– వాలంటీర్ల పోస్టులు కూడా అమ్ముకున్న అవినీతిపరుడు తమ్మినేని
– 10 కోట్ల విలువ చేసే ఇంటిని కొట్టేసిన దౌర్భాగ్యుడు తమ్మినేని సీతారాం
– ఆముదాలవలస శంఖారావం సభలో టిడిపి ఇన్ చార్జి కూన రవికుమార్
పడిలేచిన కెరటం, ఉప్పెనలా విజృంభిస్తున్న యువనేత లోకేష్ శంఖారావంతో జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అరాచకవాది, అవినీతిపరుడు, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు దిగమించి, 16నెలలు చిప్పకూడుతున్న సైకోతో ఈరోజు మనం యుద్ధం చేస్తున్నాం.
ఒక్కచాన్స్ అన్నవాడి టైం అయిపోయింది, శ్రీకాకుళం నియోజకవర్గ తీర్పు రాష్ట్రానికి దిక్సూచిగా నిలవబోతోంది.2014-19 నడుమ 50ఏళ్లలో ఒక నేత చేయలేని పనులను చంద్రబాబు నేతృత్వంలో నేను చేసి చూపించాను.
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించా, రోడ్డులోని గ్రామాలకు రహదారి వేశాం, ఇంకా మిగిలిపోయిన 34 గ్రామాలకు లోకేష్ మంత్రిగా ఉన్నపుడు 40కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులను తెచ్చి వినియోగించలేని అసమర్థుడు తమ్మినేని సీతారాం.
ఆముదాలవలసలో తాగడానికి నీళ్లులేని పరిస్థితుల్లో 22వార్డులకు నీళ్లిచ్చిన ఘనత చంద్రబాబుది. మున్సిపాలిటీలో తాగునీటికి నాడు 65కోట్లు మంజూరుచేయిస్తే, పూర్తిచేయలేని చేతగాని వ్యక్తి సీతారాం.
ఆముదాలవలసకు 3250 ఇళ్లు మంజూరు చేయించాం, ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇల్లు ఇవ్వలేదు. లోకేష్ పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నపుడు నాగావళి, వంశధార నదులనుంచి నీటిని అందించాలని 276 కోట్లు మంజూరుచేస్తే, చేతగాని దద్దమ్మ ఎమ్మెల్యే వాటిని రద్దుచేసి, కమీషన్ల కోసం ఇప్పుడు పైప్ లైన్ అంటున్నాడు.
టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేష్ సహకారంతో ప్రతిఇంటికీ నాగావళి, వంశధార నీళ్లు అందిస్తాం. ఈరోజు ఎక్కడ చూసినా దౌర్జన్యం, భోగి ఆంజనేయులు అనే కళింగవైశ్యుడి కుటుంబంలో వివాదాలను ఆసరాగా చేసుకున్న 10కోట్లు విలువచేసే ఇంటిని కొట్టేసిన దౌర్భాగ్యుడు తమ్మినేని.
రాజకీయభిక్షపెట్టిన పార్టీకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, గత అయిదేళ్లుగా అంగన్ వాడీ, అవుట్ సోర్సింగ్ పోస్టులు, వాలంటీర్ల పోస్టులు కూడా అమ్ముకున్న అవినీతిపరుడు సీతారాం.
2014-19లో కార్యకర్తలే కుటుంబంగా భావించి రేయింబవళ్లు కష్టపడి అభివృద్ధిచేశాను. నీతిగా పనిచేసినందుకు నాపై కేసులు పెట్టి వేధించారు. ఈరోజు నాపై 9కేసులున్నాయి. ఎన్ని కేసులు పెట్టినా నా సిద్ధాంతం మార్చుకోను.
నా వ్యాపారాలను దెబ్బతీయడమేగాక నాపై హత్యాయత్నం కేసు కూడా పెట్టించారు. టిడిపి వచ్చాక ఆముదాలవలస పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ సెల్ ఏర్పాటుచేస్తా, టిడిపి కేడర్ పై అన్యాయంగా కేసులు పెట్టిన పోలీసులను చట్టప్రకారం శిక్షిస్తాం.
శ్రీకాకుళం నుంచి ఆముదాల వలసకు 10కిలోమీటర్లు రోడ్డు వేయలేని అసమర్థుడు అభివృద్ధి చేశానంటున్నాడు.అబద్దాలకోరు జగన్ ఆముదాలవలస సుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తానని చెప్పి మాట తప్పి మడమతిప్పాడు.
సుగర్ ఫ్యాక్టరీ స్థానంలో పరిశ్రమ ఏర్పాటుచేసి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి. మన హయాంలో ఎంఎస్ఎంఇ పార్కుకు 400 ఎకరాలు అప్పగించాం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు వచ్చేలా చేయాలని కోరుతున్నా.
ఆముదాలవలస నుంచి పొందూరు వెళ్లే దారిలో నాగావళిపై వంతెన నిర్మించాల్సి ఉంది, ఇది పూర్తయితే 10నిమిషాల్లో రావడానికి వీలుంది, ఆ బ్రిడ్జిని పూర్తిచేయాల్సిందిగా విన్నవిస్తున్నా.
చంద్రబాబు బాటలో అభివృద్ధి బాటలో నియోజకవర్గాన్ని పయనింపజేస్తా. టిడిపి-జనసేన కార్యకర్తలంతా ఈ నియోజకవర్గంలో ఘనవిజయానికి కృషిచేయాలని కోరుతున్నా.