ఒక కన్న తల్లిని బయటికీ ఎలా తోసేస్తున్నాడు ఒక కొడుకు కోడలు? కోడలు అడజన్మ కదా? ఇలాంటి మృగాలు ప్రపంచంలో ఉన్నారు?
ఒసేయ్ పాపాత్మురాలా, అరేయ్ ఓ నీచుడా, దుర్మార్గుడా జన్మించిన కన్నతల్లిని ఇలా బాధపెట్టాడానికి అసలు మీకు మనసెలా వచ్చింది రా నరరూపరాక్షసులారా. రేపటిరోజు మీకు పుట్టగతులు ఉండవు. నాశనమైపోతారు పక్షవాతం వచ్చి సర్వనాశనమైపోతారు.
తల్లి పాలు తాగి తల్లి రొమ్ముకే ఆశ పడే నా కొడకా, నీతల్లి నిన్ను నలుగురిని కంటావనో లేక నలుగురితో పంటావనో నిన్ను కనలేదు రా ఈ తల్లి. అమ్మ ఋణం ఏదో ఒకరోజు నా కొడుకు తీరుచుకోకపోడా అనే ధైర్యంతో కన్నది రా.
ఎలా కన్నావమ్మా..? అసలెందుకు కన్నావమ్మా..? ఈ సిగ్గు మాలిన ఈకొడుకుని. అరేయ్ అసలు మీరు మనిషులా..? లేక పశువులా..? ఛీ మీకంటే నోరులేని ఆపశువులే వెయ్యి రెట్లు మేలు కదరా. ఛీ మీ బతుకులు చెడా.
ఒసేయ్ వీడి కంటే బుద్ధి లేకపోతే సరి మరి నీకేమైందే..? పాపిష్టి మొఖం దానా..? ఈ కన్నతల్లిని మెడ పట్టుకుని తోసేసావ్..? నువ్వు అసలు ఆడడానివేనా..? ఒసేయ్ నీ కన్నతల్లి లాంటిదే కదే ఈ తల్లి కూడా. ఈ తల్లిని ఇంతగా కఠినంగా హింసించి బాధపెడుతున్న మీకు పుట్టగతులు ఉండవు. మీరు నాశనమైపోతారు. పక్షవాతం వచ్చి మీరు సర్వనాశనమైపోతారు.
అమ్మ నవమాసాలు తన కడుపున మోసి, కని, పెంచిన అమ్మ నేడు భారమౌతోంది. పిల్లల కంట్లో నలుసు పడితే తన కంట్లో కన్నీళ్లు తెచ్చుకునే అమ్మ ముసలి వయసులో నేడు కానిదవుతోంది. కడుపులో ఉన్నప్పుడు మీరుతనను కాళ్లతో తన్నినా భరించిన అమ్మ ప్రేమ నేడు కరెన్సీ కట్టల ముందు తెలిపోతోంది. తన రక్తాన్ని పాలగా మార్చి మనకు కడుపునింపిన అమ్మకు మలిసంజే వేళ మింగ మెతుకు లేకుండా పోతోంది. కన్నపేగుతో పాటు, ప్రేమానురాగాలు పంచిన తల్లి నేడు అనాధ అవుతోంది.
జన్మనిచ్చిన కన్నతల్లిని బాధపెట్టేవాడు తల్లిని గౌరవిచలేని వాడు మృగంతో సమానం. వాడు బ్రతికున్నా చచ్చినట్టే. ఒక కన్నతల్లి తన పిల్లల్ని ఎంతో కష్టపడి, ఎన్నో బాధలు పడి, పెంచి పెద్ద చేస్తుంది. అదే కన్నతల్లికి ముసలితనము వచ్చేసరికి కన్నబిడ్డలు (కసాయి బిడ్డలు) ఆ కన్నతల్లిని ఇలా నడిరోడ్డు మీద వదిలేస్తున్నారు. అరేయ్ అసలు మీరు మనుషులేనా..? మీకు మనసు అనేది లేదా..?
బిడ్డ పుట్టిన దగ్గర నుండి పెరిగి పెద్దయ్యే వరకు ఏ కష్టము రాకుండా ఎంతో ప్రేమను పంచి, పెంచిన ఆ అమ్మకే నేడు ప్రేమ కరువైంది. ప్లీజ్ అమ్మని ఏడిపించకండి రా. అమ్మని ప్రేమగా చూసుకోండి. ముఖ్యంగా ముసలితనంలో. అమ్మ ను పూజించండి, ప్రేమించండి, ఆరాధించండి. కాస్త అమ్మ ఋణం తీర్చుకోండి.
అమ్మంటే అంతులేని సొమ్మురా. అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మమనసున అమృతమే ఉంది చూడరా. అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకో రా.
– సంపత్రాజు
1 thought on “ఇలాంటి మృగాలు..”