Suryaa.co.in

Andhra Pradesh

సుజనా గెలుపు కోసం.. 108 కొబ్బరి కాయలు కొట్టారు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టిడిపి, జనసేన బలపరిచిన బిజెపి కూటమి అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ గురువారం శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం క్రింద ఘా ట్ రోడ్డు ప్రారంభం లో బీజేపీ నేతలుకొబ్బరికాయలు కొట్టారు. బిజెపి నాయకులు పోతిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది.

తొలుత అమ్మవారికి పూజా కార్యక్రమం చేసిన పోతిన తన కార్యకర్తలతో కలిసి 108 కొబ్బరికాయలు కొట్టి సుజనాచౌదరి గెలవాలని అమ్మవారిని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పోతిన బేసికంటేశ్వరుడు, పోతిన అచ్యుతరావు, పోతిన అవినాష్, పి రాము, పి హరికృష్ణ, జనసేన నాయకులు అడపా ప్రతాప్, రేఖపల్లి శ్రీను, పి శ్రీకాంత్, బి గిరీష్, ఆర్ కె, టిడిపి, బిజెపి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE