రాంగోపాల్ వర్మ అనే ఒక పరాన్న జీవి మీద సంఘ విద్రోహ శక్తి మీద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. అనుక్షణం అనునిత్యం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని
అవమాన పరుస్తూ వారి గురించి సంస్కారహీనంగా మాట్లాడుతూ.. వారి గౌరవానికి భంగం కలిగే విధంగా అనుక్షణం తన సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రాతలు రాస్తూ.. కూతలు కూస్తున్న రాంగోపాల్ వర్మ మీద సరైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. మరిన్ని ఆధారాలతో మరొక్కసారి, కమిషనర్ ని కలిసి ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలని, ఆర్జీవిని కఠినంగా శిక్షించాలని కోరడం జరుగుతుంది.
– ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి
జాతీయ అధికార ప్రతినిధి
తెలుగు దేశం పార్టీ.