Suryaa.co.in

Andhra Pradesh

వచ్చే వారంలో సూపర్‌ సైక్లోన్ ముప్పు

– అప్రమత్తంగా ఉండాలి
-టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

ఏపీకి వచ్చే వారంలో సూపర్‌ సైక్లోన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు అ‌న్నారు.ప్రజలను నీటముంచి ఆ తర్వాత ప్రభుత్వం హడావుడి చేయడం కాదన్నారు.ప్రజలను వరదలకు వదిలేయకుండా ముందుగానే అప్రమత్తం కావాలని చంద్రబాబు హితవు పలికారు.

విపత్తు నష్టాలను, కష్టాలను తగ్గించడానికి సిద్ధమవ్వాలన్నారు. ఏపీకి సూపర్‌ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వచ్చే వారంలో సూపర్‌ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని చెబుతున్నారన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు.ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం అలసత్వమేంటో అంతా చూశామన్నారు.రాయలసీమలో వరదలు, గోదావరి వరదలకు ప్రభుత్వం అలసత్వం వహించిందని ఆరోపించారు.

“ఏపీకి సూపర్‌ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వచ్చే వారంలో సూపర్‌ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. ప్రజలను నీటముంచి ఆ తర్వాత ప్రభుత్వం హడావుడి చేయడం కాదు. ప్రజలను వరదలకు వదిలేయకుండా ముందుగానే అప్రమత్తం కావాలి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయాలి. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం అలసత్వమేంటో అంతా చూశాం. రాయలసీమలో వరదలు, గోదావరి వరదలకు ప్రభుత్వం అలసత్వం వహించింది.” అని చంద్రబాబు పేర్కొన్నారు.

విపత్తుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. విపత్తు తర్వాత బాధితులకు సాయం అందించడంలోనూ విఫలమైందన్నారు. గతంలో ఆర్టీజీఎస్‌ వ్యవస్థ ద్వారా విపత్తులను సమర్థంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు.ఆర్టీజీఎస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. విపత్తు నష్టాలను, కష్టాలను తగ్గించడానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.స్వచ్ఛంద సంస్థలు, తెదేపా వర్గాలు కూడా స్పందించాలని కోరారు.

LEAVE A RESPONSE