Suryaa.co.in

Andhra Pradesh

రెండు చోట్లా వైకాపాకు బొక్కే

-టీవీ9 ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి ముఖంలో ప్రేత కళ
-జగన్మోహన్ రెడ్డి పాలనలో కట్టిన ప్రాజెక్టు ఒక్కటి లేదు… కొట్టుకుపోయిందే ఎక్కువ
-రాష్ట్రానికి వచ్చిన ఫ్యాక్టరీ ఒక్కటి కూడా లేదు… కమీషన్లు ఇవ్వలేదని అమర్ రాజా ను బలవంతంగా తరిమేశారు
-అభివృద్ధితో కూడిన సంక్షేమమే చంద్రబాబు నాయుడు లక్ష్యం
-నరసాపురం పార్లమెంటు సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కొత్తగా కట్టింది ఒక్క ప్రాజెక్టు కూడా లేదని, కొట్టుకుపోయినవే ఎక్కువని నర్సాపురం పార్లమెంటు సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును 77% పూర్తి చేసి ఇస్తే, ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రెండు శాతం కూడా పూర్తి చేయలేదన్నారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పడుకోబెట్టేశారని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకముందే హడావుడి ప్రారంభించారని, అందుకే నీళ్లు కూడా రాలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అలసత్వ వైఖరి వల్ల పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని, ఇసుక మాఫియా పుణ్యమా అని అన్నమయ్య ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయిందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనిగిరి సభలో చెప్పారని గుర్తు చేశారు.

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, డబ్బులు ఇవ్వనందుకు అమర్ రాజా ఫ్యాక్టరీని బలవంతంగా రాష్ట్రం నుంచి తరిమి వేశారన్నారు. అమర్ రాజా పరిశ్రమ విస్తరణ కోసం 20 నుంచి 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టాలని యాజమాన్యం భావించిందన్నారు. అయినా తమ కమిషన్ల కక్కుర్తి కోసం స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమను తరిమి వేశారన్నారు.

భూరక్ష పథకం లో ప్రజల ఆస్తులపై జగన్మోహన్ రెడ్డి తన వేసుకుంటారని, ఒరిజినల్ డాక్యుమెంట్లను తన వద్ద పెట్టుకొని, భూ యజమానికి మాత్రం జిరాక్స్ పత్రాలను ఇస్తారన్నారు. ఆ తరువాత ఒరిజినల్ పత్రాలను తనఖా పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులపై అప్పులు చేస్తారన్నారు .

అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని అమలు చేయడమే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంతో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం తప్పు కాదన్నారు. హర్ ఘర్ కి జల్ పేరిట కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటికి మంచి నీటి సరఫరా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

కనిగిరి బహిరంగ సభలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయాన్ని చెప్పారన్నారు. ఇదే విషయాన్ని గత 15 రోజులుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నానని చెప్పారు. నరసాపురం పార్లమెంటు సభ్యునిగా గతంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి ఈ పథకాన్ని ఉభయ గోదావరి జిల్లాలో కచ్చితంగా అమలు చేయాలని కోరానని తెలిపారు. దానికి కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు భరించే ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు.

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో ఆక్వా సాగు వల్ల తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదన్నారు. విద్వేశ్వరం ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ ద్వారా 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఒక రిజర్వాయర్ నిర్మించి, ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా ఇంటింటికి మంచి నీటి సరఫరా చేయాలని ప్రణాళికలను రూపొందించడం జరిగిందన్నారు. కానీ వైసీపీ నాయకులు రూపాయకి అర్థ రూపాయ కమిషన్ లేకపోతే తగ్గేదే లేదంటూ భీష్మించుకొని కూర్చోవడం వల్లే, అంత పెద్ద మొత్తంలో కమీషన్లు ఇవ్వలేక ఇంటింటికి మంచినీటి పథకం అటకెక్కిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అభ్యంతరాన్ని తెలిపిన సిబిఐ
ఎన్నికల అనంతరం 15 రోజులపాటు భార్యతో కలిసి లండన్, స్విట్జర్లాండ్ వెళ్లడానికి అనుమతిని ఇవ్వాలని కోరుతూ, జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటీషన్ పై సిబిఐ అభ్యంతరాన్ని వ్యక్తం చేసిందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. సాధారణంగా అయితే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సిబిఐ అభ్యంతరాన్ని తెలియజేయదన్నారు. విదేశాలకు వెళ్లి వస్తే వెళ్లి రండి… కానీ ఎక్కడ ఉంటారో చెప్పాలని మాత్రమే కోరుతుందన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారో కూడా సిబిఐకి చెప్పరని ఎద్దేవా చేశారు. అటువంటి సీబీఐ, జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో విదేశీ పర్యటనకు అనుమతించవద్దని కోరడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.

ఇటీవల రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్టులు రెడీ చేసుకుంటున్నాడని, ఈసారి విదేశాలకు వెళితే తిరిగి రాడేమోననే అనుమానాన్ని వ్యక్తం చేశారని గుర్తు చేశారు. గత ఏడు ఎనిమిది నెలల క్రితం నేను అమెరికాకు వెళ్లినప్పుడు, జగన్మోహన్ రెడ్డి కూడా యూరప్ పర్యటనకు వెళ్లారు. అప్పుడు నేను కొన్ని బ్యాంకర్ల పేర్లను ప్రస్తావించాను. హిమాన్ ఐలాండ్స్ వచ్చిన ఏ బ్యాంకర్లు జగన్మోహన్ రెడ్డిని కలిశారో చెప్పానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తద్యమని క్రిస్టల్ క్లియర్ గా తేలిపోయింది.

గతంలో వై నాట్ 175 అని అహంకారంతో జగన్మోహన్ రెడ్డి చెప్పేవారని, ఇప్పుడు ఏడుస్తూ చెబుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ని, డి ఐ జి అమ్మిరెడ్డి తో పాటు, ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు, నలుగురు జిల్లా ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేయడం జరిగింద న్నారు. దీనితో అధికారులను మార్చేస్తున్నారని, ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదోనని జగన్మోహన్ రెడ్డి గద్గద స్వరంతో ఆందోళన చెందుతున్నారన్న ఆయన, గతంలో అహంకారం కొట్టొచ్చినట్లు కనిపించే జగన్మోహన్ రెడ్డి ముఖంలో ఇప్పుడు ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు.

జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తే, రానున్న ఎన్నికల్లో ఆయన ఓడిపోబోతున్నారని స్పష్టమవుతోందన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈసారి విదేశాలకు వెళితే తిరిగి రారేమోనని కాబోలు సిబిఐ అభ్యంతరాన్ని తెలియజేసి ఉంటుందన్నారు. ఈ కేసును మే 14వ తేదీకి వాయిదా వేశారన్న రఘురామకృష్ణంరాజు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిని ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.

జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సిబిఐ అనుమతి ఇస్తుందా? నిరాకరిస్తుందా?? అన్నది వేచి చూడాలని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. సిబిఐ కోర్టులోని జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లను త్వరితగతిన విచారించి, పరిష్కరించాలని కోరుతూ, గతం లో సుప్రీం కోర్టులో తాను పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు కూడా డిశ్చార్జ్ పిటిషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించిందన్నారు.

సీబీఐ కోర్టు నుంచి బదిలీ అయిన న్యాయమూర్తిని తీర్పు ఇచ్చేవరకు కొనసాగించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటీషన్ ను దాఖలు చేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లను విని తీర్పు ఇస్తే, కేసుల ట్రయల్ ప్రారంభం అవుతుందన్నారు. సుప్రీం కోర్టు సెలవులలోపే, రేపు కూడా నేను దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పునర్ నిర్మాణాన్ని ఎవరు ఆపలేరన్నారు. అమరావతి పునర్నిర్మాణానికి బిజెపితో పాటు, పవన్ కళ్యాణ్ కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించారని గుర్తు చేశారు.

కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది
విశాఖపట్నం పార్లమెంటరీ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు, విజయనగరంలో కొంత పోటాపోటీగా స్థానాలలోనూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ తో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖపట్నం రాజధాని అని ప్రకటించినందుకు ఉత్తరాంధ్రలో, అమరావతిని రాజధాని కాదని అన్నందుకు ఇక్కడ రెండు చోట్ల వైకాపాకు బొక్కేనని అన్నారు. నరసాపురం పార్లమెంట్ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలను, అమలాపురం పార్లమెంట్ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలు, ఉదయ గోదావరి జిల్లా లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు.

