కాంగ్రెస్‌కు జెల్ల కొట్టిన ప్రశాంత్‌కిశోర్!

– పార్టీలో చేరకుండానే జెండా ‘పీకే’శారు – ఆయన ఆ పార్టీకి సలహాలు మాత్రం ఇస్తారట – వెర్రిపుష్పమయిన మీడియా – నిజమయిన ‘సూర్య’ విశ్లేషణ (మార్తి సుబ్రహ్మణ్యం) అనుకున్నదే అయింది. యాపారమా? రాజకీయమా అన్న త్రాసులో కూర్చున్న ప్రశాంత్ కిశోర్ అనే బీహార్ రాజకీయ ఎన్నికల బేహారీ.. చివరాఖరకు యాపారాన్నే ఎంచేసుకున్నాడు. తననే నమ్ముకున్న కాంగ్రెస్‌కు జెల్ల కొట్టాడు. కాంగ్రెస్‌లో చేరాలా? వద్దా? అన్న మీమాంస కాలంలో అనేక రాజకీయ పార్టీ కంపెనీల వద్ద తన…

Read More

యాపారమా? రాజకీయమా?

– ఐ-పాక్‌ను ‘పీకే’స్తారా? – ఇదీ ‘సెల్ఫ్ మార్కెటింగ్’ ఎత్తుగడేనా? – తెరాసతో తెరచాటు బంధంపై తర్జనభర్జన – కాంగ్రెస్ కడు విషాద కథ ( మార్తి సుబ్రహ్మణ్యం) డజనుమందికి జన్మనిచ్చిన సుబ్బలక్ష్మికి సంతాన పరీక్ష పెట్టినట్లుంది కాంగ్రెస్ విషాద కథ. ఒక్కో రాష్ట్రాన్నీ బీజేపీ ఊడ్చేస్తుంటే.. ఆ అపజయ దు:ఖంలో ఉన్న కాంగిరేసు కష్టాలను కడతేర్చి, అధికార వియోగంలో ఉన్న ఆ పార్టీ నుదుట అధికార బాసికం కట్టేందుకు, బీహార్ నుంచి వచ్చిన బాహుబలిని తీసుకోవాలా?…

Read More