టీడీపీ-జనసేన క్లీన్ స్వీప్ వార్తతో తాడేపల్లి కొంపలో భూకంపం

• ఏపీ సీఐడీ ఇప్పుడు జోకర్ సంస్థగా మారింది
• ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది ఏపీని పసిగట్టింది
• ఏపీ ప్రజలు జగన్ రెడ్డి చీటి చించుతున్నారని తెలిసే. చివరి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు సొంతపార్టీ ఎమ్మెల్యేలు కూడా అతనికి ముఖం చాటేశారు
• రిపబ్లిక్ టీవీ పేరుతో వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి వదిలింది ఫేక్ సర్వే అని ఆ న్యూస్ ఛానల్ యాజమాన్యమే తేల్చింది
• మా సంస్థ పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న దుష్ప్రచారం నమ్మవద్దని, అలా చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది
• ఇండియా టుడే-సీఓటర్ తాజా సర్వేపై సాక్షి పత్రికలో సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుడురాతలు రాయించాడు
• 2019 ఎన్నికలకు ముందు ఇదే ఇండియా టుడే- సీఓటర్ సంస్థ రాష్ట్రంలో వైసీపీప్రభుత్వం గెలుస్తుందని చెప్పినపప్పుడు ఆహా..ఓహో అన్నవారు ఇప్పుడు మాత్రం ఆ సంస్థ సర్వేను నిస్సిగ్గుగా తప్పుపడుతున్నారు
• రిపబ్లిక్ టీవీ పేరుతో వదిలిన ఫేక్ సర్వే.. సాక్షిలో రాసిన తప్పుడు రాతలపై సజ్జల భార్గవ్ రెడ్డి.. రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి.
• జగన్ పని అయిపోయింది కాబట్టే అతనికి అమిత్ షా ముఖం చాటేశాడు
• ప్రజలు ఛీ కొట్టి జగన్ తో ఎవరు కలుస్తారు. ఆఖరికి కే.ఏ.పాల్ కూడా కలవడు
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఎలాఉందో, త్వరలో కొత్తగా కొలువుదీరేది ఏ ప్రభుత్వమో కొన్ని జాతీయ మీడియా సంస్థలు పసిగట్టాయని, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకా రం రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ- జనసేన కూటమి 60శాతం ఓట్లతో క్లీన్ స్వీప్ చేయనున్నట్టు తేల్చాయని, ఇండియా టుడే –సీ ఓటర్ సంస్థల సర్వే వివ రాలు వెల్లడైనప్పటినుంచీ తాడేపల్లి కొంపలో భూకంపం మొదలైందని టీడీపీ పొ లిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఎద్దేవాచేశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైందని తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాలు చూశాక ప్రజలకు అర్థమైంది. 26 మంది మంత్రుల్లో కేవలం ముగ్గురు, నలుగురు మాత్రమే సభకు రావడమే అందుకు నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి ముఖం చూడ టానికి మంత్రులతో పాటు, సొంతపార్టీ నేతలు కూడా ఇష్టపడటం లేదు. జగన్ పని అయిపోయిందని గ్రహించబట్టే, వారు అతన్ని దూరం పెడుతున్నారు.

జగన్ రెడ్డి నిర్వహించిన ఆఖరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అతనికి సొంతపార్టీ వారి నుంచి పరాభవం ఎదురైంది. గతంలో 2019లో టీడీపీప్రభుత్వంలో ఆఖరి సమా వేశాలు నిర్వహించినప్పుడు అధికారపార్టీ సభ్యులమైన మేమంతా కలుసుకొని, ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. మంత్రులు, ఎమ్మెల్యేలందరం కలిసి గ్రూప్ ఫోటోలు దిగాం. కానీ నేడు జగన్ రెడ్డి కేబినెట్ లో అలాంటి స్నేహపూర్వక వాతావరణం మచ్చుకైనా కనిపించలేదు.

