Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ అన్న.. ఇవన్నీ ఎర్ర బుక్కులో రాయండన్న!

– అధికారం వచ్చాక అబ్బా సంగతి తేల్చాల్సిందే
– ఆముదాలవలస శంఖారావం సభలో జనసేన ఇన్ ఛార్జి రామ్మోహన్

వంశధార-నాగావళి అనుసంధానానికి గత ప్రభుత్వంలో భూసేకరణచేసి, 68శాతం పనులు పూర్తిచేస్తే, జగన్ వచ్చాక అయిదేళ్లలో కేవలం 10శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిన అసమర్థుడు జగన్ రెడ్డి. 2నదుల అనుసంధానం జరిగితే రైతలు బాగుపడతారు, రైతులకోసమే తాను వచ్చానని చెప్పి మోసగించాడు.

వంశధార – నాగావళి కరకట్టల పనులు అంగుళం కూడా ముందుకు సాగించలేదు. దీనివల్ల ఆముదాలవలస,బూర్జ, సరబుజ్జిలి మండలంలో పంట చేతికొచ్చే సమయానికి వేలఎకరాల్లో పంట కోల్పోతున్నారు.

జగన్ కు రైతులు, యువతపై చిత్తశుద్ధి లేదు. ఆముదాలవలస సుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని పాదయాత్రలో మాటఇచ్చి ముఖం చాటేశాడు. ఆముదాలవలస – శ్రీకాకుళం రహదారికి 45కోట్లు మంజూరుచేస్తే, వైసిపి వచ్చాక పనులు నిలిపివేశారు.

మేం ఆందోళనలు చేస్తే మాపై భౌతికదాడులు చేసి కొట్టారు, ఇదంతా ఎర్రబుక్కులో రాయండన్నా. ఎన్నికల రిజల్డ్ వచ్చాక ఎర్రబుక్కు పవర్ చూపించాల్సిందే, 30సార్లు కోర్టుమెట్లు ఎక్కాను, నేను తమ్మినేనిలా ఇసుక దందాలు చేయలేదు.

టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చాక వదిలేది లేదు, అబ్బాకొడుకుల సంగతి తేల్చాల్సిందే.మేం 5లక్షలతో సొంత పార్కు ఏర్పాటు చేసుకుంటే పనికిరాని స్పీకర్ రిబ్బన్ కట్ చేయడానికి వచ్చారు. నేను అడ్డుకుంటే ఏంటి ధైర్యం అన్నారు.

నా ధైర్యం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్… నేను జనసైనికుడ్ని, జనసైనికులకు భయం ఉండదు. పొందూరు ఖద్దరుపై 2వేలమంది 200 రోజుకూలీకి పనిచేస్తున్నారు, దీనికి జాతీయస్థాయిలో మార్కెటింగ్ కల్పిస్తే మరో 10వేలమంది ఉపాధి కల్పించవచ్చు.

చంద్రబాబు, పవన్ లే కాదు నన్ను చూసినా జగన్ కు భయం, ఆముదాలవలస చక్కెర కర్మాగారం బకాయిలు అడుగుతానని చెప్పి 3సార్లు జగన్ జిల్లాకు వస్తే నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అయినా నేను భయను, ఆముదాలవలస నియోజకవర్గ అభివృద్ధికి టిడిపి-జనసేన ప్రభుత్వం కృషిచేయాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE