బీజేపీ వాళ్ళది నోరా? మోరా?

– నల్లగొండ పోరాటాల గడ్డ, బీజేపీ ఆటలు సాగవు
– మునుగోడు లో బీజేపీ అబద్దాలతో గెలవాలనుకుంటే అది మూర్ఖత్వమే
– ప్రధాని రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదు
-ప్రధాని క్షమాపణ చెప్పి ఏడాది గడుస్తున్నా రైతులకు చేసిందేమీ లేదు
– 3 వేల పెన్షన్ అని దుబ్బాక లో అన్నారు,హుజూరా బాద్ లో అన్నారు.. ఇచ్చారా?
– మంత్రి టి. హరీష్ రావు

మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి అహంకారానికి-మునుగోడు ఆత్మగౌరవానికీ మధ్య జరుగుతున్నవని సీనియర్ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి అసలు ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి లేదన్నారు. మునుగోడు ప్రజలకు కృష్ణానీరు ఇప్పిస్తామని చెప్పే దమ్ముందా అని బీజేపీ నేలకు సవాల్ చేశారు. మోదీ ప్రభుత్వం వల్లే నల్లగొండకు కృష్ణాజలాలు రాలేదని విరుచుకుపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాజీ మంత్రి సి.లక్ష్మ రెడ్డి, పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తో కలసి విలేకరులతో మాట్లాడారు.

హరీష్‌రావు ఏమన్నారంటే… ప్రధాని హామీల అమలు కావడం లేదు.. బీజేపీ నేతలు మునుగోడు లో గోబెల్స్ లా మాట్లాడుతున్నారు.దుబ్బాక, హుజురాబాద్, ghmc ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలకు అంతే లేదు. ఆ హామీల్లో ఒక్కటైనా అమలైందా? 3 వేల పెన్షన్ అని దుబ్బాక లో అన్నారు,హుజూరా బాద్ లో అన్నారు.. ఇచ్చారా?ఇప్పుడు మునుగోడు లో మళ్లీ 3 వేలు ఇస్తామని అంటున్నారు. బీజేపీ వాళ్ళది నోరా మోరా? మేము 2016 రూపాయల పెన్షన్ అన్నాం ..ఇచ్చాం.దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 3 వేల పెన్షన్ ఇచ్చి ఇక్కడ మాట్లాడాలి.పీఎం మోడీ సొంత రాష్ట్రం లో పెన్షన్ 750 రూపాయలు కూడా ఇవ్వడం లేదు ఇక్కడ 3 వేలు ఇస్తారా?మహారాష్ట్ర లో వెయ్యి రూపాయలు కర్ణాటక లో 700 పెన్షన్ ఇస్తున్నారు.

బీజేపీ అంటేనే మోసం, జుమ్లా..జూటా.బీజేపీ కి భయం లేదు భక్తి లేదు, భాద్యత లేదు.
ఎన్నికలయ్యాక గొంగడి మాది కాదు చెప్పులు మావి కావు అనే బాపతు పార్టీ బీజేపీ.ghmc ఎన్నికల్లో బండి పోతే బండి అన్నారు.. గుండు పోతే గుండు అన్నారు.బండి ఇవ్వ లేదు గుండు ఇవ్వలేదు.
అరవింద్ పసుపు బోర్డు అన్నారు తేలేదు.దుబ్బాక లో రఘునందన్ ఎడ్లు బండి ఇప్పిస్తా అన్నారు.. ఇప్పియ్య లేదు. రఘునందన్ 3 వేల పెన్షన్ అన్నారు.. ఇప్పియ్య లేదు.సంజయ్ బండి అని ఇప్పియ్య లేదు.ఇపుడు రాజగోపాల్ రెడ్డి 3 వేల పెన్షన్ అని మళ్లీ మోసం చేస్తున్నాడు.వీళ్ళు చెప్పే మాటలు ప్రధాని మోడీ తో చెప్పించాలి.

