– మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ
అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు – జాతీయ రహదారులు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తన ఆధ్వర్యంలో రెండు వేర్వేరు టాస్క్ ఫోర్స్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.
రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ క్లియరెన్స్ అనుమతులు, లెవెల్ క్రాసింగ్ మూసివేతలకు సంబంధించి అనుమతులు, యుటిలిటీస్ షిప్టింగ్, నిధుల విడుదల వంటి అంశాలను పర్యవేక్షించి, సమస్యలను పరిష్కరించి, వేగవంతంగా రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మందితో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కమిటీలో రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఎ ఛీప్ కమిషనర్, అటవీ శాఖ ప్రిన్సిపల్ ఛీప్ కన్సర్వేటర్, ఆర్ & బీ (ఆర్ ఎస్ డబ్ల్యూ) శాఖ చీఫ్ ఇంజనీర్, ఛీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (కనస్ట్రక్షన్ – వాల్తేర్), చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (కనస్ట్రక్షన్ – రోడ్ సేప్టీ ప్రాజెక్ట్స్ – సికింద్రాబాద్), ఛీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (కనస్ట్రక్షన్ – సికింద్రాబాద్), చీఫ్ ఇంజనీర్ (కనస్ట్రక్షన్ – బెంగళూరు) సభ్యులుగా ఉంటారు.
మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఈ కమిటీ ప్రతి నెల సమావేశం కావడంతో పాటు, రాష్ట్రంలో రైల్వే పనులను వేగవంతం చేయడానికి ఆయా సమస్యలు పరిష్కరించడంతో పాటు, తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడం జరుగుతుంది.