Suryaa.co.in

Andhra Pradesh

మాతో పొత్తు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా స్పందించాలి

– వాళ్ళు జాతీయ పార్టీతో మాట్లాడాలి
– కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది
– పొత్తుల అంశంపై చర్చించాము
– పొత్తులు మేము ఒక్కరం తీసుకునేది కాదు
– ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు
ఎపిలో డబల్ ఇంజన్ సర్కార్ వచ్చేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
– ఇచ్చిన హామీలు అమలు చేయని పరిస్థితిపై పోరాటం
– బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా కేంద్రం లో ని బిజెపి ప్రభుత్వం సహకారం అందించింది.వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా ఇది తేటతెల్లం అయింది. బిజెపి చాలా రాష్ట్రాల్లో అయిదు నుండి పది పర్యాయాలు అయా రాష్ట్రాల్లో గెలిస్తే ఇక్కడ ప్రాంతీయ పార్టీ లు ఒక్క సారి గెలవడానికి ఆపసోపాలు పడుతున్నారు. అంటే బిజెపి ఆయా రాష్ట్రాల లో అభివృద్ధి చేసి చూపిస్తోంది ఇక్కడ కూడా ప్రజలు ఆశీర్వదించాలి అభివృద్ధి మార్క్ చూపిస్తాం.

ఎపిలో రాజకీయ పరిస్థితులపై చర్చించాము. మా సూచనలు సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించాము. పార్టీ బలోపేతంపై ప్రధానంగా ఫోకస్ చేయాలని సూచించారు. 175 నియోజకవర్గాలలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని పరిస్థితిపై పోరాటం చేయాలని నిర్ణయించాం.

బీజేపీపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించాం. ఎపిలో డబల్ ఇంజన్ సర్కార్ వచ్చేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. బీజేపీలో కొత్త నేతల చేరికలపై దృష్టి సారించెలా చర్చించాం., ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు

టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తులపై సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు
పొత్తుల అంశంపై చర్చించాము.పొత్తులు మేము ఒక్కరం తీసుకునేది కాదు.మాతో పొత్తు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా స్పందించాలి.పొత్తు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు జాతీయ పార్టీతో మాట్లాడాలి.బీజేపీ ఎపిలో బలోపేతం చేయడం మాలక్ష్యం

ఎవరు పొత్తు కోరుకున్నది వాళ్ళు ముందుకు వస్తే పొత్తులపై ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. మేము పొత్తు కొరుకున్నమా లేదా అనేది మేము ఎందుకు చెప్తాము? పొత్తులపై ఏపి బీజేపీ ఏ నిర్ణయం తీసుకోవాలన్న మా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది.

LEAVE A RESPONSE