Suryaa.co.in

Andhra Pradesh

ఆసిఫ్.. నాలుక కోస్తాం

-ఆసిఫ్..ముస్లిం లకు ఏం చేసావ్?
-పేకాట ఆడేవాడు… కార్పొరేటర్ కే తక్కువ
-సుజనా గెలుపునకు ముస్లిం సమాజం కట్టుబడి వుంది
-ఆసిఫ్ కు మైనారిటీ నేతల వార్నింగ్

విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపునకు ముస్లిం సమాజం కట్టుబడి ఉందని, భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు అందరూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఏపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతావుల్లా తెలిపారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఫతవుల్లా మీడియాతో గురువారం మాట్లాడారు.

మహిళలతో సహా భారీగా ముస్లిం నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రలోభాలకు లోనైన కొందరు ఆసిఫ్ ను భుజాన వేసుకుని మాట్లాడుతున్నారని అన్నారు. కార్పొరేటర్ గా ఉన్నపుడు ముస్లిం లకు ఆసిఫ్ ఏం చేశారని, మైనారిటీ కార్పొరేసన్ చైర్మన్ గా ఉన్నపుడు ఎవరికైనా రుణాలు ఇప్పించారా అని ఫతావుల్లా ప్రశ్నించారు. బుగ్గ కారు, రెమ్యూనరేషన్ కోసమే చైర్మన్ పదవి తీసుకున్నారని ఆరోపించారు.ఎన్నికల్లో కులాల మతాల ప్రస్తావన తీసుకు రావడం ఆసిఫ్ కు తగదని అన్నారు. పశ్చిమానికి సుజనాను, ఎంపీ అభ్యర్థిగా చిన్నిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామనీ ఫతావుల్లా అన్నారు.

నాలుక కోస్తాం
సుజనా చౌదరి, కేశినేని చిన్ని గురించి నోరు జారి మాట్లాడితే ఆసిఫ్ నాలుక కోస్తామనీ మైనారిటీ నాయకురాలు ఆషా హెచ్చరించారు.పేకాటలతో కాలం గడిపే ఆసిఫ్ ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్ కి తక్కువ అని ఆషా ఎద్దేవా చేశారు. వెస్ట్ లో సుజనాను 50వేల ఓట్ల మెజారిటీతో, చిన్నిని మూడు లక్షల మెజారిటీతో గెలిపించుకుంటామని ఆషా ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో షేక్ బడే సాహెబ్, ఎండీ మోదీన్, ఎండీ నజీబ్, షేక్ ఇస్మాయిల్, షేక్ ఫకృద్దీన్, షేక్ జాన్ బాషా, సయ్యద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE