Suryaa.co.in

Telangana

బీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్న తెలుగు వైబ్‌పై చర్యలు తీసుకోండి

– బీ ఆర్ ఎస్ పై అసత్య ప్రచారం చేస్తున్న తెలుగు వైబ్ ట్విట్టర్ హ్యాండిల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ ,సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీ ఆర్ ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ ,డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ,ఎర్రోళ్ల శ్రీనివాస్ ,అభిలాష్ రంగినేని ,కురువ విజయ్ కుమార్

హైదరాబాద్: తెలుగు వైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ సృష్టించి బీ ఆర్ ఎస్ పార్టీ పైన ,బీ ఆర్ ఎస్ అగ్ర నాయకత్వం పై కాంగ్రెస్ పార్టీ చిల్లర ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ ఏమన్నారంటే.. చెల్లని రూపాయికి గీతలెక్కువ. చేతకాని రేవంత్ రెడ్డికి చిల్లర ప్రచారాలు ,చిల్లర వేషాలు ఎక్కువయ్యాయి. తెలుగు వైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ సృష్టించి బీ ఆర్ ఎస్ పార్టీ పైన ,బీ ఆర్ ఎస్ అగ్ర నాయకత్వం పై కాంగ్రెస్ పార్టీ చిల్లర ప్రచారం చేస్తోంది. మా నేతలూ కేసీఆర్ ,హరీష్ రావు ల మధ్య విబేధాలున్నట్టుగా తెలుగు వైబ్ అదే పనిగా విషప్రచారం చేస్తోంది.

హరీష్ రావు తో కేసీఆర్ పై తప్పుడు పోస్టులు పెట్టడం ద్వారా బీ ఆర్ ఎస్ పార్టీ ని బద్నామ్ చేయాలనీ రేవంత్ రెడ్డి తెలుగు వైబ్ ద్వారా కుట్రకు తెరలేపారు. బీ ఆర్ ఎస్ కేడర్ మనోస్థయిర్యాన్ని అబద్దపు కథనాలతో దెబ్బతీస్తున్న తెలుగు వైబ్ పై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. తెలుగు వైబ్ వెనక ఉన్న వ్యక్తులను గుర్తించి తక్షణమే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరాము. భాద్యులను గుర్తించి చర్యలు చేపడతామని సంబంధిత పొలీసు అధికారులు హామీ యిచ్చారు.

డాక్టర్ ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ ఏమన్నారంటే.. తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించి బీ ఆర్ ఎస్ కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మా నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. సోషల్ మీడియా లో బీ ఆర్ ఎస్ పై అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై ఎన్ని సార్లు పిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదు.

కనీసం ఈ రోజు మేమిస్తున్న ఫిర్యాదు ఆధారంగానైనా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరాం. బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల పై అక్రమకేసులు పెడుతున్న పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఎన్ని దారుణాలు చేసినా పట్టించుకోవడం లేదు. బీ ఆర్ ఎస్ కు మద్దతుగా పోస్టులు పెడుతున్న వారిపై వరసగా కేసులు పెడుతున్నారు. కొందరిపై మళ్ళీ మళ్ళీ కేసులు పెడుతున్నారు. పోలీసులు వెంటనే నిస్పాక్షిక చర్యలు చేపట్టాలి.

ఐ ఏ ఎస్ ,ఐ పీ ఎస్ అధికారుల పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో కే టీ ఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకు ఐ ఏ ఎస్ ఐ పి ఎస్ అధికారుల సంఘాలు స్పందించాయి. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయో చెప్పాలి.

LEAVE A RESPONSE