చిత్తయిన సి ఎస్ ఎత్తుగడ
జగన్మోహన్ రెడ్డి ఐదు నెలల క్రితమే బటన్ నొక్కగా ఇప్పటికీ లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ కాలేదని, ఇప్పుడు కొత్తగా బటన్ నొక్కాలని జగన్మోహన్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సి ఎస్ ) జవహర్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి ప్రముఖ న్యాయవాదులు వాదనలను వినిపించగా, న్యాయస్థానం ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వ వాదనను సిఫార్సు చేసిందన్నారు. ఐదు నెలల క్రితమే నొక్కిన బటన్ కు సంబంధించిన డబ్బులు ఇంకా లబ్ధిదారుల ఖాతాలలో జమ కాలేదని, ఎన్నికలకు రెండు రోజుల ముందు బటన్ నొక్కాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పిందన్నారు.

ఎన్నికల తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బటన్ నొక్కి లబ్ధిదారులకు మేలు చేకూర్చాలని సూచించిందని తెలిపారు. తెల్లారితే పోలింగ్ అనగా మహిళల అకౌంట్లో డబ్బులు జమ చేస్తే వారు మురిసిపోయి ఓట్లు వేస్తారని ఈ తరహా కుట్రకు తెర లేపారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . తాము వేసిన ఎత్తుగడ ఇలా చిత్తైపోతుందని బహుశా ఆలోచించి ఉండరన్నారు. గత ఐదు నెలల క్రితం నొక్కిన బటన్ కు సంబంధించిన డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలో చేరి ఉంటే, ఇప్పుడు బటను నొక్కడానికి ఎన్నికల సంఘం అనుమతిని ఇచ్చి ఉండేది అన్నారు.

ఏబీ వెంకటేశ్వరరావు పై సస్పెన్షన్ అన్యాయం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై రెండు సార్లు సస్పెన్షన్ వేటు వేయడం తీవ్ర అన్యాయమని రఘురామకృష్ణంరాజు అన్నారు. క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఈనెల 31వ తేదీన రిటైర్మెంట్ కాబోతున్నారని, కొత్త ప్రభుత్వం ఆయన సేవలను ఎలా వినియోగించుకుంటుందో చూడాలన్నారు.

టీవీ9 లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముఖంలో ప్రేత కళ కనిపించిందన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రశ్నించినప్పుడు తమ్ముడు తప్పు చేయలేదని నమ్మానని, తన చెల్లెలు చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు చేతిలో సీబీఐ ఉండి ఉంటే, ఐదేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకుండా ఉండేవారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరితే, సిబిఐ సహకరించలేదని గుర్తు చేశారు.

వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో పులివెందుల పూల అంగడిలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. సాక్షి టీవీలో ప్రసారం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూలను సాక్షి 9, సాక్షి ఎన్ చానల్లో ప్రసారం చేసే ప్రజలను వంచించాలనుకుంటున్నారని, కానీ ప్రజలకు ఇప్పటికే వాస్తవాలు ఏమిటో తెలిసిపోయాయన్నారు. ప్రస్తుతం సట్టా మార్కెట్లో ప్రభుత్వ ఏర్పాటుపై జోరుగా పందాలను కాస్తున్నారని, ఆ పందాలతో మనకు సంబంధం లేకపోయినప్పటికీ, మార్కెట్ ట్రెండ్ ను తెలియజేయడానికి చెబుతున్నానన్నారు. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రూపాయలకు రెండు రూపాయల పావలా చొప్పున పందాలను కాస్తున్నారన్నారు. ఇక వైకాపాకు 62 సీట్లు వస్తాయని పందాలను కాస్తున్నప్పటికీ, వాస్తవానికి 42 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదన్నారు.

చంద్రబాబు బహిరంగ సభను సక్సెస్ చేయాలి
ఉండి, పరిసరా ప్రాంతాలలోని ప్రజలు శుక్రవారం ఉదయం ఉండిలో నిర్వహించే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభను సక్సెస్ చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు. ఉదయం 10 గంటలకే సభ ఉంటుందన్న ఆయన, పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మోడీ అభిమానులు ఈ సభలో పాల్గొనాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎలాగో సభాస్థలి వద్దనే ఉంటారని ఆయన తెలిపారు

LEAVE A RESPONSE