Suryaa.co.in

Andhra Pradesh

వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు 12 మంది తెదేపా సభ్యుల సస్పెన్షన్‌

అమరావతి: శాసనసభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 12 మంది తెదేపా ఎమ్మెల్యేలు, వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సస్పెండ్‌ చేశారు..సస్పెండైన తెదేపా ఎమ్మెల్యేల్లో బెందాళం అశోక్‌, కింజరాపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, పయ్యావుల కేశవ్‌, గద్దె రామ్మోహన్‌, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి ఉన్నారు. వీరిలో పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యేవరకు.. మిగిలిన వారిని ఈ ఒక్కరోజుకి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు..

LEAVE A RESPONSE