2019లో ఇండియా టుడే – సీఓటర్ సర్వేపై ఆహా..ఓహో అన్నవారు, ఇప్పుడు అదే సంస్థ సర్వేను తప్పుపడుతున్నారు
గతంలో ఇండియాటుడే – సీ ఓటర్ సంస్థతో పాటు, కొన్ని జాతీయ మీడియా సంస్థలు 2019లో సర్వేలు చేసినప్పుడు రాష్ట్రంలో వైసీపీనే గెలుస్తుందని చెప్పా యి. అప్పుడు సర్వే తమకు అనుకూలంగా ఉండటంతో నాడు జగన్ రెడ్డి, అతని పార్టీ నేతలు ఆహా..ఓహో అని జబ్బలు చరుచుకున్నారు. ఇప్పుడు అదే మీడియా సంస్థలు రాష్ట్రంలో టీడీపీ-జనసేన కూటమి గెలవనుందని చెప్పడంతో అధికారంలో ఉన్నవారు అక్కసు వెళ్లగక్కుతున్నారు. సాక్షి దినపత్రికలో ఇండియాటుడే – సీ ఓటర్ సర్వేను తప్పుపడుతూ రాసిన కథనమే అందుకు నిదర్శనం. సలహాదారుగా ఉండి సజ్జల రామకృష్ణారెడ్డే ప్రజల సొమ్ము రూ.148 కోట్ల వరకు తినేశాడు. అలాంటి వ్యక్తి పర్యవేక్షణలో పనిచేస్తున్న సాక్షి మీడియా వాస్తవాలను, ప్రజాభిప్రాయాన్ని జీర్ణించుకుంటుందా?

రాష్ట్రప్రజల నాడి పసిగట్టి ఇండియాటుడే- సీఓటర్ సంస్థ వెల్లడించిన సర్వే వివరాలు ప్రజల్లోకి వెళ్లకూడదన్న దురుద్దేశంతోనే వైసీపీ సోషల్ మీడియా రిపబ్లిక్ టీవీ పేరుతో వైసీపీకి 132కు పైగా స్థానాలు వస్తాయంటూ ఫేక్ సర్వే వదిలింది
రాష్ట్ర ప్రజల నాడి పసిగట్టి స్పష్టమైన అభిప్రాయాలు వెల్లడించిన జాతీయ మీడియా సర్వేలను తప్పుపడుతూ, కొన్ని జాతీయ న్యూస్ ఛానళ్లు, దినపత్రికల పేరుతో ఫేక్ సర్వేలు వస్తున్నాయి. ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే వివరాలు ప్రజల్లోకి వెళ్లకూడదన్న దురుద్దేశంతో వైసీపీ సోషల్ మీడియా.. దానికి కొమ్ముకాసే కొన్ని మీడియాసంస్థలు ఫేక్ సర్వేలు వదులుతున్నాయి. రిపబ్లిక్ టీవీ పేరుతో వెల్లడించిన సర్వేఫలితాలు అందులో భాగమే. వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ గా ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డి రిపబ్లిక్ టీవీ సర్వే పేరుతో ఒక ఫేక్ సర్వేఫలితాలు వదిలాడు.

రాష్ట్రంలో వైసీపీకి 132 కు పైగా స్థానాలు రాబోతున్నాయని సర్వే పేరుతో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి వదిలాడు. వైసీపీ ఫేక్ సర్వేలపై రిపబ్లిక్ టీవీ యాజమాన్యం ఆ సర్వేకు, తమకు ఎలాంటి సంబంధంలేదని తమ న్యూస్ ఛానల్ పేరుతో ఎవరో కావాలనే ఫేక్ సర్వేలు వదిలి దుష్ప్రచారం చేస్తున్నా రని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. రిపబ్లిక్ టీవీ యాజమాన్యం వివరణపై వైసీపీ ఫేక్ గాళ్లు ఏం సమాధానం చెబుతారు?

సొంతతల్లి…చెల్లిపై కూడా జగన్ రెడ్డి తన ఫేక్ గాళ్లతో విషప్రచారం చేయిస్తున్నాడు
ఆఖరికి జగన్ రెడ్డి, అతని ఫేక్ గాళ్లతో కలిసి సొంత చెల్లి..తల్లి అని కూడా చూడ కుండా వారిపై కూడా విషప్రచారం చేయిస్తున్నాడు. కడుపున పుట్టిన చెల్లిని కూడా తన స్వార్థం కోసం జగన్ రెడ్డి బదనాం చేస్తాడని, ఆడబిడ్డను కూడా రోడ్డుకు ఈడ్చడానికి వెనుకాడడని అర్థమైంది. ఇలాంటి వ్యక్తి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడంకోసం తల్లిని, చెల్లిని ఏం చేయడానికైనా వెనుకాడడు.

జగన్ రెడ్డి హడావుడిగా పరుగులు పెట్టి మరీ ఢిల్లీ వెళ్లినా అమిత్ షా ముఖం చాటేశాడు. పనిఅయిపోయిన జగన్ తో కలవడానికి కేఏ పాల్ కూడా ఇష్టపడడు
మరో 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతుంటే, జగన్ రెడ్డి ఏం వెలగబెట్టడాని కి ఢిల్లీ వెళ్లాడు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది.. బీజేపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు. గతంలో ఎన్డీయేలో భాగస్వామిగా పనిచేసి, తర్వాత వివిధ కారణాలతో బయటకు వచ్చిన అన్ని పార్టీలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరలా సంప్రదింపులు జరుపుతోంది. ఆ క్రమంలోనే గతంలో కేంద్రప్రభుత్వంతో కలిసి పనిచేసిన టీడీపీ అధినేతను కూడా పిలిచారు. ఆయనవెళ్లి అమిత్ షా.. మోదీలతో చర్చలు జరిపా రు.

వారితో జరిపిన చర్చల వివరాలను త్వరలోనే చంద్రబాబు ప్రజలకు వివరిస్తా రు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడని, ఎక్కడ మోదీ…అమిత్ షాలు తన ఆటకట్టిస్తారో అన్న భయంతో పరుగులు పెట్టుకుంటూ, రాత్రికిరాత్రి ప్రత్యేక విమానంలో జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లాడు. చంద్రబాబుతో కలవొద్దు.. నేనే మీతో ఉంటాను… నన్ను కేసుల నుంచి కాపాడండి అని కేంద్ర పెద్దలను బతిమాలుకోవడానికి జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లాడు. జగన్ రెడ్డి ఎంత పరుగులు పెట్టి వెళ్లినా చివరకు అమిత్ షా అపాయిం ట్ మెంట్ దొరకలేదు. పనిఅయిపోయిన జగన్ రెడ్డిని కలవడానికి ఎవరూ ఇష్ట పడరు. ఆఖరికి కే.ఏ.పాల్ కూడా కలవడు.

ముడుపులు ముట్టచెప్పినా జగన్ రెడ్డికి, అతని విషప్రచారానికి సహకరించడానికి జాతీయ మీడియా సంస్థలు సుముఖంగా లేవు
తనను..తనప్రభుత్వాన్ని ప్రమోట్ చేయమని జగన్ రెడ్డి ఇప్పటికే కొన్ని జాతీయ మీడియా సంస్థలకు భారీస్థాయిలో ముడుపులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. వైసీపీ సోషల్ మీడియా, జాతీయ మీడియా సంస్థల పేరుతో తప్పు డు సర్వేలు చేసినట్టు తమకు అనుకూలంగా ప్రచారం చేస్తుందని, అందుకోసం తమకు, తమపార్టీకి, తమ పార్టీ సోషల్ మీడియాకు సహకరించాలని కొన్ని జాతీయ మీడియా సంస్థల్ని జగన్ రెడ్డి కోరాడు. కానీ ఆ సంస్థలు ఏవీ కూడా జగన్ రెడ్డికి సహకరించడానికి సుముఖంగా లేవని తేలిపోయింది.

తమ సంస్థ పేరుతో వైసీపీ సోషల్ మీడియా చేసిన ఫేక్ ప్రచారాన్ని రిపబ్లిక్ టీవీ ఖండించడ మే అందుకు నిదర్శనం. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఈవీఎంలపై వైసీపీకి వ్యతిరేకంగా నొక్కే నొక్కుడుతో జగన్ రెడ్డి గూబ గుయ్ మంటుంది. ఈవీఎంల నుంచి వచ్చే కుయ్ మనే శబ్దం… జగన్ రెడ్డికి మూర్ఛవచ్చేలా చేస్తుంది. ఇండియా టుడే – సీఓటర్ సర్వేకు ప్రత్యామ్నాయంగా వైసీపీకి అనుకూలంగా రిపబ్లిక్ టీవీ పేరుతో ఇచ్చిన తప్పుడు సర్వే ఫలితాలపై సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి సమాధానం చెప్పాలి. అలానే సీఓటర్ సర్వే నేతి బీర సర్వే అంటూ సాక్షి దినపత్రికలో రాసిన కథనంపై కూడా సజ్జల రామకృ ష్ణారెడ్డి స్పందించాలి. మూడ్ ఆఫ్ ది స్టేట్ పూర్తిగా మారిపోయిందనే కఠిన నిజాన్ని జగన్ రెడ్డి అతని నీలిమీడియా…కూలి మీడియా గ్రహించాలి.

తనపై ఉన్న అవినీతికేసులు.. బాబాయ్ హత్యకేసు నుంచి బయటపడటానికే చివరిసారి దింపుడు కళ్లం ఆశలతో జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లాడు
ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి ఇప్పటివరకు ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లాడు. కానీ రాష్ట్రానికి ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఆఖరికి కేంద్రప్రభుత్వం ఇంత నిధులిచ్చింది .. వాటిద్వారా ఇదిగో రాష్ట్రానికి ఈ బడ్డీకొట్టు తీసుకొచ్చాను అని కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ఢిల్లీ వెళ్లేది తనకేసులకోసం.. తన ప్రయోజనాల కోసమని చెప్పుకోకుండా రాష్ట్రానికి ఏదో తెస్తున్నట్టు చెప్పుకోవడం ప్రజల్ని మోసగించడం కాదా?

విశాఖ రైల్వేజోన్ కోసం రాష్ట్రప్రభుత్వం భూమి కేటాయించలేదని కేంద్ర రైల్వే మంత్రి చెప్పారు. రైల్వే జోన్ కు కేటాయించాల్సిన 58 ఎకరాల భూమి కూడా కాజేశాడు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సహా అన్నీ తీసుకొస్తానని చేతులు తిప్పి మరీ యాక్షన్లు చేశాడు. ఇన్నేళ్లు అధికారంలో ఉండి కేంద్రంలో ఉండే వాళ్లకాళ్లు..వీళ్ల కాళ్లు పట్టుకొని చివరకు రాష్ట్రంపై రూ.12లక్షల కోట్ల అప్పుల భారం మోపాడు. తన ఢిల్లీ పర్యటనపై తెలుగుదేశం వాళ్లు ఇష్టమొచ్చిన ట్టు మాట్లాడుతున్నారు.

అదినిజం కాదు.. ఇదిగో ఇవి సాధించడానికే ఢిల్లీకి వచ్చానని అక్కడే మీడియాతో చెప్పగల ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? జగన్ రెడ్డి చేసిన పాపాలన్నీ ముగింపుదశకు వచ్చాయి. ప్రజలు అతని, అతని ప్రభుత్వ చీటీ చించడానికి సిద్ధమైపోయారు. జగన్ రెడ్డి చివరిసారి దింపుడుకళ్లం ఆశలతో ఢిల్లీ వెళ్లింది ముమ్మాటికీ అతనిపై ఉన్న అవినీతి కేసులు… బాబాయ్ హత్యకేసు నుంచి బయటపడటానికే.

రిపబ్లిక్ టీవీ, మరికొన్ని జాతీయ మీడియా సంస్థల పేరుతో వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి చేస్తున్న ఫేక్ ప్రచారం ఏపీ సీఐడీకి కనిపించడం లేదా?
ఏపీ సీఐడీ గతంలో జగన్ రెడ్డి జేబుసంస్థగా ఉంటే, ఇప్పుడు జోకర్ సంస్థగా మారింది . ఎవరో ఏవో వీడియోలు పోస్ట్ చేశారని ఎక్కడో విదేశాల్లో ఉన్నవారిని కూడా వదలకుండా కేసులు పెట్టిన సీఐడీకి వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి రిపబ్లిక్ టీవీ పేరుతో విడుదలచేసిన ఫేక్ సర్వేపై ఎందుకు చర్యలు తీసుకోదు?

ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోలేని దుస్థితిలో ఏపీ సీఐడీ చీఫ్ ఉన్నారు. ముసలివాళ్లపై..ఎక్కడో విదేశాల్లో పనిచేసుకునే వారిపై…అమాయకులపై తప్పుడుకేసులు పెట్టి హింసించడానికి తప్ప, సీఐడీ దేనికీ పనికిరాదు.” అని బొండా ఉమా స్పష్టం చేశారు.

Leave a Reply