Suryaa.co.in

International Telangana

ఫిలడెల్ఫియా లో ప్రారంభమైన తానా సభలు

-మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ తో కలిసి పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
-ఎన్నారై లతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్న మంత్రి ఎర్రబెల్లి
ఎవరు ఎక్కడ ఉన్నా ఎన్నారై లు సహా తెలుగు ప్రజలు ఒక్కటే: మంత్రి ఎర్రబెల్లి

యుఎస్‌ఎ లోని ఫిలడెల్ఫియా లో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జూలై 7, 8, 9 తేదీల్లో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న తానా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ లతో కలిసి తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, అక్కడికి వచ్చిన ఎన్నారై లతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…. ఎవరు ఎక్కడ ఉన్నా, ఎన్నారై లు సహా, తెలుగు ప్రజలు ఒక్కటేనని, ఈ సభలకు ప్రతి సంవత్సరం హాజరవుతానన్నారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. ఎన్నారై లు అందరికీ మహా సభల శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE