురైన అతని డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో టిడిపి అధినేతతో భేటీ అయిన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు. తమ కుమారుడి హత్య కేసును పోలీసులు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యdriver కేసు విషయంలో ఇప్పటికీ వైసిపి వర్గాలు, ఇతర వ్యక్తుల నుంచి తమపై ఒత్తిళ్లు ఉన్నాయని వివరించారు. హత్య కేసు నుంచి ఎమ్మెల్సీ అనంత బాబును బయటపడేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తమ కుమారుడి హత్య కేసులో న్యాయ పోరాటానికి తాము సిద్దంగా ఉన్నామని మద్దతుగా నిలవాలని కోరారు. సిబిఐ దర్యాప్తు ద్వారానే సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులకు శిక్ష పడుతుందని వారు అభిప్రాయ పడ్డారు. తమ కుటుంబానికి టిడిపి నుంచి 5 లక్షల సాయం అందించినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి పార్టీ పరంగా పూర్తిగా అండగా ఉంటామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.

Leave a Reply