Suryaa.co.in

Andhra Pradesh

బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది జగన్‌

– కేబినెట్‌లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులిచ్చారు
– 9 రాజ్యసభ స్థానాల్లో 4 గురి బీసీలున్నారు..
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపుసోదరులంతా ఏకతాటిపైకొచ్చి జగనన్నకే మద్ధతిస్తున్నారు
– మంత్రి జోగి రమేశ్‌ వెల్లడి

చంద్రబాబును బీసీలెవ్వరూ నమ్మరుః
– రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది.
– నిన్నటిదాకా తన సొంత సామాజికవర్గం తప్ప మిగతా సామాజికవర్గాల వారందర్నీ చంద్రబాబు హీనంగా, చులకనగా చూశాడు.
– ఇప్పుడేమో రేపోమాపో ఎన్నికలగానే మళ్లీ ఆయన వేషం మార్చాడు.
– మీ తోకలు కత్తిరిస్తాం.. అంతుచూస్తానంటూ.. బీసీల్ని బెదిరించిన ఈ చంద్రబాబు మళ్లీ ఇప్పుడు బీసీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు.
– ఈరోజు జయహో బీసీ పేరిట పార్టీ కార్యక్రమం పెట్టుకుని అందులో ఆయనతో పాటు అచ్చెన్నాయుడు, బండారు సత్యన్నారాయణ, ఇంకా కొంతమంది బీసీలకేదో చేసినట్టు పెద్దపెద్దగా రంకేలేస్తున్నారు.
– చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు బీసీల విషయంలో ఎంతగా పశ్చాతాప్తం పడ్డా.. వాళ్ల మాటల్ని బీసీలు నమ్మరు గాక నమ్మరు.

బీసీలకు పెద్దన్నగా జగన్‌ కి ఆదరణః
– అణగారిన వర్గాలు, బడుగు, బలహీనవర్గాల్ని గుర్తించి వారిని అన్నివిధాలుగా అభివృద్ధిలోకి తెచ్చి అక్కునజేర్చుకుని బీసీలకు పెద్దన్నగా నిలిచిన ముఖ్యమంత్రి మా జగన్‌మోహన్‌రెడ్డి . అందుకే, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలంతా జగనన్న పట్ల ఆదరణ చూపుతూ మళ్లీ మా సీఎం నువ్వేనన్నా అని అంటున్నారు.
– 75 సంవత్సరాల దేశ చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిలబెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే.. ఏకైక వ్యక్తి మన జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అని చెప్పుకోవాలి.
– కేబినెట్‌లో 25 మంది మంత్రులుంటే.. అందులో 17 మందిని నాతో సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులిచ్చి గౌరవించిన ఘనత మన ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతోంది.
– 9 రాజ్యసభ స్థానాల్లో 4 స్థానాల్ని బలహీనవర్గాలకు కట్టబెట్టి బీసీల్ని అగ్రస్థానంలో నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకులు మా జగనన్న అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం.

LEAVE A RESPONSE