Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వానికి చెందిన ఆస్తులపై జగన్మోహన్ రెడ్డి గద్దలా వాలిపోతున్నాడు

• రూ.1500కోట్ల విలువైన స్టేట్ గెస్ట్ హౌస్ ని రుద్రాభిషేక్ అనే కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించడానికి సిద్ధమయ్యాడు
• రుద్రాభిషేక్ సంస్థకు ఉన్న అనుభవం ఏమిటి? అసలు ఆ సంస్థ ఎవరిది?
• ఎలాంటి టెండర్లు పిలవకుండా సదరు సంస్థకు రాష్ట్ర అతిథిగృహాన్ని ఎలా అప్పగిస్తారు?
• ఏపీ బిల్డ్ కార్యక్రమాన్ని హైకోర్టు అడ్డుకోవడంతో, ముఖ్యమంత్రి డెవలప్ మెంట్ ముసుగేసి ప్రభుత్వఆస్తులను తనవారికి కట్టబెడుతున్నాడు
• నేడు విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ ను కాజేయడానికి సిద్ధమైన ముఖ్యమంత్రి, రేపు విజయవాడనే కాజేస్తాడు
• అతిథి గృహాన్ని కాపాడుకోవడానికి విజయవాడ ప్రజలంతా మూకుమ్మడిగా పోరాడాలి.
• ఇలాంటివాటిని అడ్డుకోకుంటే, భవిష్యత్ లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి, ఆయన తాబేదార్లపరం అవుతాయి
* టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ
జగన్మోహన్ రెడ్డి ప్రజలకు, ప్రభుత్వానికి చెందిన ఆస్తులపై గద్దలా వాలుతూ తన్నుకుపోతున్నాడని, విజయవాడలోని రాష్ట్ర అతిథిగృహా న్ని కాజేయడానికి ముఖ్యమంత్రి కొత్తమార్గం ఎంచుకున్నాడని, బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులనుస్వాహాచేయాలన్న పాలకుల కుట్రలకు హైకోర్టు బ్రేకులువేయడంతో, మరోదారిలో స్టేట్ గెస్ట్ హౌస్ ను కబళించ డానికి సిద్ధమయ్యాడని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే …రుద్రాభిషేక్ అనే కన్సల్టెంట్ సంస్థ ఎక్కడిది..దానికున్న అనుభవం ఏమిటి? ఆ సంస్థ ఎవరి బినామీ? గుట్టుచప్పుడుకాకుండా రూ.1500కోట్ల విలువచేసే రాష్ట్ర అతిథి గృహాన్ని డెవలప్ మెంట్ పేరుతో ఆ సంస్థకు ఎలాకట్టబెడతారు? అసలు ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయత ఎంత? ఏ విధమైన టెండర్లు పిలవకుండా ప్రభుత్వం చాపకిందనీరులా ప్రభుత్వ అతిథిగృహాన్ని సదరుసంస్థకు అప్పగించాల్సిన అవసరమేం టి? స్టేట్ గెస్ట్ హౌస్ స్థానం లో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడం అంతామాయ. గెస్ట్ హౌస్ మొత్తం 3.25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. విజయవాడ నడిబొడ్డున అంతపెద్దమొత్తంలో ఉన్న విలువైన భవనాన్ని అనామకసంస్థకు ఎలాఅప్పగిస్తారని టీడీపీ తరుపున ప్రశ్నిస్తున్నాం.
రుద్రాభిషేక్ సంస్థ ముసుగులో జగన్మోహన్ రెడ్డి తన వారికి స్టేట్ గెస్ట్ హౌస్ ని అప్పగిస్తున్నాడని తాము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఆలోచనలు చూస్తుంటే, విజయవాడ బెంజ్ సర్కిల్ తోపాటు, నగరంమొత్తాన్ని తనకునచ్చినవారికి ధారాధత్తంచేసేట్టు ఉన్నాడు. గతంలో విజయవాడలో కెనాల్ గెస్ట్ హౌస్ అని ఉండేది. అది కాలువపక్కనే ఉండటంతో, ఉండటానికి శ్రేయస్కరం కాదని, దానికి బదులుగా గతంలో రాష్ట్రఅతిథిగృహాన్ని నిర్మించారు. మిషన్ ఏపీ బిల్డ్ తతంగాన్ని కోర్టు అడ్డుకోవడంతో , అభివృద్ధి అనే ముసుగేసి జగన్మోహన్ రెడ్డి సరికొత్తదారిలో స్టేట్ గెస్ట్ హౌస్ స్వాహాకు శ్రీకారం చుట్టాడు. ప్రభుత్వంచేసేపనులు, ఇచ్చేజీవోలు ఎవరికీ తెలియని వ్వడం లేదు. ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టడంలేదు.
గతంలో పారదర్శకమైన పాలన అందిస్తానని, తనవద్ద దాపరికాలు ఏవీ ఉండవని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడేమో ప్రజలకు ఏదీ తెలియ కుండా అన్నీ తనపరం చేసుకోవాలనుకుంటున్నాడు.
కేబినెట్ మంత్రులు 7 నక్షత్రాల స్థాయికి చేరారు. ఎక్కడికి వెళ్లినా భారీ భవనాలు, బహుళార్థ సముదాయాల్లోనే ఉంటున్నారు. ప్రత్యేక విమానా ల్లో విదేశాలకు వెళ్లి రాచకార్యాలు వెలగబెడుతున్నారు. విజయవాడకు తలమానికమైన రాష్ట్ర అతిథిగృహం ప్రభుత్వపెద్దలపరం కాకముందే నగరవాసులు మేల్కోవాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి చర్యలను ఆదిలోనే అడ్డుకోకుంటే, రూ.1500విలువైన గెస్ట్ హౌస్ కారుచౌకగా పరులపరం అవుతుందని హెచ్చరిస్తున్నాం. స్టేట్ గెస్ట్ హౌస్ ను కాపాడుకోవడానికి ప్రజలు, ప్రజాసంఘాలు, విజయవాడకుచెందిన మేథావు లు ఉద్యమించాలి.
విశాఖపట్నంలో 33ఎకరాల్లో ప్రభుత్వ అతిథి గృహాన్ని నిర్మిస్తున్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ అతిథిగృహాన్ని పరులపరం చేస్తూ, అభివృద్ధి పేరుతో ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడమేంటి? ప్రజలకు టీడీపీఎప్పుడూ అండగానే ఉంటుంది. స్టేట్ గెస్ట్ హౌస్ కాజేయడమనేది కేవలం విజయవాడకు మాత్రమే పరిమితమైన అంశంకాదు. ఈరోజు విజయవాడలోని భవనాలు, ఆస్తులు మాయమైతే, రేపు మరోనగరంలోనివి మాయం కావచ్చు. స్టేట్ గెస్ట్ హౌస్ జీఏడీ పరిధిలోఉంది. దానిలో అనేకమంది ప్రముఖులు గతంలో బసచేశారు. గవర్నర్లు, విదేశీప్రతినిధులు, భారతప్రభుత్వ రాయబారులు ఇలా ఎందరో ప్రముఖులున్నారు. అలాంటి గెస్ట్ హౌస్ కు మరమ్మతులు చేసి యథావిథిగా దాన్నికొనసాగించాలని కోరుతున్నాం. అంతేగానీ అభివృద్ధి ముసుగులో అమ్మేస్తాం…. అద్దెకిస్తామనే ప్రభుత్వ కుతంత్రాలను టీడీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించదని ఈ సందర్భంగా తేల్చి చెబుతున్నాం.

LEAVE A RESPONSE