నల్లగొండ పోరాటాల ఖిల్లా ,బీజేపీ మోసాలను అక్కడ నమ్మరు. రాజగోపాల్ రెడ్డి కి బీజేపీ లో చేరగానే అబద్దాలు బాగా వంట బట్టాయి. కోమటి రెడ్డి బ్రదర్స్ కు ప్రభుత్వ పరంగా అవకాశాలు వచ్చినా ప్రజలకు ఏమీ చేయలేక పోయారు.మిషన్ కాకతీయ కు మిషన్ భగీరథ కు నిధుల సాయం చేయాలని నీతి ఆయోగ్ చెప్పినా బీజేపీ 26 పైసల సాయం చేయలేదు. 26 పైసల సాయం చేయని బీజేపీ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి 3 వేల పెన్షన్ ఇప్పిస్తారట.. ఎవరు నమ్ముతారు?బీజేపీ ధరలు పెంచింది.. పేద ప్రజల నడ్డి విరిచింది.జీడీపీ ,రూపాయి విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి.బీజేపీ ప్రభుత్వం కృష్ణా జిల్లాల్లో వాటా తేల్చక పోవడంతో నల్లగొండ కు తీవ్ర నష్టం జరుగుతోంది.నల్లగొండ కు నీళ్లు ఇవ్వని బీజేపీ కి మునుగోడు లో ఓటు అడిగే హక్కు ఉందా?

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే బీజేపీ తెలంగాణ కు అన్యాయం చేస్తోంది.తెలంగాణ ఏర్పాటు నే ప్రశ్నించే విధంగా మోడీ మాట్లాడారు.నల్లగొండ జిల్లా మీద మునుగోడు మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటుంది కానీ మోడీ కి ఉంటుందా?ఫ్లోరోసిస్ ను నల్లగొండ ,మునుగోడు నుంచి పారదోలింది కేసీఆర్ కాదా?సూర్య పేట కు రెండు మెడికల్ కాలేజీ లు ఇచ్చాము. బీజేపీ పాలనలో ప్రజల ఆకలి పెంచారు.గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో మన స్థానం 107 కి దిగజారింది.ఇందుకేనా బీజేపీ కి మునుగోడు లో ఓటు వేయాలా? పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లా దేశ్ కన్నా దేశం లో అద్వాన్నంగా పరిస్థితులు దిగజారాయి.రాజగోపాల్ రెడ్డి అహంకారం గెలవాలా, మునుగోడు ఆత్మ గౌరవం గెలవాలా ప్రజలు ఆలోచించాలి.అసలు మునుగోడు లో రాజగోపాల్ ఉప ఎన్నిక ఎందుకు తెచ్చారు?రాజీనామా దేని కోసం చేశారు?

రాజగోపాల్ రెడ్డి ది ఆత్మ గౌరవ పోరాటం కాదు ఆస్తులు పెంచుకునే ఆరాటం.బీజేపీ అబద్దాల పప్పులు మునుగోడు లో ఉడకవు.మునుగోడు లో బీజేపీ అబద్దాల వీడియో లను ప్రతి ఇంటికి చేరుస్తాం.రాజగోపాల్ స్వార్థం కోసం ఉప ఎన్నిక తెచ్చారు. రాజగోపాల్ గెలిస్తే ఒక వ్యక్తి కి మేలు జరుగుతుంది.. ప్రభాకర్ రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుంది. నాగార్జున సాగర్ ,హుజుర్ నగర్ లో టీ ఆర్ ఎస్ గెలిచింది. అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంది.దుబ్బాక, హుజురాబాద్ లో బీజేపీ కేంద్ర మంత్రులు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు.. అమలు అయ్యాయా?విషయాలు తేట తెల్లమయ్యాయి.. ప్రజలకు బీజేపీ అబద్దాల గురించి తెలిసిపోయిందిబీజేపీ ని నమ్మడానికి మునుగోడు ప్రజలు అమాయకులు కారు. టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల ప్రచారం గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు మునుగోడు కు అమిత్ షా ను ఎందుకు తెచ్చారు?

Leave a Reply